రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అవలంబిస్తుంది..

రష్యా ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అవలంబిస్తుంది

సల్మాన్ హైదర్ 

రష్యా ప్రధానంగా నాలుగు ముస్లిం తూర్పు ప్రాంతాలలో -చెచ్న్యా, డాగేస్తాన్, బాష్కోర్టోస్తాన్ మరియు టాటర్స్తాన్ (Chechnya, Dagestan, Bashkortostan, and Tatarstan) లో ఇస్లామిక్ బ్యాంకింగ్ పద్ధతులను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

రష్యన్ స్టేట్ డూమా(పార్లమెంట్) లో, రష్యాలో ఇస్లామిక్ ఫైనాన్స్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కొత్త బిల్లు ఇప్పటికే ఆమోదించబడింది. బిల్లు ప్రకారం భాగస్వామ్య ఫైనాన్సింగ్ సంస్థలు ముస్లిం తూర్పు ప్రాంతాలలో అభివృద్ధి చెందుతాయి. బ్యాంక్ ఆఫ్ రష్యా మార్కెట్‌ను నియంత్రిస్తుంది మరియు కంపెనీల రిజిస్ట్రీని నిర్వహిస్తుంది

ఖతారీ నాన్-ప్రాఫిట్ మీడియా అవుట్‌లెట్ మిడిల్ ఈస్ట్ మానిటర్ (MEMO), కథనం ప్రకారం రష్యా లో ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఉక్రెయిన్ విషయం లో రష్యా పట్ల విధింపబడిన పాశ్చాత్య ఆంక్షలకు ప్రతిస్పందన. ముస్లిం ప్రపంచంలో మరింత లాభదాయకమైన వాణిజ్యం కోసం, రష్యా మధ్యప్రాచ్యం మరియు ఆసియా వైపు చూస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయి. ది ఎకనామిస్ట్ యొక్క 2014 నివేదిక ప్రకారం, షరియా చట్టానికి కట్టుబడి ఉన్న ఆర్థిక సంస్థలు ప్రపంచ ఆస్తులలో 1% కలిగి ఉన్నాయి. ముస్లిం మరియు ముస్లిం మెజారిటీ దేశాలలో షరియా-అనుకూల బ్యాంకులు క్రమంగా విస్తరిస్తున్నాయి. 

2004లో, ముస్లిమేతర దేశంలో మొట్టమొదటి ఇస్లామిక్ బ్యాంక్ లండన్‌లో ప్రారంభించబడింది మరియు 2013లో, J.P మోర్గాన్ వినియోగదారులకు ఇస్లామిక్ బ్యాంకింగ్ ఎంపికలను అందించడం ప్రారంభించినది. ఇస్లామిక్ బ్యాంకింగ్ ఇప్పుడు ప్రతిచోటా ప్రజలకు ఒక ఎంపికలాగా మారింది.

రష్యన్ స్టేట్ డూమా ఆర్ధిక కమిటీ అధిపతి అనటోలీ అక్సాకోవ్‌ ప్రకారం "ఆసియా దేశాల నుండి- మలేషియా, ఇండోనేషియా మరియు అరబ్ దేశాల నుండి నిధులను ఆకర్షించే అంశం డూమా ఎజెండాలో ఉంది, ,."

ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు వాణిజ్య ఆచరణలో రష్యా యొక్క తాత్కాలిక ప్రవేశం పూర్తిగా ఊహించనిది కాదు. 2017 US స్టేట్ డిపార్ట్‌మెంట్ సర్వే ప్రకారం, రష్యా మొత్తం జనాభాలో ముస్లింలు దాదాపు 10% ఉన్నారు. వందల సంవత్సరాలుగా, రష్యా ఉత్తర కాకసస్‌లోని కొన్ని భాగాలను పాలించింది. చెచ్న్యా, డాగేస్తాన్, బాష్‌కోర్టోస్తాన్ మరియు టాటర్‌స్తాన్‌లలో గణనీయమైన ముస్లిం జనాభా ఉన్నందున, రష్యా ఇప్పుడు ఐరోపాలో అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది.

అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్‌

కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్‌ తెలిపారు. మొదటి రోజు ఎక్సైజ్ ఆదాయపన్ను, రవాణా శాఖల అధికారులతో, బ్యాంకువాళ్లతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర కానుకల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడా సీఈసీ బృందం భేటీ కానుంది.

రెండో రోజు పోలీస్ కమిషనర్లతో సమావేశమై జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుంది. ఇక మూడో రోజు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి డీజీపీ అంజనీ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. అంతేకాదు స్వీప్ ఎగ్జిబిషన్ సందర్శన, వివిధ వర్గాల ఓటర్లతో కూడా ఓటింగ్ విషయమై చర్చించనుంది.

నల్గొండలో సత్యశోధక్ సమాజ్" 150 సంవత్సరాల సభకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణలొ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ

  

 నేడు నల్గొండలోని గడియారం సెంటర్లో" మహాత్మ జ్యోతిబాపూలే" విగ్రహం వద్ద" సత్యశోధక్ సమాజ్" 150 సంవత్సరాల సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది .

ఈనెల 24న హైదరాబాదులోని" సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో" జరిగే ఈ సభను విజయవంతం చేయాలని, దాని కోసం జన సమీకరణతో పాటు వివిధ సన్నాహాలు చేయడం జరిగింది .

ఈ కార్యక్రమంలో సత్యశోధకు సమాజ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ ,    డాక్టర్" గాదే లింగస్వామి, బామ్ సేఫ్ నాయకులు నజీర్- అడ్వకేట్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు పాలడుగు నాగార్జున, PDSU నాయకులు కిరణ్ ,ఎఫ్. సి .ఐ ఉద్యోగ సంఘ నాయకులు మాధగోని బిక్షమయ్య గౌడ్ గారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు యాదయ్య, అభిలాష్ మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన   కట్టెల శివకుమార్ అధ్యక్షులు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం.

ఒడిశా ని వనికిస్తూన్న స్క్రబ్‌ టైఫస్‌ 180 మందికి పాజిటీవ్

ఒడిశా ని వనికిస్తూన్న స్క్రబ్‌ టైఫస్‌ 180 మందికి పాజిటీవ్

శివ శంకర్. చలువాది

ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ విజృంభిస్తోంది. 

బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. 

ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. 

మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు. 

సుందర్‌గఢ్, బర్గఢ్‌ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. 

రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు.

దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల

దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల

ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదని మంత్రి కొప్పుల 

జగిత్యాల జిల్లా//

ధర్మపురి SH గార్డెన్ లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన141మంది దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సుమారు 70 లక్షల విలువ గల ఉచిత సహాయక ఉపకరణాలను 1 బ్యాటరీ ఆపరేటర్ వీల్‌చైర్, 110 ఆపరేటర్ బ్యాటరీ ట్రైసైకిల్లు, 30 స్కూటీలు మొదలగు పరికరాలు అర్హులైన దివ్యాంగువకు పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

సమైక్య పాలనలో వికలాంగులను పట్టించుకోలేదు. వికలాంగుల శాఖ మొక్కుబడిగా ఉండేది, వారి అవసరాలను తీర్చేది కాదు, 

కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ దివ్యాంగులకు 200 ఇస్తుండే, వారిని ఈ దివ్యాంగులకు ఫించన్ పెంచాలని సోయి జ్ఞానం ఉందా అని మంత్రి ప్రశ్నించారు..

దివ్యాంగులను కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్న ఘనత సిఎం కెసిఆర్ గారిది, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది.

గతం లో కాంగ్రెస్ పార్టీ పాలనలో దివ్యాంగులకు 50 శాతం సబ్సిడీ కింద ఈ ఉపకరణాలు అందించారు, కాని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఈ ఉపకరణాలను ఉచితంగా అందించడం జరుగుతోంది.. కెసిఆర్ గారు ఒక మానవీయ కోణంతో ఆలోచించి, వారికి ఉచితంగా అందిస్తున్నారు

దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నది. దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది.

దివ్యాంగులకు వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పారు.

దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు.. ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మైస్థెర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు. 

వికలాంగులకు రూ.3016 పింఛన్ ను 4016 గా పెంచి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

ఏటా దివ్యాంగులకు రూ.1,800 కోట్లు పింఛన్‌ ఇస్తున్నాయని మంత్రి తెలిపారు. అర్హులైనవారు ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరికరాలు అందజేస్తామని చెప్పారు.

ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదని మంత్రి తెలిపారు 

అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళుతున్నారని మంత్రి తెలిపారు.

మానవత్వం చాటుకున్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.

మానవత్వం చాటుకున్న నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.

ఈనెల 03 వ తారీఖు నాడు నల్గొండ పట్టణం స్ధానిక 27 వ వార్డు నందు నివాసం ఉంటున్న సిగిలంభట్ల వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో మరణించారని విషయం తెలుసుకున్న ఎమ్మేల్యే భూపాలన్న గారు ఆరోజు వార్డు నకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారు ఉండటానికి కూడా నివాసం లేదని స్ధానిక కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్ గారి ద్వారా విషయం తెలుసుకుని వారితో మాట్లాడి వీలైతే గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తానని ఖర్చులకు అవసరాలకు నిమిత్తం 20వెలు రూపాయలు ఆర్థిక సహాయం కింద ఇస్తానని హామీ ఇచ్చి... ఇచ్చిన మాట ప్రకారం నేడు వారి కుటుంబ సభ్యులను పిలిపించి 20వేల రూపాయలను అందియడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ గారూ, పట్టణ జాయింట్ సెక్రటరీ ఒప్పల. మారుతి ప్రకాష్ గారు తదితరులు ఉన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా గురుకుల పాఠశాలలో మట్టి వినాయకుని బహూకరించిన సామాజిక కార్యకర్త, మానవ హక్కుల(NHRC)) డివిజన్ కార్యదర్శి సాధిక్ పాషా

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయకుడిని పూజించాలని నల్గొండ గురుకుల పాఠశాలకు మట్టి వినాయకుని బహుకరించిన సామాజిక కార్యకర్త సాధిక్ పాష

పర్యావరణాన్ని కాపాడే బాధ్యత దేశంలో ప్రతి ఒక్కరికి ఉందని, పర్యవరణాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యత నిర్వర్తించాలని, పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని, తన వంతుగా నల్గొండ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో మట్టి వినాయకుని బహుకరించి తన వంతుగా పర్యావరణ పరిరక్షణకై అడుగు వేశానని ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఇదే బాటలో నడవాలని ఈ సందర్భంగా సాధిక్ బాషా గారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, కత్తుల శంకర్, ఏ.టి.పి,డి.డబ్లు, అశోక రాణి మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

మరోసారి చిన్నారులపై వీధి కుక్కల దాడి గాయపడ్డ చిన్నారులు

వీధి కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారులను పరామర్శించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు

చిన్నారులపై కుక్కల దాడి జరగడం విచారకరం ఇలాంటి ఘటన పునవ్రతం కాకుండా చూసుకుంటాం....... దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు మున్సిపల్ చైర్మన్

భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణం: పురపాల సంఘం పరిధిలోని 23వ వార్డు మైనార్టీ స్కూల్ సమీపంలో ఉదయం ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో గాయపడ్డ చిన్నారులను ఇల్లందు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలాపాటి వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ..

చిన్నాలపై కుక్కల దాడి చాలా విచారకరమన్నారు. మళ్లీ ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే వందల సంఖ్యలో కుక్కలను రిహబిలైట్ సెంటర్ కి తరలించామని తెలియజేశారు.

రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం.. మీ సందేహాలను తెలుసుకోండి..

రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం

 రేషన్ కార్డు లో నమోదైయున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వారి యొక్క ఆధార్ కార్డుకు రేషన్ కార్డులో ఉన్న తమ పేరును అనుసంధానం  కావడానికి  ( ధ్రువీకరణ ) ekyc  చేయించుకోవాలి.మీ దగ్గర లో ఉన్న రేషన్ షాపుకువెళ్లి మీ వెలిముద్ర లేదా ఐరిష్ తో మీ ఆదార్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పేరు పైన వచ్చే బియ్యం నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి.కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు ekyc కొచ్చే సందేహాలు/నివృత్తి_ మా ఇంట్లో 5 మందిమి ఉన్నాము కార్డులో ఉన్న ఎవరమైన ఒకరము వచ్చి వేలి ముద్ర వేస్తే కాదు కార్డులో నమోదైయున్న ప్రతి కుటుంబసభ్యుడు కచ్చితంగా రేషన్ షాపుకు వచ్చి వేలిముద్ర లేదా ఐరిష్ ఇవ్వాల్సి ఉంటుంది

2) మా కార్డులో పేర్లు ఉన్న. అయిదు మందిలో ప్రస్తుతం ఇద్దరమే ఉన్నాము ,మిగతా ఇద్దరు బ్రతుకు. దెరురువుకొరకు బొంబాయి మరియు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లినారు ,మరి వారు వేలి ముద్ర వేయకపోతే బియ్యం లేదు ,తెలంగాణ రాష్ట్రంలో మీకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపుకైనా వెళ్లి మీ కార్డు నంబర్ చూయించి అందులోని మీ పేరును తెలిపి వెలిముద్ర ఇచ్చి ekyc పూర్తి చేసుకోవచ్చు.అయితె మీ పేరు నమోదైన షాపులో ekyc చేయించుకోవడం ఉత్తమం , ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు, వారు వచ్చినప్పుడు వెలిముద్ర ఇచ్చి ekyc చేయించుకోవచ్చును. 

3) మా ఇంట్లో ఇంకా నలుగురు పిల్లల యొక్క పేర్లు,, కొడుకులు /కూతుర్లు పేర్లు రేషన్ కార్డులో లేవు మరి వారి పరిస్థితి ఇట్టి ekyc అందరివి పూర్తి స్థాయిలో అయిపోయిన తరువాత అట్టి వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కావున రేషన్ కార్డులో పేరు లేని వారిని రేషన్ షాపుకు తీసుకురావాల్సిన అవసరం లేదు..

4) మా కోడలు పేరు వారి పుట్టింటి ఊరిలో ఉంది ,ఇక్కడ ekyc పుట్టింటి ఊరిలో వీరి పేరు రేషన్ కార్డులో నమోదై ఉంటే అక్కడి కార్డు నంబర్ వ్రాసుకొని వచ్చి ఇక్కడకూడా ekyc చేయించుకోవచచ్చు ఒకవేళ వీరి పేరు  కార్డులో తొలగించికొని ఉంటే అక్కడ గాని, ఇక్కడగాని, ekyc చేయించుకోవడానికి రాదు

5) ఇట్టి ekyc చేయించుకోవాడానికి రేషన్ షాపులో డబ్బులేమైన లేదు ఇట్టి పనిని పూర్తిగా ఉచితంగా నే చేయబడును..

6) రేషన్ షాపుకు కుటుంబసభ్యులు అందరు ఒకేసారి వచ్చి ekyc ఎవరు ఉంటే వారు ekyc చేసుకోవచ్చు,కాకపోతే షాపుకు వచ్చే ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డు లేదా కార్డు తీసుకరావలసి ఉంటుంది లేదా కార్డు నంబర్ వ్రాసుకు రావాలి..

7) మా ఇంట్లో కొందరివి వేలిముద్రలు కానీ కనుపాప కాని స్కాన్ కావడం లేదు వారి పరిస్థితి దగ్గర లో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి వేలి ముద్ర /కనుపాప ఇచ్చి మీ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకున్న తరువాత రేషన్ షాపుకు వచ్చి ekyc చేయించుకోవాలి,అక్కడ కూడా ఆదార్ నంబర్ కు అనుసంధానం కాకపోతే అట్టి వాటిపై ప్రభుత్వం ఏదైనా మార్గదర్శకాలు ఇవ్వవచ్చు ,వేచిచూడాలి

-:గమనిక:-

ఇట్టి eKyc ని రేషన్ షాపుల పని దినాలలో షాపులు తెరచివుంచిన సమయంలో ఎప్పుడైనా ,ఎక్కడైనా చేయించుకోవచ్చు..

మీకు ఇట్టి ekyc చేయించుకోవడంలో ఇంకెలాంటి సందేహాలున్న సంబంధిత తహసీల్దార్ గారిని గాని ,మీ స్థానిక డీలర్ ను గాని సంప్రదించగలరు.

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. కోజికోడ్ లో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. కోజికోడ్ లో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు

వైరస్ కారణంగా ఇద్దరి మృతి 

విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు

కోజికోడ్ కు చేరుకున్న కేంద్ర బృందం

ఇతర రాష్ట్రాల నుండి కేరళ వెళ్లే ప్రయాణికులు జాగ్రత.. అని హెచ్చరిస్తున్న.. ఆరోగ్య నిపుణులు

కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కోజికోడ్‌లోని పాఠశాలలు, కళాశాలలకు రేపటి వరకు సెలవులను పొడిగించింది. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కోజికోడ్ జిల్లాలోని అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు గత రెండు రోజులుగా సెలవులు ఇచ్చారు. అనవసర ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోజికోడ్ కలెక్టర్ ప్రజలను కోరారు. 

మరోవైపు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి ఒక బృందం కోజికోడ్ చేరుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆగస్టు 30న మరణించిన మొదటి వ్యక్తిని కాంటాక్ట్ అయిన హై-రిస్క్ కాంటాక్ట్ గ్రూప్‌లో ఉన్న వారందరి నమూనాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి నమూనాలను కూడా తీసుకొని ల్యాబ్‌కు పంపుతామన్నారు. వైరస్ సోకిన 9 ఏళ్ల బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.