జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం

Jammu Kashmir: రాజౌరీలో ఎన్‌కౌంటర్‌.. ఓ ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. నార్ల గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి..

అయితే ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. మంగళవారం రాజౌరీ జిల్లాలోని మారుమూల గ్రామంపై సెర్చ్ చేయడానికి వెళ్లిన భద్రతా బలగాల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు..

అంగన్‌వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..

అంగన్‌వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్‌ చేసింది.

అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌డ్రేట్‌ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు భృతి అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉద్యోగ విరమణ అనంతరం ఆసరా పెన్షన్‌ మంజూరు చేయనున్నట్లు జీవోలో పేర్కొంది.

సర్వీసులో ఉన్న అంగన్‌వాడీలు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20వేలు, హెల్పర్లకు రూ.10వేలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ధన్యవాదాలు తెలిపారు. మధురానగర్‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో ఆమె మంగళవారం అంగన్‌వాడీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యధికంగా అంగన్‌వాడీల వేతనాలను పెంచారంటూ గుర్తు చేశారు.

దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ముందుందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు అరకొరగా జీతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్‌ సమయంలో అంగన్‌వాడీల సేవలను గుర్తించి అవార్డులు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంగన్‌వాడీలు సమ్మె విరమించాలని సూచించారు. అంగన్‌వాడీలు కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చామని స్పష్టం చేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అంగన్‌వాడీలపై ఒత్తిడి తగ్గించేందుకు యాప్‌ సింప్లిఫైడ్‌ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను.. అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్న మంత్రి.. ఈ సందర్భంగా అంగన్‌వాడీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు, ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనన్నారు. రాష్ట్రం రూ.115కోట్ల భారాన్ని మోస్తుందన్నారు.

మోదీ ప్రభుత్వం కేంద్రం వాటాను 90శాతం నుంచి 60శాతానికి తగ్గించిందని.. రాష్ట్ర ప్రభుత్వాల వాటాను ప్రభుత్వం 40శాతానికి పెంచిందని చెప్పారు. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తుందని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాలకు తన వాటా కింద 40శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80శాతం, హెల్పర్ల వేతనాల్లో 82శాతం ఉండడం సీఎం కేసీఆర్‌ ఔదార్యానికి, అంగన్‌వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికెరీ, జేడీలు లక్ష్మిదేవి సునంద, అంగన్‌వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నల్లా భారతి, మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, టీఎన్జీవో నిర్మల, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

17న జాతీయ సమైక్యతా దినోత్సవం

17న జాతీయ సమైక్యతా దినోత్సవం

 ఈనెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

పబ్లిక్‌గార్డెన్స్‌లో జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్‌

జిల్లా కేంద్రాల్లో వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే ప్రధాన వేడుకల్లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, మండలి చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌, మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, విప్‌లు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తారని తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు.

కోతుల బెడదపై సర్కారు దృష్టి

గ్రామాల్లో కోతుల బెడద నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. సచివాలయంలో సోమవారం సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పంటలను ధ్వంసం చేస్తున్న కోతుల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలన్న హైకోర్టు సూచనలను ఈ సమావేశంలో సమీక్షించారు. తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలను అధికారులకు నిపుణుల కమిటీ సభ్యులు వివరించారు. సమీక్షలో పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లో జాతీయ జెండానుఆవిష్కరించనున్న ప్రముఖులు జిల్లా పేరు

ఆదిలాబాద్‌ గంప గోవర్ధన్‌

కొత్తగూడెం రేగా కాంతారావు

జగిత్యాల కొప్పుల ఈశ్వర్‌

భూపాలపల్లి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ ఎర్రబెల్లి దయాకర్‌రావు

గద్వాల టీ పద్మారావు

కామారెడ్డి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఖమ్మం పువ్వాడ అజయ్‌

కరీంనగర్‌ గంగుల కమలాకర్‌

అసిఫాబాద్‌ సుంకరి రాజు

మహబూబ్‌నగర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబాబాద్‌ సత్యవతి రాథోడ్‌

మంచిర్యాల బాల్క సుమన్‌

మెదక్‌ తలసాని శ్రీనివాస్‌

మేడ్చల్‌ చామకూర మల్లారెడ్డి

ములుగు ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు

నాగర్‌ కర్నూలు గువ్వల బాలరాజు

నల్లగొండ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నారాయణపేట వీ సునీతాలక్ష్మారెడ్డి

నిర్మల్‌ ఏ ఇంద్రకరణ్‌రెడ్డి

నిజామాబాద్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి

పెద్దపల్లి టీ భాను ప్రసాద్‌రావు

సిరిసిల్ల కే తారక రామారావు

రంగారెడ్డి పీ సబితా ఇంద్రారెడ్డి

సంగారెడ్డి ఎండీ మహమూద్‌ అలీ

సిద్దిపేట టీ హరీశ్‌రావు

సూర్యాపేట జీ జగదీశ్‌రెడ్డి

వికారాబాద్‌ పట్నం మహేందర్‌రెడ్డి

వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హనుమకొండ దాస్యం వినయ్‌భాస్కర్‌

వరంగల్‌ బండ ప్రకాశ్‌

భువనగిరి గొంగిడి సునీత

ఇక పొలాల్లోకి 'పాలమూరు' నీళ్లు

ఇక పొలాల్లోకి 'పాలమూరు' నీళ్లు

ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌ లిఫ్ట్‌లో మొదటి పంప్‌ను ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు.

మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

కొల్లాపూర్‌లో సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్ల పరిశీలన

ఇక పొలాల్లోకి పాలమూరు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతాయని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌ లిఫ్ట్‌లో మొదటి పంప్‌ను ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రపంచం నివ్వెరపోయే విధంగా సుజల దృశ్యాన్ని చూడబోతున్నామని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలో సీఎం కేసీఆర్‌ పర్యటన, బహిరంగ సభ స్థలాన్ని, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఐజీ షానవాజ్‌ ఖాసీం, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి సోమవారం మంత్రులు పరిశీలించారు. ఎల్లూరు రహదారిలోని బొంగురాలమిట్టలో బహిరంగ సభకు ప్రదేశాన్ని పరిశీలించి ఖరారు చేశారు.

అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అతి భారీ మోటర్లను ఉపయోగించి 300 మీటర్ల దిగువన ఉన్న కృష్ణా జలాలను సముద్రమట్టానికి 687 మీటర్ల ఎత్తున పంపింగ్‌ చేయనున్నట్టు తెలిపారు. ఇది సాంకేతిక రంగంలో ఒక గొప్ప విజయంగా నిలిచిపోనున్నదని చెప్పారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో నీటి గోస తీరనున్నదని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి రైతు బిడ్డలు, కూలీలు, ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలిరావాలని మంత్రులు పిలుపునిచ్చారు.

మైనార్టీల‌కు రూ. ల‌క్ష సాయం.. రెండో ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం..

మైనార్టీల‌కు రూ. ల‌క్ష సాయం.. రెండో ద‌శ త్వ‌ర‌లోనే ప్రారంభం..

తెలంగాణ‌లోని నిరుపేద మైనార్టీల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 100 శాతం సబ్సిడీతో ఈ ఆర్థిక సాయాన్ని ప్ర‌భుత్వం అందిస్తోంది.

మొద‌టి ద‌శలో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 19వ తేదీన‌ 10 వేల మంది మైనార్టీల‌కు రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది ప్ర‌భుత్వం.

ఈ క్ర‌మంలో రెండో ద‌శ ప్రారంభానికి కూడా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెండో ద‌శ‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రూ. 153 కోట్లు కేటాయించింది. ఈ ఆర్థిక సాయం పంపిణీనికి ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారుల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మైనార్టీల‌కు రెండో ద‌శ ఆర్థిక సాయం చేసేందుకు అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 120 మంది ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తొలి ద‌శ‌లో 10 వేల మంది ల‌క్ష రూపాయాల చొప్పున రూ. 100 కోట్లు పంపిణీ చేశారు.

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గొల్లగూడెం నల్లగొండ నూతన భవన శంకుస్థాపన మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ పట్టణ కేంద్రం నందు సోంత భవనం లేనందున రామగిరి సెంటర్ నందు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గొల్లగూడెం నల్లగొండ నూతన భవన శంకుస్థాపన మహోత్సవన్ని నల్లగొండ శాసనసభ్యులు గౌ" శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో నల్లగొండ PACS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, జిల్లా సహకార అధికారి, కిరణ్ కుమార్, జిల్లా అడిట్ ఆఫీసర్ గోలి శ్రీనివాస్, డైరెక్టర్లు రుద్రాక్షి వెంకన్న, సయ్యద్ హశం, దోటి అంజయ్య, తక్కెళ్ళ రేణుక, గుజ్జల జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ కె అనంత రెడ్డి, 48 వ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్, సర్పంచ్ పబ్బతి రెడ్డి రవీందర్ రెడ్డి, గుండెబోయిన జంగయ్య, టీఆర్ఎస్ నాయకులు బాషపాక హరికృష్ణ, ఈశం లింగయ్య, కోడుదల లింగయ్య, పెరిక యాదయ్య, ఆవుల అంజయ్య, మంద శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

కల్లుగీత కార్మికుల మహాధర్నా* *పోస్టర్ ఆవిష్కరణ

కల్లుగీత కార్మికుల మహాధర్నా 

 పోస్టర్ ఆవిష్కరణ

కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు నల్గొండ జిల్లాలో అంబేద్కర్ భవన్ లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండ వెంకన్న చౌగాని సీతరాములు గార్ల అధ్యక్షతన జరిగింది. ఈ ఆవిష్కరణకు 

రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మేకపోతుల వెంకటరమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు పోస్టర్ ఆవిష్కరణ చేశారు, వారు మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోవడం, కాళ్ళు చేతులు విరగడం, నడుము పడిపోవడం జరుగుతుంది.రాష్ట్రంలో రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు. వీరి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని, సేఫ్టి మోకులు ఇవ్వాలని,సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, 2023- 24 బడ్జెట్ లో గీత కార్మికులకు కేటాయించిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని, మునుగోడు ఉప ఎన్నికలలో KTR గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తదితర 18 డిమాండ్లు పరిష్కారం చేయాలని అన్నారు. 2023 సెప్టెంబర్ 22 న (శుక్రవారం) హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది గీత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

  ఈ కార్యక్రమంలో KGKS రాష్ట్ర ఉపాధ్యక్షులు యూ.వెంకట నరసయ్య, KGKS రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్,rtd ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్,రాష్ట్ర కమిటీ సభ్యులు ఉప్పల గోపాల్,జిల్లా ఉపాధ్యక్షులు కొప్పు అంజయ్య,జిల్లా సహాయ కార్యదర్శులు రాచకొండ వెంకట్ గౌడ్,జేర్రిపోతుల ధనుంజయ గౌడ్ మతాల లింగస్వామి నర్సింగ్ సైదులు బోల్లేపల్లీ రమేష్.కర్ణాటక లక్ష్మయ్య.దితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎమ్మెస్ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం విజయవంతం

టిఆర్ఎమ్మెస్ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం విజయవంతం

హైదరాబాదులోని బాచుపల్లిలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యాలయంలో ఈరోజు పెద్దమ్మ తల్లి పూజ చేసి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ రాష్త్ర కార్య నిర్వాహక అద్యక్షులు శంకరోల్ల సురేష్ లు మాట్లాడుతూ ..

ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్రములో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాడడానికి 2020 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఏర్పాటు చేసిన అతికాలంలోనే గ్రామ మండల జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకొని మత్స్యకారులకు బాసటగా నిలుస్తూ ముదిరాజ్ జాతి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు,

బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించినందుకు నిరసన తెలియజేస్తున్నామని మిగిలిన బిజెపి కాంగ్రెస్ టిడిపి బిఎస్పీలైనా ముదిరాజ్ లకు సీట్లు కేటాయించా లన్నారు,రాష్ట్రంలో అత్యధిక సంఖ్య జనాభా కలిగిన ముదిరాజ్ జాతికి ఏ నియోజకవర్గాల్లో నైతే ముదిరాజ్ ఓటు బ్యాంకు ఎక్కువుందో ఆ నియోజకవర్గాలలో ఆయా పార్టీలు సీట్లు కేటాయించకపోతే ఆ 25 నియోజకవర్గాలలో టిఆర్ఎమ్మెస్ తరఫున ముదిరాజ్ లను ఎమ్మెల్యే అభ్యర్తులుగా బరిలో నిలుపు తామని హెచ్చరించారు, ముదిరాజుల అభివృద్ధికి ఉద్యమం చేస్తున్న టిఆర్ఎమ్మెస్ ను ముదిరాజులందరూ పార్టీలకు అతీతంగా కులంలోని సంఘాలకతీతంగా ఆదరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని నరసింహ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి చెక్కల కాంచన, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సుభాషిని, మన్నే సురేశ్, దొంతి శేఖర్, బండారు మహేందర్, బండారు నారాయణ, పోతారం మాజీ సర్పంచ్ అశోక్,రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మల, సీనియర్ నాయకులు జెంగిటి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ మాజీ ఉప సర్పంచ్ పటేల్ గూడెం, నీరుడి అశోక్, చొప్పరి గోపాల్, కాసాని వెంకటేష్,జోగు ఆంజనేయులు, మెరుగు మైసయ్య, బుట్టి లింగస్వామి, పొట్లకాయల వెంకటేష్, సైదులు, నాగరాజు, ఐశ్వర్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంటున్న : నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంటున్న : నాగం

నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు అందజేసిన డా.నాగం వర్షిత్ రెడ్డి.

నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ, నల్లగొండ గోస నాగం భరోసా అనే కార్యక్రమంతో ముందుకు వెళుతూ ప్రజల్లో తన స్థానాన్ని ముద్రించుకున్నారు.

ఈసారి తనకు అవకాశం కల్పించినట్లయితే, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు.

మన దేశ ప్రత్యేకత తెలిపేలా కొత్త జెర్సీ...

సెప్టెంబర్ వచ్చిందని క్రికెట్ లవర్స్ తెగ ఆనంద పడిపోతున్నారు. ఎందుకంటే ఎన్నడూ చూడని క్రికెట్.. ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చూడబోతున్నాం. ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ స్టార్ట్ అయింది. మరో 20 రోజుల్లో వరల్డ్ కప్ మెగా టోర్నీ జరగబోతుంది.

దీనికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే క్రికెట్ ఆడనుంది. వీటితో పాటు భారత మెన్ క్రికెట్ మొదటిసారి మెగా టోర్నీలో పాల్గొనబోతుంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి చైనా వేదికగా ప్రారంభం కాబోయే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా పాల్గొనబోతుంది. దీనికోసం బీసీసీఐ పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

భారత్ - పాక్ మ్యాచ్కు వాన గండం.. ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఆసియన్ గేమ్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో క్రికెట్ టీం జెర్సీ ఇదేనంటూ ఓ మీడియా ఫొటోలు విడుదల చేసింది. దేశ వైవిధ్యం, ఏకత్వాన్ని తెలియజేసేలా ప్రత్యేకంగా ఈ జెర్సీని తయారుచేశారు.

కాగా, ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే భారత మహిళలు, పురుషుల క్రికెట్ జట్లకు బీసీసీఐ బెంగళూరులో క్యాంప్ ఏర్పాటుచేసింది. వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు విమెన్స్ టీంకు, 12 నుంచి 24వ తేదీ వరకు మెన్స్ టీంకు ట్రైనింగ్ ఉంటుంది.