నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 14:05

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శిగా మార్గం సతీష్ కుమార్ నియామకం

నల్లగొండ గాంధీనగర్ యాదవ్ భవన్ లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా మార్గం సతీష్ కుమార్ ని బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి సమక్షంలో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ వారికి నియాక పత్రం అందజేశారు.

నేటి నుంచి వారి సేవలు బీసీ సంక్షేమ సంఘానికి అందించాలని ,వారు పార్టీలకతీతంగా బీసీల ఐక్యత కోసం బీసీల రాజ్యాధికారం వచ్చేంతవరకు కట్టుకట్టుగా అన్ని ఉద్యోగ యువజన మహిళ విద్యార్థి సంఘాలు ఐక్యతగా ఉండి పోరాటం చేయాలని, ఈ సందర్భంగా వారి రాకతో బీసీ సంక్షేమ సంఘం మరింత బలోపేతం అవుతుందని జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు అలివేణి యాదవ్ జిల్లా ప్రచార కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కదట్ల ఎంకన్న యాదవ్ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి సతీష్ యాదవ్ తదితరులు ఉజ్వల్ సాయిరాం వెలుపల సాయిప్రసాద్ ఆకాష్ పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 13:02

నల్లగొండలో గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల

ప్రెస్ నోట్..

 నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు...

 గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని... పానగల్ లో ప్రారంభించారు...

ఈ సందర్భంగా కంచర్ల... గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రుణాలు అందించాలని  అదేవిధంగా కెసిఆర్ రద్దు చేసిన లక్ష రూపాయల రుణాన్ని కోపరేటివ్ బ్యాంకులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ PACS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, డైరెక్టర్లు రుద్రాక్షి వెంకన్న, సయ్యద్ హశం, దోటి అంజయ్య, తక్కెళ్ళ రేణుక, సెక్రటరీ కె అనంత రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, సూర మహేష్, యాటా శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్, కట్టా వెంకట్ రెడ్డి, ఆది రెడ్డి, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 08:52

కాళోజీ సేవలు చిరస్మరణీయం : సీఎం కేసీఆర్‌

కాళోజీ సేవలు చిరస్మరణీయం : సీఎం కేసీఆర్‌

తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు.

కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. 

తెలంగాణ భాషకు అస్తిత్వ సృ్పహను పెంచడంలో పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావుది కీలకపాత్ర అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.

సామాజిక సమస్యలను, అన్యాయాలను తట్టుకోలేక ప్రజల కోసం 'తన గొడవ'ను కవిత్వం ద్వారా సున్నితంగా ఆవిషరించిన కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున ప్రతియేటా పురసారాలను అందిస్తూ ప్రభు త్వం గౌరవించుకుంటున్నదని చెప్పారు. ఏటా ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురసారాన్ని ఈ సంవత్సరానికి అందుకుంటున్న ప్రముఖ కవి జయరాజుకు సీఎం మరోసారి అభినందనలు తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 08 2023, 21:02

హైదరాబాదులో రెండో విడత డబల్ బెడ్ రూమ్ పంపిణీ కోసం మంత్రి తలసాని విస్తృతస్థాయి సమావేశం పాల్గొన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపైన రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు హైదరాబాద్ నగరం ఒక్కొక్క 50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నాం

హైదరాబాద్లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ 9100 కోట్లు ప్రభుత్వానికి అయిన ఖర్చు 9100 కోట్లు, కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైననే హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం మాది అన్న కేటీఆర్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి అధికారులు కష్టపడి పూర్తి చేస్తున్నారు, వారికి అభినందనలు

మొదటి దశ 11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించాం

ఈనెల 21వ తేదీన రెండవ దశ దాదాపు మరో 13,300 ఇండ్లను మరోసారి అందించనున్నం అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు

అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదు

ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి బాధ్యత అధికారులకే అప్పగించింది

దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నాము, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం 

ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నాం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే

తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి కేటీఆర్

ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన కేటీఆర్

ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే

ఇండ్ల ఎంపికలో ఏదైనా ఇబ్బందులు జరిగితే వాటిని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచన

నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుంది

హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రి గారిని కోరారు. వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా అంగీకరించారు

హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయి.

 58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించింది

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం, పట్టాల రెగ్యులరైజేషన్, నోటరీ ఆస్తుల అంశం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 15 నుంచి 20వేల మందికి లబ్ధి కలిగింది

మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తాం.

నిజందాగదుక్షణంఆగదు

Sep 08 2023, 10:15

మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి SC వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని వినతి

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారికి వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

-బకరం శ్రీనివాస్ మాదిగ

ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్.

                                

 షెడ్యూల్డ్ కులాల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అదేవిధంగా ఈనెల 18 నుంచి జరగబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి ఎంపీలు స్పష్టమైన వైఖరి తెలియజేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో నిరాహార దీక్ష చేసే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ముందు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. కాబట్టి వర్గీకరణ విషయంలో కూడా కేసీఆర్ గారు సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. 

---------------------------------------

కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సౌటా కాసీం మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కో-కన్వీనర్ కరిగల్ల దశరథం మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ బుక్కాపురం మహేష్ మాదిగ, బొడ్డు శ్రీకాంత్, ఎడెల్లి అంజి, బరపటి రాజు, చింతకుంట్ల కుమార్, గుద్దేటి ప్రవీణ్, నాగన్న, తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 08 2023, 08:29

తెలంగాణ మాడల్‌ దేశమంతా కావాలి

తెలంగాణ మాడల్‌ దేశమంతా కావాలి

తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వివిధ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ పథకాలను అమలు చేస్తేనే రైతుల స్థితిలో మార్పు

అఖిల భారత రైతు సంఘాల నాయకుల డిమాండ్‌

బెంగళూరు రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రధానంగా చర్చ

కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: బీకేయూ నేత టికాయిత్‌

తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని వివిధ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం బెంగళూరులో కర్ణాటక సంయుక్త రాజ్య రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ పథకాలపై ప్రధానంగా చర్చించారు. పథకాల అమలు తీరును, రైతులకు కలుగుతున్న లాభాలను తెలంగాణకు చెందిన రైతు నేత కోటపాటి నరసింహనాయుడు వారికి వివరించారు. అనంతరం పలువురు రైతు సంఘాల నేతలు స్పందిస్తూ.. తెలంగాణ మాడల్‌ రైతు పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని నొక్కిచెప్పారు. ఇందుకోసం అన్ని రాష్ర్టాల్లో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఆదర్శం

స్వయంగా తెలంగాణలో పర్యటించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ పథకాలపై చర్చించానని జాతీయ రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయత్‌ తెలిపారు. ఇప్పటికే ఐదేండ్లలో రూ.73 వేల కోట్లు రైతుబంధు , రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులు, లక్ష కోట్లు ఉచిత విద్యుత్తు కోసం కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

త్వరలో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంయుక్త కిసాన్‌ మోర్చాలో కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు, దానివల్ల భారత రైతాంగం ఎదురోబోయే ముప్పు గుర్తించి వక్తలు వివరించారు. సమావేశంలో ప్రొఫెసర్లు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 22:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం సంగ్మా భేటీ

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తేనీటి విందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సీఎంలు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

సీఎం సంగ్మాను శాలువాతో సీఎం కేసీఆర్ సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సీఎంకు కేసీఆర్ వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కె వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 19:00

15న మరో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

15న మరో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం అవుతున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు.

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లుగా, ఈ ఈనెల 15న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని మంత్రి ఆదేశించారు. అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు సమావేశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయన్నారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని చెప్పారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3915 సీట్లు ఉన్నాయన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 18:05

ధరల అదుపులో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

ధరల అదుపులో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి

  ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆరోపణ.

 

సిపిఎం ఆధ్వర్యంలోనల్లగొండలో నిరసన ప్రదర్శన

   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు 

       

  సిపిఎం కేంద్ర పార్టీ పిలుపుమేరకు నల్లగొండలో స్థానిక సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ పెట్రోలు ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగాయని అన్నారు. దీని ప్రభావం వలన ప్రజలు కొనలేని తినలేని స్థితిలోకి నెట్టబడ్డారని అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారని వాటినుండి ప్రజల ను పక్కదారి పట్టించేందుకు కులం పేరా, మతం పేరా, ప్రాంతం పేరా అనేక అలజడలు సృష్టిస్తూ ప్రజల దృష్టి మరల్చే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నల్లధనం వెలికితీత ధరల నియంత్రణ అనే అంశాలు ఎక్కడ అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైనా ఇండ్లు ఇండ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మూడెకరాల భూమి ఇతర పథకాలు అర్హత ఉన్న ప్రజలందరికీ అందలేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని అన్నారు. మరోపక్క కార్మికుల వేతనాల్లో కోత ఉపాధి హామీ పనులను నిధులు కేటాయించకపోవడం పట్టణ కేంద్రాలలో ఉపాధి పనులు కల్పించడం లేదని అన్నారు. ఉపాధి హామీ పనులకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను గాలికొదిలి సనాతన ధర్మం అంటూ ఇండియా భారత్ అంటూ మతం కులం వాటిపైనే కేంద్రీకరిస్తూ ఘర్షణలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరారు 

      

*ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎం డి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ ,గంజి మురళీధర్, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, నాయకులు కుంభం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ నాయకులు, గాదె నరసింహ, పాక లింగయ్య, సలివొజు సైదాచారి, జిల్లా అంజయ్య, కొండ వెంకన్న , రాము, మంజుల, బొల్లు రవీందర్, మారయ్య, రుద్రాక్ష యాదయ్య, మహాబుబ్ అలీ, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 07 2023, 16:12

ఎలిషాల రవి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు

ఎలిషాల రవి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు

YRP ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు అభినందనలు తెలియజేశారు. 

రవిప్రసాద్ గారు YRP ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం చేయడంతో పాటు క్రీడలకు కూడా ఎంతో సహాయం చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దేవాలయాల అభివృద్ధికి, మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను మారుమూల గ్రామాలకు సైతం విస్తరించేటట్లు చేయాలని మేమందరం కూడా వారు చూపిన బాటలోనే నడుస్తామని తెలిపారు.