నిజందాగదుక్షణంఆగదు

Sep 05 2023, 21:25

తెలంగాణలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న డీపీ వరల్డ్

తెలంగాణలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న డీపీ వరల్డ్

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు.

తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో(NAFFCO) కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రంలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు డీపీ వరల్డ్ సంస్థ ప్రకటించింది. దుబాయ్‌లో కేటీఆర్‌తో డీపీ వరల్డ్ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇన్‌లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం డీపీ వరల్డ్ పెట్టుబడులు పెట్టనుంది. రూ. 165 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది. మేడ్చల్‌లో రూ. 50 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ నిర్మించాలని నిర్ణయించింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డీపీ వరల్డ్ లాజిస్టిక్స్‌లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. డీపీ వరల్డ్‌కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 05 2023, 21:18

1,06,65,000/- రూపాయల విలువ కలిగిన... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేసిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

 నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు... వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో..

 నల్లగొండ నియోజకవర్గానికి చెందిన 279 మంది... వివిధ ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న బాధిత లబ్ధిదారులకు 1,06,65,000/- రూపాయల విలువ కలిగిన... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నేడు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

 

ఇప్పటివరకు తాను శాసనసభ్యునిగాఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిది కొరకు 8250 దరఖాస్తులు పంపగా..అందులో LOC, CMRF చెక్కుల రూపంలో 6839 మందికి..32,74,03,850/- రూపాయలు అందజేశామని... ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందుకోవడంలో రాష్ట్రంలోనే నల్లగొండ నియోజక వర్గం అగ్రస్థానంలో ఉన్నదని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ..

పేద వర్గాల వారు... అనారోగ్యాల కారణాలవల్ల ప్రైవేట్ దవాఖానాలను ఆశ్రయించడంతో... ఆర్థికంగా చితికి పోతున్నారని... అందుకు వారికి ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కలుగుతుందని... ఇప్పుడు అన్ని ప్రభుత్వ దవాఖానాలు పూర్తి వసతులతో కార్పొరేట్ హాస్పిటల్ వైద్య సేవల అందిస్తున్నారని.. ముఖ్యంగా నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో... కొత్తగా అనేకమంది డాక్టర్లు అపాయింట్మెంట్ అయ్యారని.. 123 రకాల ల్యాబ్ టెస్ట్ హబ్ ను ఏర్పాటు చేశారని.. ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఒకవేళ నల్లగొండలో కాకుంటే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో... అతి తక్కువ ధరలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని.. అవసరమైతే అక్కడ ఆరోగ్యశ్రీ ఎల్ఓసిలు అందజేసే అవకాశం ఉందని దాన్ని ఉపయోగించుకోవాలని కోరారు...

 

ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు.. ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 05 2023, 10:15

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ..

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

కరీంనగర్‌ విద్యావిభాగం : దివ్యాంగ బాలలు, ప్రత్యేక అవసరాల పిల్లలు గల తల్లిదండ్రులు మనోధైర్యంతో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ గార్డెన్‌లో జిల్లా విద్యాశాఖ-సమగ్ర శిక్ష, అలీమ్‌కో వారి ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని ప్రత్యేక అవసరాల బాలలకు ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు.

కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ గోపి, మేయర్‌ వై.సునీల్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కె.విజయ, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జిల్లాలోని 172 మంది ప్రత్యేక అవసరాల బాలలకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను అందించారు. మంత్రి కాసేపు ప్రత్యేక అవసరాల బాలలతో ముచ్చటించారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 05 2023, 10:06

నెలాఖరులోగా రైతులకు కొత్త రుణాలివ్వాలి...

నెలాఖరులోగా కొత్త రుణాలివ్వాలి

రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.

సాంకేతిక కారణాలతో 1.6 లక్షలమందికి అందని రుణమాఫీ

వారికి వెంటనే జమచేసేలా చర్యలు

రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

బ్యాంకర్లకు మంత్రి హరీశ్‌ ఆదేశాలు

రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసిందని, మిగతావారికి ప్రాధాన్య క్రమంలో రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెప్తున్నాయని, ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యువల్‌ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9,654 కోట్లు తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలని తెలిపారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని వెల్లడించారు. దేశంలోనే ఎకడాలేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని తెలిపారు. ప్రతి రైతుకు రుణమాఫీ ప్రయోజనం అందాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు.

రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌

రుణమాఫీ సమస్యల పరిషారానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ ఆదేశించారు. దీనికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇబ్బంది ఉన్న రైతులు ముందుగా బ్యాంకు స్థాయిలో సంప్రదిస్తారని, అకడ పరిషారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకుంటారని తెలిపారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరఫున జిల్లాకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యువల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణ మాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. సమీక్షలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

నాలుగు కారణాలు.. మూడు మార్గాలు

ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందులో 17.15 లక్షల మంది ఖాతాల్లో నిధులు చేరాయని, సాంకేతిక, ఇతర కారణాల వల్ల 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని వివరించారు. వీరికి వెంటనే అందేలా చూడాలని బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవటం, అకౌంట్లు క్లోజ్‌ కావటం, అకౌంట్‌ నంబర్లను మార్చటం, బ్యాంకుల విలీనం కారణాల వల్ల సమస్య తలెత్తినట్టు అధికారులు మంత్రికి వివరించారు. వీటిపై చర్చించిన అనంతరం సమావేశంలో 3 పరిషార మార్గాలను గుర్తించారు.

1 ఆధార్‌ నంబర్ల సాయంతో రైతుల రైతుబంధు ఖాతాలను గుర్తించి అందులోకి రుణమాఫీ డబ్బు వేయటం. దీనివల్ల సుమారు లక్ష మందికి రుణమాఫీ డబ్బు అందుతుందని అంచనా వేశారు.

2 ఎన్‌పీసీఐ సాయంతో బ్యాంకుల్లోని రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి అందజేయాలని బ్యాంకులకు సూచించారు. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుందని, ఇలా సుమారు 50 వేల మందికి డబ్బు అందుతుందని చెప్పారు.

3 మిగతా 16 వేల మంది వివరాలను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను సేకరిస్తారని, ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని చెప్పారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 05 2023, 09:57

తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం: ప్రశాంత్‌ కిశోర్‌

తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం: ప్రశాంత్‌ కిశోర్‌

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని వెల్లడించారు.

వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అంచనా

కేసీఆర్‌కు తిరుగులేదు.. హ్యాట్రిక్‌ పక్కా

సరైన నాయకుడు లేని విపక్ష 'ఇండియా'

జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఎన్నికలపై కుండబద్దలు కొట్టిన పీకే

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని వెల్లడించారు. సోమవారం ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌లో కాం గ్రెస్‌, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తాయని చెప్పారు. విపక్ష ఇండియా కూటమిని ముందుకు నడిపే సరైన నాయకుడు లేడని, రాహుల్‌కు ఆ సామర్థ్యం లేదని అన్నారు. విద్యార్థులు పరీక్షల ముందు అరగంటసేపు పుస్తకం పట్టినట్టు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి కట్టారని చురకలంటించారు. తాను భవిష్యత్తులో ఏ పార్టీకి ఎన్నికల సమన్వయకర్తగా పనిచేయబోనని, తాను ఆ పని మానేశానని చెప్పారు. తన దృష్టి అంతా తన సొంత రాష్ట్రం బీహార్‌ అభివృద్ధిపైనే ఉన్నదని చెప్పారు. తాను బీహార్‌లో సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానని, అక్కడి ప్రజల కోసమే పనిచేస్తానని తేల్చిచెప్పారు.

ప్రశాంత్‌ కిశోర్‌ చెప్తే అంతే..

ప్రశాంత్‌ కిశోర్‌ 2012 నుంచి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2012లో గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోదీ వరుస విజయం సాధించడంతోపాటు 2014లో దేశప్రధానిగా అద్భుత విజయం సాధించడంలో కీలకంగా పనిచేశారు. బీహార్‌లో నితీశ్‌కుమార్‌ హ్యాట్రిక్‌ సీఎంగా గద్దెనెక్కడంలోనూ ఆయన కృషి ఉన్నది. అనంతరం పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా గద్దెనెక్కేందుకు కారణమయ్యారు. 2012 నుంచి ఇప్పటివరకూ ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని ఎన్నికల్లో ఆయన చెప్పిన పార్టీలే విజయం సాధించడం విశేషం.

నిజందాగదుక్షణంఆగదు

Sep 04 2023, 19:20

రైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలపై బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష

రైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలపై బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష

ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.

17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి.

సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదు. వీరికి వెంటనే అందజేయాలి. 

బ్యాంకు ఖాతాలు పనిచేయక పోవడం, అకౌంట్లను క్లోజ్‌ చేయడం, అకౌంట్‌ నంబర్లను మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు వివరించిన అధికారులు. చర్చించిన అనంతరం మూడు పరిష్కార మార్గాలు గుర్తింపు. 

1) ఆధార్‌ నంబర్ల సాయంతో రైతు బంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణ మాఫీ డబ్బు వేయడం, దీని వల్ల సుమారు మరో లక్ష మందికి రుణ మాఫీ డబ్బు అందుతుంది.

2) ఎన్‌.పీ.సీ.ఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయం. 

3) మిగతా 16వేల మంది వివరాలను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 04 2023, 18:04

పార్టీలకతీతంగా తన మిత్రుడు బిజెపి నల్లగొండ సీనియర్ నాయకునీ అంతిమయాత్రలో పాడే మోసి మరి నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల...

పార్టీలకతీతంగా తన మిత్రుడు బిజెపి నల్లగొండ సీనియర్ నాయకునీ అంతిమయాత్రలో పాడే మోసి మరి నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల...

 

మొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన బిజెపి సీనియర్ నాయకులు.ఓరుగంటి రాములు గారి పార్థివ దేహానికి. బంధువులు మిత్రులు అభిమానులు కుటుంబ సభ్యుల ఆశ్రునయనాల మధ్యన అంత్యక్రియలు నిర్వహించారు.. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. బిజెపి నాయకులతో కలిసి పాడే మోశారు.

ఈ కార్యక్రమంలో ఎంజి యూనివర్సిటీ సెనేట్ సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ వెంట ఉన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 04 2023, 17:55

నల్లగొండ స్వర్ణకారుల దీక్షకు సంఘీభావం తెలిపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

స్వర్ణకారుల దీక్షకు ఎస్సి,ఎస్టీ విద్యార్థి సంఘం సంఘీభావం

 ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ 

నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్ వద్ద స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా నిరాహారదీక్షకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ఐదు మెన్ కమిటీ రిపోర్ట్ పరిశీలన జరిపి స్వర్ణకార వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి అన్నారు.

జీవో ఎంఎస్ నెంబర్ 272 అమలుచేసి పోలీసుల అక్రమ రికవరీలను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెడ్మిడ్గా అమ్మకుండా ప్రభుత్వం జీవో అమలు చేయాలని ప్రభుత్వం ఇతర కులాలకు వృత్తిదారులకు అందిస్తున్న విధంగా స్వర్ణకారులకు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలను కల్పించాలని కట్టెల శివకుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి విజయ్ ,హరి ప్రసాద్ ,చేపూరి కిషన్, చేపూరి, రాజు, చేపూరి బ్రహ్మచారి , శివ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 04 2023, 17:45

జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు కల్పిస్తాం:డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు కల్పిస్తాం.

- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. 

జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు ఇవ్వడానికి బీఎస్పీ సిద్దంగా ఉన్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలిపారు. 

ఈ రోజు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ అధ్వర్యంలో పెండం ధనుంజయ్ తదితరులు కలిసి జనాభా ప్రాతిపదిక పద్మశాలిలకు 10-12 స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెప్టెంబర్ మూడో వారంలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, తప్పకుండా పద్మశాలిలకు 10-12 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 04 2023, 17:38

వినియోగదారులకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ షాక్.. ఛార్జీల బాదుడుకు ప్లాన్ రెడీ..

వినియోగదారులకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ షాక్.. ఛార్జీల బాదుడుకు ప్లాన్ రెడీ..

Facebook: ప్రపంచ వ్యాప్తంగా గతంలో ఉచితంగా సేవలందించిన పలు సంస్థలు మెల్లగా ఛార్జీలు బాదుడు మొదలెట్టాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్స్‌ లో ఈ ధోరణి ఇప్పడు పెరుగుతోంది

X(గతంలో ట్విట్టర్) పగ్గాలను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేపట్టిన తర్వాత ఈ తరహా విధానం ఊపందుకుంది. తాజాగా మరో ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం కూడా ఇదే బాటలో నడుస్తోంది

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు ఉపయోగించుకునేందుకు ఛార్జీలు విధించాలని మెటా భావిస్తోంది. ఈ తరహా పెయిడ్ సర్వీస్ సబ్‌స్రైబర్స్‌కు యాడ్స్ నుంచి విముక్తి కల్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకటనలతో కూడిన సేవలను మాత్రం ఎప్పటిమాదిరిగా ఉచితంగానే అందించడం కొనసాగిస్తుందని విశ్వసనీయ సమాచారం

అయితే ఈ ఛార్జీలకు సంబంధించిన ప్లాన్లు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మొదటగా పెయిడ్ సర్వీసులు యూరప్‌లో ప్రారంభం అవుతాయని సమాచారం అందినట్లు ప్రముఖ విదేశీ మీడియా సంస్థ పేర్కొంది. డేటా ప్రైవసీ సహా ఇతర స్థానిక ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.. ఈ సేవలకు సంబంధించి విధివిధానాలు రూపుదిద్దుకుంటున్నట్లు వెల్లడించింది

జూలైలో యూరోపియన్ యూనియన్‌ అత్యున్నత న్యాయస్థానం మెటాపై కన్నెర్ర జేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ ప్లాట్‌ఫారమ్స్.. తమ యాప్స్ ద్వారా సేకరించిన డేటాను షేర్ చేసుకోవడాన్ని తప్పుపట్టింది. పర్సనల్ యాడ్స్ కోసం అంగీకరించాల్సిందిగా వినియోగదారులను బలవంతం చేసిందనే అభియోగంతో.. ఐరిష్ నియంత్రణ సంస్థలు మెటాపై 390 మిలియన్ యూరోల జరిమానా కూడా విధించాయి. ఈ క్రమంలో పెయిడ్ సర్వీస్ తీసుకొచ్చే ముందు కంపెనీ ఆచితూచి అడుగులు వేస్తోంది.