ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టీచర్ బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది. యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు తెలిపింది.

తుది తీర్పుకు లోబడే బదిలీలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది...

CBI Court: జగన్‌, విజయసాయి విదేశీ పర్యటనలకు అనుమతిపై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌: యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ వేశారు..

దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇవాళ వాదనలు వినిపించిన సీబీఐ.. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది..

మరోవైపు, యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిందే. విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా ఇవాళ వాదనలు ముగిశాయి. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ.. కోర్టును దృష్టికి తీసుకెళ్లింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది..

AP: ఎస్‌ఐ ఫైనల్‌ ఎగ్జామ్‌ డేట్‌ ఖరారు.. ఎప్పుడంటే?

అమరావతి: ఏపీలో ఎస్‌ఐ పోస్టులకు ఫైనల్‌ రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో ఎస్‌ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక, ఏపీలో సివిల్‌, ఏపీఎస్పీ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Chandrababu: మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు: చంద్రబాబు

అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా మహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత తదితరులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.

''తెదేపా అధికారంలోకి రాగానే.. తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా రూ.15వేలు ఇస్తాం. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం ప్రకటించాం. పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. అవసరమైతే మరో సిలిండర్‌ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పీ-4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తాం. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అన్నీ చేయొచ్చు. ప్రస్తుత విధానాల వల్ల ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు. పేదవారికి అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడతాం. మనకు ఏమేం కావాలో ఇచ్చేందుకు చాట్‌ జీపీటీ వచ్చింది'' అని చంద్రబాబు అన్నారు..

Hyderabad: దారుణం.. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారం

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

వివరాల్లోకి వెళితే.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని బండ్లగూడలోని ఓ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు బాబా గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అతడు పరారయ్యాడు. దీనిపై అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. దెయ్యం పట్టిందంటూ యువతిని వారు ఇంట్లోనే బంధించారు..

ఆ తర్వాత తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్‌ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందంటూ భవానీనగర్‌ పోలీసులు వారిని అక్కడికే పంపించారు. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది..

TS News: రాజకీయాల్లోకి మరో నాయకుడి వారసురాలు

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు గుమ్మడి అనురాధ వెల్లడించారు..

సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య కూతురే గుమ్మడి అనురాధ. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజల అభీష్టం మేరకే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అనురాధ మీడియా సమావేశంలో వెల్లడించారు..

మా బాపు నన్ను మోసం చెయ్యడు !

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భావోద్వేగం

స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవటంతో.. తీవ్ర అసంతృప్తి అంతకుమించిన ఆవేదనతో ఉన్న రాజయ్య... ఆరు నూరైనా, నూరు నుటయాభై అయినా తాను మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ధర్మసాగర్ మండలంలో బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య.. ఇట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

దుక్కి దున్ని, నారు పోసి, కలుపుతీసి, పంట పండించి, కుప్ప పోశాక.. ఆ కుప్ప మీద ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటూ ప్రశ్నించారు.

పైన దేవుడున్నాడని.. దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నారన్న రాజయ్య.. రేపోమాపో తాను అనుకున్న కార్యక్రమం జరుగనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తానున్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని చెప్పుకొచ్చారు.

అయితే.. టికెట్ రాలేదన్న బాధతో మొన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలను చూసి భోరున విలపించిన రాజయ్య.. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆవేదనతో చెప్పారు. తన స్థాయికి తగిన పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయన మాట మీద తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తన అభిమానులందరూ సంయమనం పాటించాలంటూనే కిందపడి వెక్కి వెక్కి ఏడ్చారు.

.. ఉన్న కొన్ని రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలన్ని పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

.. ఇంతలోనే ఇలాటి కామెంట్లు చేయటంతో.. రాజయ్య మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చకు తెర లేచింది. ఇప్పటికే.. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లంతా తలో దారి చూసుకుంటున్న నేపథ్యంలో.. రాజయ్య ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. పార్టీ మారనున్నారా.. లేదా ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి గురించి ఏమైనా బాంబు పేల్చనున్నారా.. అన్నది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఆయన అనుకున్నది ఏం జరుగనుందో..?

కామారెడ్డి పై సీఎం కేసిఆర్ నజర్ !

- అభివృద్ది పనులపై ఆదేశాలు

- జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్య నేతలు

- నిధుల కేటాయింపు ప్రక్రియ పూర్తి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్య వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేయనున్నారు. దీంతో కామారెడ్డిపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అక్కడ పెండింగ్ లో ఉన్న పనులన్ని ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చింది. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న సమాచారంతో కేటీఆర్ కామారెడ్డికి కేటీఆర్ రూ.45 కోట్ల ఫండ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రూ.25 కోట్లతో ఏ పనులు చేపట్టాలో జీవో కూడా జారీ చేశారు.

కామారెడ్డి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రణాళిక గురించి కేసీఆర్ లేదా కేటీఆర్ అక్కడి అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు అధికారులు ప్రపోజల్స్ కూడా పంపారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు నీరందించేకు రూ.695 కోట్ల వ్యయంతో 3 రిజర్వాయర్లు నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. కామారెడ్డి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుకున్నారు.

కామారెడ్డి కీ కేసిఆర్ పోటితోనే మహర్దశ ?

కామారెడ్డిలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా పలు శాఖల్లో పనులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అవసరాలపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు నత్తనడక కొనసాగుతోన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ప్రాణహిత- చేవెళ్ల పథకంలో భాగంగా పనులు మొదలు పెట్టింది. సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గల్లోని 90 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు.కాంగ్రెస్ ఉన్నప్పుడు భూంపల్లి వద్ద రిజర్వాయర్ తో పాటు 2 మెయిన్ కెనాల్స్ పనులు కొంత జరిగాయి. ఆ తర్వాత 2014 తర్వాత పనులు నత్తనడక సాగుతోన్నాయి. భూ సేకరణ, రిజర్వాయర్ల్ నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు ఆపేశారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే 22 ప్యాకేజీ పనులకు మోక్షం లభించినట్లు అక్కడి వారు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేకలు మారుతాయని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ది కామారెడ్డి జరుగుంతుదని ఆశపడుతున్నారు.

ఛలో సూర్యాపేటకు బీఎస్పీ పిలుపు !

- గోర్లకు బర్రెలకు అమ్ముడుపోదామ ..

- మంత్రీ జగదీష్ రెడ్డి రౌడీ షీటర్

- బీసీ బిడ్డా జనయ్య యాదవ్ పై కుట్రలు సహించం

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్

సూర్యాపేట న్యూస్ ప్రతినిధి; 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓటమి భయంతో కాకపోతే మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతో బీసీ బిడ్డ అయిన వట్టె జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేస్తున్నాడు అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. జానయ్య మీద ఎన్నడు లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ యాక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నాడు ? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నడో సమాధానం చెప్పాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా ? జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018 లో గెలిచేటోడా ? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలె, తర్వాత రోజూ భయం భయంగా బతకాలెనా అని మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీశారు.

ఆయన కొడుకు పెళ్లికి యాభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిందుకా ? లేక ఆయనను సూర్యాపేట ప్రజలు ఆదరిస్తున్నందుకే మంత్రి జగదీశ్ రెడ్డి ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఆయన ఇంటికి బీయస్పీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినందుకా ? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా ? బీసీ . ఎస్సీ , ఎస్టీ , మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా) మీకు చంచాలుగానే బతకాల్నా అని మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నూటికి 99 % మంది ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా ? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా ? మీరు చేస్తేనేమో అది రియల్ ఎస్టేటు వ్యాపారం, భూములు వెంచర్లు అయితవి. మేం అదే వ్యాపారం చట్టబద్ధంగా చేస్తే కబ్జాలు అయితయా ? అంటే మీరే ఎప్పుడు డబ్బు సంపాయించాల్నా ? మేం ఎప్పుడూ బిచ్చగాళ్లుగానే ఉండాల్నా అని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలారా …

50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిండ్రన్న విషయం మర్చిపోయినమా అని బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అందుకే మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా.. తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్ కు వెన్ను దన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో గ్రామ గ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్ - జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలె. అందరూ గ్రామ దేవతల సాక్షిగా బొడ్రాయి దగ్గర ప్రమాణం చేయాలె అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మన కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడి దొరలకు మన గొల్ల-కుర్మ ఢోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బల, నగారా దెబ్బల రుచి చూపించాలె అని బహుజనులకు పిలుపునిచ్చారు. లక్షలాదిగా స్వచ్ఛందంగా నడురి సూర్యాపేటకు తరలి రండి అంటూ పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ దోపిడి దొంగ దొరల సంగతేందో సూద్దాము అని సవాల్ విసిరారు. పోలీసోల్లు సంపితే సద్దామి, కానీ మన బిడ్డను, మన ఇజ్జత్ ను కాపాడుకుందామి. దొరలందరూ ఒక్కటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలె. కలవాలె. నిలవాలె. గెలవాలె.. అందుకోసం అందరూ ఏకమై రండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వట్టే జానయ్య యాదవ్ కి అండగా నిలుస్తూ ఛలో సూర్యాపేటకు పిలుపునిచ్చారు.

నేడు నీలిరంగు చందమామ ఆవిష్కృతం

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.

ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..

కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..