Minister Karumuri: గెలిచే సత్తా లేక తప్పుడు కూతలు కూస్తున్నారు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సన్మాన సభలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదవులకు చట్ట సభల్లో అత్యధిక స్థానాలు ఇచ్చింది వైసీపీనేనని గుర్తు చేశారు..

రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు యాదవులే ఉన్నారని ఆయన తెలిపారు. యాధవులను గౌరవించింది జగన్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కష్టాల్లో తమ వెంట ఉంటా, అందరివాడిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు..

గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు.

పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. చంద్రబాబు, పవన్ లకు ప్రజలే బుద్ది చెప్పుతారని మంత్రి కారుమూరి అన్నారు. మరోవైపు వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడం పవన్ అవివేకం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు..

వేములవాడలో మహిళపై దొంగల దాడి

వేములవాడ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు.

భగవంత రావు నగర్ లోని పిల్లి శ్రీలత చిన్న కిరాణా కొట్టు నడిపిస్తూ జీవనోపాధి పొందుతోంది. సదరు మహిళ భర్త శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్ళగా, చిన్న కూతురు హైదరాబాదులో విద్యనుభ్యసిస్తుండగా సదరు మహిళా శ్రీలత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.

వివరాల్లోకి వెళితే ఆదివారం తెల్లవారుజామున శ్రీలత నివాసముండే ఇంట్లోకి సుమారు నాలుగు గంటలకు రాడ్ తో అనుమానితుడు ఇంటి ఆవరణలోకి చొరబడ్డాడు. ఏదో శబ్దం అయినట్లుగా అనిపించి గృహిణి పిల్లి శ్రీలత బయటకు వచ్చింది.

కాంపౌండ్ ఆవరణలోనే రాడుతో దాగి ఉన్న నిందితుడు ఒక్కసారిగా ఆమెపై రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు.అప్రమత్తమైన సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటిస్తూ అరుపులు కేకలు వేసింది. పెనుగులాటలో సదర్ దొంగ మెడలోని బంగారు చైన్లు లాగేందుకు ప్రయత్నించగా పుస్తెలతాడు కింద పడిపోగా మరో ఏడు గ్రాముల బంగారం చైన్ మాత్రం నిందితుడు లాక్కెళ్లినట్టుగా బాధితురాలు తెలిపింది.

సదరు దొంగ దాడి వ్యవహారం ఇంటి ఆవరణలో బిగించిన సీసీ కెమెరాలు దృశ్యాలు రికార్డు కావడంతో మహిళలపై దాడులకు ప్రయత్నిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.వేములవాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు....

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అపరచితుడు

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి ఓ ప్రయాణికుడు బయటకు వచ్చాడు.

హైదరాబాద్ వైపు వెళ్తున్న టాక్సీ పార్కింగ్‌లో అనుమానాస్పదంగా వేరే వ్యక్తులతో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు

ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద ఒక కిలో బంగారు ఆభరణాలు చూసి ఇంటలిజెన్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.

అతనిని విచారించగా జెడ్డా నుంచి వచ్చానని చెప్పాడు. అయితే విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు తిరిగి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. పూర్తి సమాచారం అందవలసి..

Tirumala: మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలు..

తిరుమల: తిరుమల నడక మార్గంలో చిరుత బాలికపై దాడిచేసి, ప్రాణాలు తీసిన నేపథ్యంలో అటవీ పరిసర గ్రామాలలో అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. చిరుతను బంధించేందుకు అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ చిరుత ముమ్మరంగా సాగుతోంది..

ఇందులో భాగంగా బాలికపై చిరుత దాడి చేసిన అటవీ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్‌ కెమెరాలతో చిరుత కదలికలను అటవీశాఖ పర్యవేక్షిస్తోంది..

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

వెహికల్‌ సైరన్‌ వేసి చిరుతను విజిలెన్స్‌ సిబ్బంది అడవిలోకి తరిమినట్లు చెప్పారు. కాలినడకన వెళ్లే భక్తులను కట్టుదిట్టమైన భద్రత మధ్య గుంపులుగా పంపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Mallikarjun Kharge: మీకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది: ఖర్గే

దిల్లీ: దేశ ఆరోగ్య వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు..

కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని విమర్శించారు. దేశంలోని 19 ఎయిమ్స్‌లలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు..

''కేంద్రంలోని దోపిడీ సర్కార్‌ దేశ ఆరోగ్య వ్యవస్థను అనారోగ్యంగా మార్చింది. మోదీజీ మాట్లాడే ప్రతి మాటలో కేవలం అబద్ధాలు మాత్రమే ఉంటాయి.

దేశవ్యాప్తంగా చాలా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, నిజం ఏంటంటే.. దేశంలోని ఎయిమ్స్‌లు తీవ్రంగా వైద్యుల, సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి.

కరోనా సమయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించింది. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో స్కామ్‌లకు పాల్పడ్డారు. కానీ, ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. మీ ప్రభుత్వానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది'' అని ఖర్గే ట్వీట్‌లో పేర్కొన్నారు..

తెలంగాణను మరో మణిపూర్ గా మార్చకండి: RS ప్రవీణ్ కుమార్

హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై అధికారి తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఒక వెటర్నరీ డాక్టర్‌కు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏం పని అని ప్రశ్నించారు. ఈ దుండగుడు ఎవరో డాక్టర్ హరిక్రిష్ణ అని అంటున్నారని, ఈయనను పశుసంవర్ధక శాఖ నుంచి క్రీడా శాఖకు ఎవరు బదిలీ చేశారని, ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు.

ఈయన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడనేనా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతనికి 2025 దాకా డెప్యుటేషన్ ఇచ్చిండు అని ప్రశ్నించారు. హరికృష్ణ-శ్రీనివాస్ గౌడ్ మంత్రి వ్యవహారాల మీద లోతైన విచారణ జరిపి ఈ కీచకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

బాధిత బిడ్డలపై, మహిళల మీద సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం గౌరవమున్నా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అర్జెంటుగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘

మీ పిల్లలకొక న్యాయం, మా పేద పిల్లలకొక న్యాయం ఉండొద్దు. తెలంగాణను మరో మణిపూర్‌గా మార్చకండి’ అంటూ ట్వీట్ చేశారు...

లైంగిక వేధింపులకు పాల్పడితే అవసరమైతే ఉరి తీయిస్తాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థినులపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. స్కూల్‌లోని కీచక అధికారి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు పత్రికలో వచ్చిన కథనం తీవ్ర కలకలం రేపింది.

కాగా, ఆదివారం ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందిచారు. విద్యార్థునుల పట్ల నీచంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్‌‌ను కోరారు.దీంతో ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే రియాక్ట్ అయ్యారు.

విద్యార్థునులపై వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. పత్రికలో వచ్చిన వార్తలపై విచారణ జరిపించాలని ఆదేశించామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని.. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత మహిళల రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో కోరామని గుర్తు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు తెలిసిందని.. దీంతో గంట వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

వేధించినట్లు రుజువైతే అధికారిని జైలుకు పంపిస్తాం.. అవసరమైతే ఉరి తీయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ..

మహానగరంలో జాతీయ జెండాకు అవమానం..!

రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులకు, పాదచారులకు షాక్ ఇచ్చే విధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరిట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం, మినిస్టర్ కేటీఆర్, నగరవాసులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటుచేసిన

ఈ ఫ్లెక్సీలో జాతీయ జెండాలోని మూడు రంగులను తారుమారు చేశారు. త్రివర్ణములలో రౌద్రానికి ప్రతీక అయినా ఎరుపు రంగు పైన ఉండవలసింది, సస్యశ్యామలానికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగు ఎగువ బాగాన ముద్రించారు.

ఈ ఫ్లెక్సీని చూసిన వాహనదారులు, రాకపోకలు సాగించే సాధారణ జనం అధికారులకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు. కాస్త విస్మయాన్ని కుడా వ్యక్తం చేస్తున్నారు...

జనగామ జిల్లాలో సెల్ఫీ వీడియో తీస్తూ భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

జనగామ జిల్లాలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. సెల్ఫీ వీడియో తీస్తూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.

ఇరుగు, పొరుగువారు గమనించి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది.

నర్మెట్ట మండలం, సూర్యబండతండా గ్రామానికి చెందిన గురు, సునీత భార్యాభర్తలు. తమ భూమిని కొంతమంది దళారులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగులు మందు సేవించి ఆత్మహత్యయత్నం చేశారు. భూమి కబ్జా చేసిన వారి పేర్లు సెల్ఫీ వీడియోలో బాధితులు పేర్కొన్నారు....

వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీ పార్టీకి రాజీనామా?

జిల్లాలో బీజేపీ కి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి తన రాజీనామా లేఖ ను పంపారు.

రాజీనామా లేఖలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ లపై ఆరోపణలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించి తెలంగాణకు న్యాయం చేస్తాదని భావించి అనేకమంది ఉద్యమకారులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు.

బీజేపీ, తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని ఆరోపణలు వస్తున్నాయని.. అందువల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

కాగా గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు చంద్రశేఖర్ దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం....