*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు-పాల్వంచ డీఎస్పీ వెంకటేష్*
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పాల్వంచ డిఎస్పి వెంకటేష్ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.నేషనల్ హైవే పై డివైడర్లను అనధికారికంగా కట్ చేసి ఏర్పాటు చేసుకున్న మార్గాలు, ఆ కారణంతో జరిగిన ప్రమాదాలు, మృతి చెందిన వ్యక్తుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పట్టణంలోని ప్రధాన సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పనితీరును, బ్లూ కోట్ సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా, ఆ కారణంతో జరిగే రోడ్డు ప్రమాదాలకు బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా హోంగార్లు ట్రాఫిక్ ఉల్లంఘన ల ఫోటోలు తీయవద్దని , ఆ పనిని ఎస్ఐ స్థాయి అధికారికి కేటాయించాలని సీఐ వినయ్ కుమార్ కు సూచించారు.
Aug 11 2023, 13:25