నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 18:48

రాహుల్‌పై 'ఫ్లయింగ్‌ కిస్‌'ఆరోపణ.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు!

దిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul gandhi) అనుచితంగా ప్రవర్తించారంటూ భాజపాకు చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు.

అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి బయటకు వెళుతూ వెళుతూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) పేర్కొన్నారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తొలుత రాహుల్‌ మాట్లాడారు. తన ప్రసంగం ముగిసిన కాసేపటికే ఆయన బయటికెళ్లారు. వెళ్తూవెళ్తూనే ఆయన ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు.

రాహుల్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఆయన తన ప్రవర్తనతో మహిళలను అవమానించారని ఆరోపిస్తూ.. భాజపా మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లేఖపై 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరమైన సంజ్ఞ చేశారని అందులో పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి కాంగ్రెస్‌ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై భాజపా ఎంపీ పూనమ్ మహాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రెస్‌ గ్యాలరీలో కూర్చున్నవారికి ఆయన వ్యవహరించిన తీరు కనిపించి ఉంటుంది. ఆ ప్రవర్తన సిగ్గుచేటు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎలా ప్రవర్తించాలో తెలిసుండాలి' అని విమర్శించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆయన ఆ సంజ్ఞ చేయలేదని పేర్కొన్నాయి..

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 18:47

ViZag: పవన్‌.. ఈ 10ప్రశ్నలకు సమాధానం చెప్పండి: మంత్రి అమర్నాథ్‌

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడో విడత వారాహి యాత్ర ఈనెల 10 నుంచి విశాఖలో జరగనుంది. ఈనేపథ్యంలో వారాహి యాత్ర లక్ష్యంగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్.. జగన్‌ను తిట్టడానికే విశాఖ వస్తున్నారని విమర్శించారు.

''బ్రో సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ లేవు. పవన్‌ లాగా రీల్‌ హీరో కాదు.. రియల్‌ హీరో జగన్‌. అనకాపల్లిలో సెక్షన్‌ 30 ఎప్పుడూ అమల్లో ఉంటుంది. విసన్న పేటలో 600 ఎకరాలు కబ్జా చేశామని నా మీద ఆరోపణలు చేశారు.. నాకు సెంటు భూమి కూడా లేదు. అత్తారింటికి దారేది అంటే.. విశాఖ, ముంబయి, రష్యా గుర్తుకు వస్తాయి.

విసన్నపేటకు పవన్‌ కల్యాణ్‌ వస్తే నాకు అభ్యంతరం లేదు. విశాఖకు ఈ దసరాకి ముఖ్యమంత్రి కానుక ఇస్తారు'' అని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. విశాఖ, ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై నిలదీయడానికి ప్యాకేజీ స్టార్‌ వస్తున్నారట అంటూ పవన్‌కి పది ప్రశ్నలు సంధించారు. విశాఖ వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలకు పవన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నలివే...

ఏం సాధించారని వారాహి యాత్ర చేస్తున్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి?

విశాఖలో మీ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పండి?

175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్‌ చెప్పాలి?

జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడి పేరు చెప్పాలి?

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పుడు స్వాగతిస్తున్నామని పవన్‌ చెప్పలేదు. తెదేపా స్టాండే.. జనసేన స్టాండ్‌.

భాజపాతో పొత్తు ఉన్నా విశాఖలో స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్‌ అడ్డుకోలేదు.

జనసేన పార్టీ భాజపాతో సంసారం, తెదేపాతో సహజీవనం చేస్తోంది.

ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అన్నారు.. ఇప్పుడు లడ్డూలు తీయగా ఉన్నాయా?

ఉద్దానంలో ఆసుపత్రి నిర్మిస్తే కనీసం సీఎం జగన్‌ను అభినందించలేదు?

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వాలంటీర్లకు పవన్‌ క్షమాపణ చెప్పాలి.

పుంగనూరు ఘటనలో 45 మంది పోలీసు అధికారులకు గాయాలు అయ్యాయి.. పోలీసు కొడుకుని అని చెప్పుకునే పవన్‌ స్పందించాలి

అని మంత్రి అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు..

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 18:46

ChandraBabu: నన్ను చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో తేలాలి: చంద్రబాబు

విజయనగరం: ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అంగళ్లు ఘటనలో తనపై హత్యాయత్నం కేసు నమోదు సహా వివిధ అంశాలపై విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు..

దీనికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అంగళ్లులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని.. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తనను చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో ఈ విచారణలో తేలాలన్నారు..

సైకో సీఎం ఆదేశాల ప్రకారమే..

''నాపై హత్యాయత్నం చేసి.. తిరిగి నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదెక్కడి దుర్మార్గమో నాకు అర్థం కావట్లేదు. ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా నాపై దాడి జరిగింది. చాలాసార్లు నాపై దాడికి యత్నించారు.

సైకో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే.. నన్ను ప్రజల మధ్య తిరగనీయకుండా చేయడానినే ఈ కేసులు పెడుతున్నారు. దాడికి కుట్ర పన్నితే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు..

తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టారు

పుంగనూరులో వైకాపా నేతలు రోడ్డు మీదకు ఎందుకు వచ్చారు? పోలీసులు వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. వందలాది తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టారు. ఘటనాస్థలిలో లేని వారిపైనా కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు సైతం అమానుషంగా వ్యవహరించారు. అందుకే అక్రమ కేసులు, దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాను. అసమర్థనాయకుడు సీఎం అయితే.. వ్యవస్థలు ఇలానే ఉంటాయి'' అని చంద్రబాబు మండిపడ్డారు..

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 18:45

గృహలక్ష్మీ దరఖాస్తుకు రేపే చివరి గడువు

హైదరాబాద్‌:ఆగస్టు09

ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలోఅవకాశం కల్పిస్తారు.

పదో తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను రెండోవిడతలో పరిశీలించాలని నిర్ణయించారు.

జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపికచేస్తారు.

జిల్లా మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితాను సిద్ధంచేస్తారు. కొన్ని జిల్లాల్లో 15 వ తేదీలోగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతుండగా, ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు...

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 10:38

3 లక్షలకు 30 కండిషన్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ మహిళలకు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది.

ఈ స్కీమ్ కింద సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.3 లక్షలు సాయంగా అందించనున్నది. మహిళ పేరు మీదే డబ్బులు ఇస్తామని మార్గదర్శకాల్లో జూన్ 21న ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళలు వారి పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈ స్కీమ్‌తో ఆ సర్టిఫికెట్ తీసుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ‘మీ సేవ’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

మరి కొద్ది మంది మండలాఫీసులకు క్యూ కడుతున్నారు. స్కీమ్ కింద వచ్చే సాయం కోసం గడువు తక్కువగా ఉండడంతో ఆ లోపే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందడం వారికి కత్తిమీద సాములా మారింది.

ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు

‘గృహలక్ష్మి’ పథకానికి అప్లై చేయాలంటే పట్టణ ప్రాంతాల్లో గరిష్ట వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షకు మించి ఉండొద్దని ప్రభుత్వం సీలింగ్ విధించింది. ఆ ప్రకారం మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉన్నది.

ఇప్పటికే చాలా పథకాలకు మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం తలెత్తలేదు. కానీ ఈ స్కీమ్‌ కేవలం మహిళలకు మాత్రమే ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఒకే తరహా విధానాన్ని అమలు చేయడం లేదు. దీని బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పడంతో ఒక్కో డిస్ర్టిక్‌లో ఒక్కో తీరులో షెడ్యూల్ ఖరారైంది...

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 10:25

Rahul Gandhi: అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్‌ ప్రసంగం..!

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాల కూటమి(I.N.D.I.A.) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No-Confidence motion)పై బుధవారం కాంగ్రెస్‌ పార్టీలోని కీలక నేతలు ప్రసంగించనున్నారు.

నేడు పార్టీ తరఫున గళం విప్పేందుకు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), రేవంత్‌ రెడ్డి, హిబి ఇడన్‌ పేర్లను పంపినట్లు పార్టీకి చెందిన మాణికం ఠాగూర్ పేర్కొన్నారు.

పరిస్థితులను బట్టి ప్రసంగాల క్రమంలో మార్పులు ఉండొచ్చని వెల్లడించారు.

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆయన పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించనున్నారు.

దీంతో ప్రభుత్వాన్ని ఆయన ఏవిధంగా ఇరుకున పెడతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాహుల్‌ నిన్ననే ప్రసంగిస్తారని ప్రచారం జరిగినా.. అది వాయిదాపడింది..

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 10:11

ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు... ఏఐ టూల్‌కిట్‌తో గుర్తింపు..

విజయవాడ నగరంలో ఒకే వ్యక్తికి ఏకంగా 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఏఐ టూల్ కిట్ ద్వారా టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించి, విచారణకు ఆదేశించింది.

అలాగే అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే,

విజయవాడ నగరంలోని గుణదలలో ఒక వ్యక్తికి 658 సిమ్ కార్డులు జారీ కావడంతో టెలికమ్యూనికేషన్ అప్రమత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒకే ఫోటోతే, ఒకే నెట్‌వర్క్‌కు చెందిన ఈ సిమ్ కార్డులను విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్టు గుర్తించారు.

అలాగే, అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 వరకు సిమ్ కార్డులు, నకిలీ పత్రాలతో జారీ అయినట్టు గుర్తించారు. వీటిని ఏఐ టూల్‌కిట్‌ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించింది. ఒకే ఫోటోతో జారీ అయిన సిమ్ కార్డులు ఎక్కడికి వెళ్లాయి. వాటిని ఎవరు, ఎందుకోసం వినియోగిస్తున్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 09:33

తండ్రి మందు కొట్టాడు.. కుమారుడు విమానం నడిపాడు.. కూలిపోయింది..

బ్రెజిల్‌లో ఓ విమానం కూలిపోయింది. ఇందుకు కారణం 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడపడమే. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా తండ్రి పక్క సీట్లో బీర్ తాగినట్టు కనిపిస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా అనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

విమానంలో తండ్రీకొడుకులు గారాన్ మాయా, కుమారుడు ఫ్రాసిస్కో మాయాతో రాండోనియా నగరం నుంచి బయలుదేరారు.

మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకునేందుకు దిగారు. ఆ తరువాత బాలుడిని క్యాంపో గ్రాండేలోని అతడి తల్లి వద్ద దిపేందుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే ఆత్మహత్య చేసుకుంది.

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 09:31

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 09

తిరుమలలో భక్తుల రద్దీ నేడు బుధవారం కొనసాగుతోంది.

స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని మంగళవారం 73,879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

నిజంనిప్పులాంటిది

Aug 08 2023, 11:35

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం..

మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులపై చూపండి..

ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారు: చిరంజీవి..

ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టండి: చిరంజీవి

ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి: చిరంజీవి

ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు: చిరంజీవి

వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు