*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి*
రోడ్డు ప్రమాదాల నివారణ పై పాల్వంచ పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ట్రాఫిక్ అంతరాయాలు, ట్రాఫిక్ రూల్స్ పై ప్రయాణికులకు పూర్తిస్థాయిలోఅవగాహన లేకపోవడం, జాతీయ రహదారిపై నేషనల్ హైవే అథారిటీ వారు ఏర్పాటు చేసిన డివైడర్లను నిబంధనలకు విరుద్ధంగా మధ్యలో ధ్వంసం చేసి ఇల్లీగల్ పాసెజ్ లను ఏర్పాటు చేసుకోవడం తదితర కారణాలను గుర్తించారు. పాల్వంచ టౌన్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, నేషనల్ హైవే అధికారులతో కలిసి పాల్వంచ సీఐ వినయ్ కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్ , దమ్మపేట సెంటర్ , రెజీనా స్కూల్ ప్రాంతాలలో జాతీయ రహదారిని, డివైడర్లను, ఇల్లీగల్ ప్యాసేజెస్ను శుక్రవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన డివైడర్స్ ను క్రమబద్ధీకరించాలని సూచించారు. వెంటనే ఇల్లీగల్ ప్యాసేజెస్ను మూసి వేయడానికి కావలసిన చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు తమవంతుగా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ టౌన్ ఎస్సై బాణాల రాము, నేషనల్ హైవే అథారిటీ అధికారి నలిని, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ ఏఈ రాజేష్ పాల్గొన్నారు.
Aug 09 2023, 09:23