*సీఎం కే సి ఆర్,కేటీఆర్ చిత్రపటాలకు లకు పాలభిషేకం*
జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న టియూడబ్లూజే (టీజేఎఫ్) రాష్ట్ర కార్యాలయానికి (తెలంగాణ జర్నలిస్ట్ భవన్) కు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసిన నేపథ్యంలో స్థల కేటాయింపు జరపడానికి ప్రధాన కారణమైన సీఎం కేసీఆర్, మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మహమ్మద్ అధ్యకతన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ కోత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా కల్లోజీ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.హైద్రాబాద్ ఉప్పల్ బగాయత్ లో యూనియన్ భవనం కోసం 2000 గజాలా స్థలంను కేటాయించటం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, రాష్ట్ర ఐ జె యూ సభ్యులు చండ్ర నరసింహరావు,యూనియన్ బాధ్యులు, యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Aug 04 2023, 17:58