*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా; పాల్వంచ* *శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు* *పాల్వంచ సిఐ*
బందులు, రాస్తారోకోలు చేయడం చట్టరీత్యా నేరమని అందుకు పాల్పడిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పాల్వంచ సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో మాదిరిగా ఇటువంటి తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని వివిధ రాజకీయ పార్టీల వారికి సూచించారు. గతంలో బందులు, రాస్తారోకోల లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వారి వివరాలను సేకరిస్తున్నామని ఇకముందు ఇదే తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నందుకు వారిపై రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేయడానికి వెనుకాడ బోమని హెచ్చరించారు. ప్రతి వ్యక్తికి నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది, కానీ నిరసన వ్యక్తం చేసే క్రమంలో ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. అందుకోసమే ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాల్లో, ధర్నా చౌక్లలో నిరసనలు తెలియజేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించవద్దని , తద్వారా ట్రాఫిక్ అంతరాయాలను సృష్టించవద్దని అన్నారు. ప్రజలను అసౌకర్యానికి గురి చేసే ఎటువంటి కార్యకలాపాలకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్పడవద్దని తెలిపారు.
Aug 03 2023, 15:58