నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ..
•తొలి రోజు దివంగత సభ్యులకు సంతాపం, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ భేటీ
•నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఉభయసభల సమావేశాలు
శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి.
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు.
సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు.



హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.







Aug 03 2023, 11:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.2k