*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *మత్తు పదార్థాలు-దుష్పరిణామాలు అనే అంశంపై అవగాహన సదస్సు*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ రూరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఆదేశాలమేరకు కే ఎల్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం పాల్వంచ రూరల్ పోలీసులు మత్తు పదార్థాలు, దుష్పరిణామాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాల్వంచ డిఎస్పి వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవడమే కాకుండా సిగరెట్,మందు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవడమే ఒక ఫ్యాషన్ భావిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలుగుతూ విద్యపైనే దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యార్థులు సైతం పోలీసులకు సహకరించడం తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. అనంతరం పలువురు వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్ర కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
Aug 01 2023, 17:19