హైదరాబాద్ .బీసీ మంత్రులకు టికెట్లు ఇవ్వనని కేసీఆర్ డిసైడయ్యారు.చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి*

గాంధీ భవన్

బీసీ మంత్రులకు టికెట్లు ఇవ్వనని కేసీఆర్ డిసైడయ్యారు.చనగాని దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి*

మంత్రులు కేసీఆర్ దగ్గర తమ గ్రాఫ్ పెంచుకుని టికెట్లు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ని తిడుతున్నారు.

తలసాని చదువుకోలేదు కాబట్టి ఆయనకి సంస్కారం ఉండదు.

9 ఏళ్ల నుండి కేసీఆర్ బీసీలకు చేసింది ఎంటి?

తలసాని బీసీ ముసుగు వేసుకొని నాటక కంపెనీ మొదలుపెట్టాడు.

తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య కు నివాళి అరిపించావా

ఈ నలుగురు బీసీ మంత్రులు బీసీల సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా?

తన కొడుకు గోదావరి నది గురించి అవగాహన లేని మాటలు మాట్లాడినట్టు ఇప్పుడు తలసాని బీసీల గురించి తలసాని కి గొర్లు తెలియడు గొర్ల మంద తెలియడు.

అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు.

తలసాని HMDA భూములను పాన్ పరాగ్ నలిమినట్టు నములుతున్నాడు.

కేసీఆర్ కేటీఆర్ లతో కోట్లాడి మీ పార్టీ బీసీ నేతలకు పదవులు ఇప్పించండి.

సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్.

నల్గొండ జిల్లా :బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన కట్టంగూర్ పోలీసులు

బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన కట్టంగూర్ పోలీసులు

Streetbuzz news.

.

.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై బీజేపి పోరుబాట

"పేదోడి సొంతింటి కోసం టిఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను ఎండగడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధ పాలన ను నిలదీయడం కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల క్షేత్ర స్థాయి పరిశీలన కోసం వస్తున్న సందర్భంగా బాటసింగారంలో మా నాటకాలు బయట పడతాయని BRS ప్రభుత్వం బటసింగారం వెళ్లకుండా బిజెపి కార్యకర్తలను ఎక్కడిక్కడ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.బీ ఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల చేత చేయిస్తున్న ఈ అక్రమ అరెస్టులు నశించాలని అప్రజాస్వామిక పాలను కొనసాగిస్తున్న బీ ఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెపుతారని కట్టంగూర్ లో అరెస్ట్ అయిన బీజేపీ నాయకులు అన్నారు అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల. సైదులు, మాజీ మండల అధ్యక్షులు ముడుసు. బిక్షపతి, పాదూరి. వెంకట్ రెడ్డి, కత్తుల. హనుమంతు, బసవోజు వినోద్, ఓరుగంటి. హరిబాబు తదితరులు ఉన్నారు

హైదరాబాద్::శ్వేతా మహంతి కి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ*

శ్వేతా మహంతి కి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ

Streetbuzz news:

.:

హైదరాబాద్ జులై 19

తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో పని చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని క్యాబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఆమెను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2011 కేడర్‌కు చెందిన శ్వేతా మహంతి ప్రస్తుతం తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్, వనపర్తి జిల్లాలకు కలెక్టర్‌గా వ్యవహరించారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శ్వేతా మహంతి.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు వేశారు. రెండో ప్రయత్నంలోనే ఏకంగా ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించి కలెక్టర్ అయ్యారు....

నల్గొండ జిల్లా: కేతపల్లి మండలం::గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని*

గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని 

గ్రామ పంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ వేతనాలు ఉద్యోగ, పర్మినెంట్ చేసి పెంచాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేతపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న పరిశుద్ధ కార్మికులకు మద్దతు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు.పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు,పంపు ఆపరేటర్లు,ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు బిల్ కలెక్టర్లు వివిధ కేటగిరిలో పనిచేస్తూన్నా పనికితగ్గ వేతనాలు రావడం లేదన్నారు.గ్రామపంచాయతీ సిబ్బందికి కేటగిరి వారిగా వేతనాలు నిర్వహించాలని,కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.51 తీసుకొచ్చి మల్టీ పర్పస్ విధానాన్ని అమలుచేస్తుంది.గ్రామంలో చెత్త చెదారం,జంతు కలేభరాలు,కుళ్ళిపోయిన శవాలను తొలగిస్తూ మురికికాల్వలను శుభ్రం చేస్తూ జీవితాంతం వెట్టి చాకిరి చేయాల్సివస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులందరికీ కనీస వేతనం 19500/- రూ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, ఆరోగ్యభద్రత కల్పించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, సునీత,వంటపాక సుదర్శన్, సూరారపు నవీన్,వంటేపాక శివ,రాజు పారిశుద్ధ కార్మికులు సైదులు, తానేష్, కేశవులు, దిలీప్, గుర్వమ్మ, నరేందర్, జానయ్య, వెంకటేష్, వెంకటయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

బిజెపి -బిఆర్ఎస్ మిలాకత్ తోనే బండి మార్పు... కిషన్ రెడ్డి నియామకం.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్-*

బిజెపి -బిఆర్ఎస్ మిలాకత్ తోనే బండి మార్పు... కిషన్ రెడ్డి నియామకం.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్-

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ...ఈ నేపథ్యంలోనే బిజెపి రాష్ట్ర పార్టీ లో మార్పులు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ పేర్కొన్నారు. బిజెపికి బిఆర్ఎస్ పార్టీ బీ టీం అని చెప్పుకుంటున్న క్రమంలోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడం తో బిజెపి బిఆర్ఎస్ మీలాకాతు అయిందని స్పష్టంగా తెలుస్తుందని ఆయన వివరించారు. బిజెపి అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ను సీఎంగా కూర్చోబెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నదని చెప్పారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి రాజకీయ వ్యూహాలు పన్నుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో రహస్య ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఖమ్మం సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ప్రసంగించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చనగా నీ దయాకర్ పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో బిఆర్ఎస్ బిజెపి పార్టీల నాయకులు కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి బిజెపి బీఆర్ఎస్ ఆటలు ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో చెల్లబోవు అని ఆయన వివరించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన పై బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం హాస్యాస్పదంగా, వింతగా విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ పేరుతో కెసిఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నారని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పడంతో టిఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయని అన్నారు. కెసిఆర్ కుటుంబ లక్షల కోట్ల సంపాదన పై తెలంగాణ ప్రజలు గ్రహించారని, అందువల్లే రాష్ట్రంలో రాజకీయ మార్పులు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఊరు ఊరు నా వాడ వాడనా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇది చూసి ఓర్వలేకనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మతతత్వ బిజెపి పార్టీతో, అదా నీ అంబానీలకు పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న పార్టీతో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమ్మక్కయ్యారని వివరించారు. ఇలాంటి వాస్తవాలను ప్రజలు గ్రహించారని, ఇక కెసిఆర్ చెప్పే కల్లబొల్లి మాటలను వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం త్వరలోనే రాబోతుందని ఆయన ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని నిజంగానే కూల్చాలని ఆలోచన ఉంటే ఈటెల రాజేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనను చనగాని దయాకర్ ఆహ్వానించారు.

ఖమ్మం జిల్లా::కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి..కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి..కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్‌తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా… పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది. పొంగులేటి చేరికతో పాటు భట్టి పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన చేతుల మీదుగా కండువా కప్పి ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో తిరిగి పట్టు సాధించి అధికారంలోకి రావాలని హస్తం పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

నల్గొండ జిల్లా ::పట్టణ పరిశుభ్రతలో కార్మికుల శ్రమ వెలకట్ట లేనిది. మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి...

పట్టణ పరిశుభ్రతలో కార్మికుల శ్రమ వెలకట్ట లేనిది.

-మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి...

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు.

నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన పెరిక మారెమ్మ, ఇస్రం ఎల్లయ్య, బొమ్మరబోయిన లక్ష్మయ్య, చిన్నాల ఈశ్వర్ లను ఆయన శనివారం మున్సిపల్ ఛాంబర్ లో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు లేనిదే తాము లేమని పేర్కొన్నారు . కార్మికులు నిత్యం శ్రమిస్తూ పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు పరోక్షంగా పనిచేశారని కొనియాడారు. ప్రతి ఉద్యోగి పదోన్నతి, బదిలీలు పదవి విరమణ అనేవి సహజమైననీ అన్నారు. పదవి విరమణ చెందిన ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నాగిరెడ్డి బిఆర్ఎస్ నాయకులు శానటరి ఇన్స్పెక్టర్ లు మూర్తుజ గడ్డం శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్ గోగుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు...

నల్గొండ జిల్లా:చిట్యాల::హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

చిట్యాల మున్సిపాలిటీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ కార్యక్రమంలో. చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య,మున్సిపల్ వైస్ ఛైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, పలువురు ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా:నకిరేకల్ :క్షతగాత్రులను పరామర్శించిన. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

క్షతగాత్రులను పరామర్శించిన. బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి

.

Streetbuzz. News నల్గొండ జిల్లా :

నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం శివారులో జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నకిరేకల్ లో బీఎస్పీ మీటింగ్ ముగించుకొని చిట్యాల కు వచ్చే క్రమంలో బస్ ప్రమాదం కి గురికాగా అటు వైపు వెళ్తున్న బిఎస్పి ప్రచార వాహనంలో క్షతగాత్రులను కామినేని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స నిమిత్తం చేర్పించగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి శుక్రవారం పరామర్శించారు. శుక్రవారం కామినేని హాస్పిటల్ కు వెళ్లి అక్కడ వైద్య బృందాన్ని ఎప్పటికప్పుడు క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం వైద్యులను మంచి వైద్యం అందించాలని వారిని ఆమె కోరారు. అనంతరం వారు మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. రామన్నపేట కు చెందిన విఓఏ, అంగన్వాడీ, ఆశా వర్కర్లలను నకిరేకల్ లో మీటింగ్ వుంది అని పిలిచి ఈ ప్రమాదానికి కారణమైయ్యారు అని దుయ్యబట్టారు. ప్రభుత్వం కొత్త వారిని రిక్రూమెంట్ చేసుకోక పాతవారికే డబల్ డ్యూటీ వేయడం వల్ల వాళ్లకు నిద్ర సరిపోక ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. పేద ప్రజల ప్రభుత్వానికి లెక్క లేదా అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి ఆర్టీసీలో కొత్త వారిని రిక్రూమెంట్ చేసుకొని ఎంప్లాయిస్ మీద భారం తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కూమర్,కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మల్లేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

టీఎస్ జేఏ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా మాధవరావు పటేల్ నియామకం.

టీఎస్ జేఏ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా మాధవరావు పటేల్ నియామకం

నిర్మల్ జిల్లా:

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఇప్పటికే ఎన్నో ఉద్యమ కార్యక్రమాలను చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్ జేఏ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు (ఎం4 టీవీ చైర్మన్) సూర్యవంశ మాధవరావు పటేల్ ను నియమించారు.ఈ మేరకు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా మాధవరావు పటేల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కి అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీడియా రంగంలో కొనసాగుతూ ఇప్పటివరకు సొంత ఇండ్లు సొంత ఇంటి స్థలాలు పొందుకొనని ఎంతోమంది జర్నలిస్టుల సంక్షేమం కోసం కృతనిత్యంతో పోరాడుతామని తెలిపారు.ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరారు