నల్గొండ జిల్లా: కేతపల్లి మండలం::గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని*
గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
గ్రామ పంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ వేతనాలు ఉద్యోగ, పర్మినెంట్ చేసి పెంచాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేతపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న పరిశుద్ధ కార్మికులకు మద్దతు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు.పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు,పంపు ఆపరేటర్లు,ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు బిల్ కలెక్టర్లు వివిధ కేటగిరిలో పనిచేస్తూన్నా పనికితగ్గ వేతనాలు రావడం లేదన్నారు.గ్రామపంచాయతీ సిబ్బందికి కేటగిరి వారిగా వేతనాలు నిర్వహించాలని,కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.51 తీసుకొచ్చి మల్టీ పర్పస్ విధానాన్ని అమలుచేస్తుంది.గ్రామంలో చెత్త చెదారం,జంతు కలేభరాలు,కుళ్ళిపోయిన శవాలను తొలగిస్తూ మురికికాల్వలను శుభ్రం చేస్తూ జీవితాంతం వెట్టి చాకిరి చేయాల్సివస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులందరికీ కనీస వేతనం 19500/- రూ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, ఆరోగ్యభద్రత కల్పించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, సునీత,వంటపాక సుదర్శన్, సూరారపు నవీన్,వంటేపాక శివ,రాజు పారిశుద్ధ కార్మికులు సైదులు, తానేష్, కేశవులు, దిలీప్, గుర్వమ్మ, నరేందర్, జానయ్య, వెంకటేష్, వెంకటయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
Jul 19 2023, 16:53