*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *సాలి బాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా కె ఎల్ ఆర్ జయంతి వేడుకలు*
న్యూ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అన్నదానం
ముఖ్య అతిథిగా హాజరైన కె ఎల్ ఆర్ తనయుడు సిద్ధార్థ్ రెడ్డి
కె ఎల్ ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మారెడ్డి జయంతిని న్యూ లైఫ్ ఆఫ్ ఇండియా చైర్మైన్ సాలిభాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సోమవారం దివంగత డా. లక్ష్మారెడ్డి జయంతిని పురస్కరించుకుని పాల్వంచ పట్టణ పరిధి నెహ్రు నగర్ కార్యాలయంలోని న్యూ లైఫ్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో డా కే ఎల్ ఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం లక్ష్మారెడ్డి కూమారడు సిద్ధార్థ్ రెడ్డి చేతుల మీదుగా కేకు కట్ చేయించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యూ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సాలి భాస్కర్ మాట్లాడుతూ డా లక్ష్మారెడ్డి సేవలు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ఎంతో మందికి విద్యా దానం చేసిన విద్యా దాత డా లక్ష్మారెడ్డి అని స్మరించుకున్నారు.ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యనదించిన కె ఎల్ ఆర్ సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు.
ఈ కార్యక్రమంలో శంకర్,ఆర్కే వేణు, మేరమ్మ,జ్యోతి, జె స్టాలిన్,నాగేందర్,గౌస్,రాము తదితరులు పాల్గొన్నారు.
Jul 19 2023, 11:50