బిజెపి -బిఆర్ఎస్ మిలాకత్ తోనే బండి మార్పు... కిషన్ రెడ్డి నియామకం.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్-*
బిజెపి -బిఆర్ఎస్ మిలాకత్ తోనే బండి మార్పు... కిషన్ రెడ్డి నియామకం.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్-
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ...ఈ నేపథ్యంలోనే బిజెపి రాష్ట్ర పార్టీ లో మార్పులు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ పేర్కొన్నారు. బిజెపికి బిఆర్ఎస్ పార్టీ బీ టీం అని చెప్పుకుంటున్న క్రమంలోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడం తో బిజెపి బిఆర్ఎస్ మీలాకాతు అయిందని స్పష్టంగా తెలుస్తుందని ఆయన వివరించారు. బిజెపి అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ను సీఎంగా కూర్చోబెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నదని చెప్పారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి రాజకీయ వ్యూహాలు పన్నుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో రహస్య ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఖమ్మం సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ప్రసంగించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చనగా నీ దయాకర్ పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో బిఆర్ఎస్ బిజెపి పార్టీల నాయకులు కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి బిజెపి బీఆర్ఎస్ ఆటలు ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో చెల్లబోవు అని ఆయన వివరించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన పై బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం హాస్యాస్పదంగా, వింతగా విడ్డూరంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ పేరుతో కెసిఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నారని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పడంతో టిఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయని అన్నారు. కెసిఆర్ కుటుంబ లక్షల కోట్ల సంపాదన పై తెలంగాణ ప్రజలు గ్రహించారని, అందువల్లే రాష్ట్రంలో రాజకీయ మార్పులు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, ఈ దిశగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఊరు ఊరు నా వాడ వాడనా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇది చూసి ఓర్వలేకనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మతతత్వ బిజెపి పార్టీతో, అదా నీ అంబానీలకు పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న పార్టీతో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమ్మక్కయ్యారని వివరించారు. ఇలాంటి వాస్తవాలను ప్రజలు గ్రహించారని, ఇక కెసిఆర్ చెప్పే కల్లబొల్లి మాటలను వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం త్వరలోనే రాబోతుందని ఆయన ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని నిజంగానే కూల్చాలని ఆలోచన ఉంటే ఈటెల రాజేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయనను చనగాని దయాకర్ ఆహ్వానించారు.
Jul 17 2023, 15:08