*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *పాల్వంచ మండల మేరు కుల సంఘ విస్తృత స్థాయి సమావేశం*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ
పాల్వంచ మండల మేరు కుల సంఘ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు పాల్వంచ
అయ్యప్పనగర్ లోని మాడిశెట్టి రాజమనోహర్ నివాసంలో జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర మేరు సంఘ నాయకులు తాళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన
సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ఇటీవలి భద్రాచలం లోని అభయ ఆంజనేయ దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన తాళ్ల రవికుమార్ ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్సు లోని
పిల్లల యూనిఫామ్స్ కుట్టుపని మేరుకులస్తులకు మాత్రమే ఇవ్వాలని మరియు బి.సీ
లోన్స్ లో మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని అలాగే కుట్టుపని పై జీవించే ప్రతీ ఒక్క మేరు కుటుంబాలకు ఉచితంగా కుట్టు మిషన్ లను పంపిణి
చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమం లో పాల్వంచ మేరు ఉపాధ్యక్షులు సింగు రాంబాబు, కార్యదర్శి
మాడిశెట్టి రాజమనోహర్, కోశాధికారి శనగవరపు రాజేశ్యం, రేఖల ప్రభాకర్,
కొట్టురు మధు సతీష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Jul 11 2023, 16:44