*భద్రాద్రి కొత్తగూడెం* *జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ కల్పించాలి..*
డి ఈ వో కు మెమోరాండం ఇచ్చిన టి యూ డబ్ల్యూబి జె (టి జె ఎఫ్ )
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు గత సంవత్సరం జారిచేసినట్లు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితిని కల్పించాలంటూ జిల్లా విద్యాశాఖధికారి సోమశేఖర శర్మ ని టి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వంకంగా కలిసి వినతిపత్రం ను అందచేయటం జరిగింది. డి ఈ వో సానుకూలంగా స్పందిస్తూ రెండు రోజుల్లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు పాఠశాలకు సర్కులర్ జారీ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం శ్రమిస్తున్న టీజేఎఫ్ కల్లోజి శ్రీనివాస్ ను జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు.డి ఈ వో ని కలిసిన వారిలో టి జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మహమ్మద్, టెంజు అధ్యక్షులు వట్టికొండ రవి,టెంజు ప్రధాన కార్యదర్శి సి హెచ్ వి నరసింహారావు, సహాయ కార్యదర్శి అచ్చి ప్రభాకర్ రెడ్డి,ప్రచార కార్యదర్శి కృష్ణం రాజు,స్మాల్ పేపర్స్ ప్రధాన కార్యదర్శి ఆఫ్జల్ పఠాన్, క్రాంతి, రాజకుమార్, సురేష్, చిరంజీవి,రహీం తదితరులు ఉన్నారు.
Jul 11 2023, 15:44