*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో హెల్త్ క్యాంప్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ
జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా పాల్వంచ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో మొబైల్ హెల్త్ క్లీనిక్ ద్వారా వివిధ రకాల డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, ఫార్మసిస్టులతో వారి గ్రామంలో వారి వద్దకే వెళ్లి హెల్త్ క్యాంపులు నిర్వహించి వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇందులో భాగంగా ఈరోజు పాల్వంచ పట్టణంలోని నెహ్రునగర్, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, తెలంగాణ నగర్ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నెహ్రు నగర్ లోని రాతి చెరువు కట్ట ప్రక్కన హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు సుమారు 300 మంది వరకు వచ్చి వివిధ రకాల వైద్య సేవలు పొందడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Jul 07 2023, 09:30