*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *త్వరలోజిల్లాలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ
త్వరలోజిల్లాలోని జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ
రాష్ట్ర ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ
పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పాల్వంచకు విచ్చేసిన రాష్ట్ర ఆర్ధిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిసిన టియుడబ్ల్యూజే, టీజేఎఫ్ నాయకులు. భద్రాద్రి జిల్లా లోని జర్నలిస్టుల ఇళ్ల సంబంధించిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించన హరీష్ రావు త్వరలో జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వినత పత్రం అందించిన వారిలో టియూడబ్ల్యూజె టీజేఎఫ్ అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, ఐజేయూ సభ్యులు చండ్ర నరసింహారావు,టిన్యూస్ ఉమ్మడి జిల్లాల బ్యూరో వెన్నబోయిన సాంబశివరావు, తెంజు జిల్లా అధ్యక్షుడు వట్టి కొండ రవి,తెంజు జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ వి నసింహారావు, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు చెంగ పోగు సైదులు, తెంజు ప్రచార కార్యదర్శి కృష్ణంరాజు, జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, కనుమ రమేష్,కేరటం శ్యామ్,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Jul 06 2023, 14:11