*భద్రాద్రి కొత్తగూడెం* *జర్నలిస్టుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ ను కలసిన టి.యూ.డబ్ల్యు.జె(టి.జె.ఎఫ్) హెచ్-143 యూనియన్ నాయకులు*
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న
టి.యూ.డబ్ల్యు.జె(టి.జె.ఎఫ్)హెచ్-143యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, మహ్మద్ షఫీ.
టెంజు జిల్లా అధ్యక్షుడు వట్టికొండ రవి, అక్రిడేషన్ కమిటీ సభ్యులు, జిల్లా పౌర సంబంధాల అధికారి శీలం శ్రీనివాసరావు సమక్షంలో
జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కు రెండో విడత అక్రిడేషన్ కార్డులు మంజూరు, మార్పులు చేర్పులు ఇళ్ల స్థలాల పంపిణీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జర్నలిస్టుల సమస్యలను అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు, డీపీఆర్వో శీలం శ్రీనివాసరావు సమక్షంలో వివరించారు.
ఎంతోకాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సత్వరమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, అక్రిడేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబం ధించి చర్యలు తీసుకోవాలని , జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరారు.
అదనపు కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
సోమవారం రోజున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని, అంతే కాకుండా సోమవారం రోజున యూనియన్ నాయకులు అక్రిడేషన్ సభ్యులు కూడా జిల్లా కలెక్టర్ ను కలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సాక్షి జిల్లా బ్యూరో కృష్ణ గోవింద్, ఐ.జె.యూ&అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు చండ్ర నరసింహా రావు,అక్రిడిడేషన్ కమిటీ సభ్యులు తోటమల్ల బాల యోగి, కాటా సత్యం, యూని యన్ నాయకులు రవికుమార్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
Jul 01 2023, 10:09