నల్గొండ జిల్లా ::ఏప్రిల్ 28న పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయండి.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున.
ఏప్రిల్ 28న పూలే అంబేద్కర్ జాతరను జయప్రదం చేయండి.
మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకై నల్లగొండలోనీ (ఎస్ బి ఆర్ ఫంక్షన్ హాల్) బోయవాడ లో ఏప్రిల్ 28న ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు పూలే అంబేడ్కర్ జన జాతరను జయప్రదం చేయవలసిందిగా రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ కోరారు.
నల్లగొండలో ఈరోజు అంబేద్కర్ భవనంలో పూలే అంబేడ్కర్ సన్నాహక సమావేశం కొండేటి శ్రీను గంజి మురళీధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పూలే అంబేడ్కర్ తమ జీవితాంతం కష్టించి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని భావితరాలకు రాజ్యాంగాన్ని అందించారని చదువు సమాజ అభివృద్ధికి పాటు పడ్డారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండా కులాలలో నీ సాంస్కృతిక బృందాలు డప్పులు కోలాటం భజన యక్షగానం చిందువేషాలు గోసంగి ఒగ్గు కథలు గంగిరెద్దులు, చెంచుల కాటికాపరుల ఎరుకల సోది అనేక రకాల కళారూపాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ 19న నల్లగొండ పూలే విగ్రహం వద్ద కరపత్రాల ఆవిష్కరణ 20న నకరికల్లు నల్లగొండ మునుగోడులో సమావేశాలు కరపత్రం ఆవిష్కరణ 21న మిర్యాలగూడ నాగార్జునసాగర్ దేవరకొండలో కరపత్రాల పంపిణీ సామాజిక సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలను కలవనున్నట్లు తెలిపారు. 23 24 తేదీలలో నియోజకవర్గ కేంద్రాలలో సైకిల్ మోటార్ యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న నల్లగొండ పట్టణ పురవీధులలో సైకిల్ మోటార్ యాత్రలు నిర్వహించాలని తెలిపారు. పూలే అంబేడ్కర్ జాతరలకు ముఖ్యఅతిదులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మరియు నల్లగొండ ప్రముఖులు మేధావులు కవులు సాహితీవేతలు దళిత గిరిజన మైనారిటీ బిసి వృత్తి సంఘాల జిల్లా స్థాయి నాయకులు అంబేద్కర్ సంఘాలు స్వచ్ఛంద సంఘాలు నాయకులు పాల్గొంటారు సన్నాహక సమావేశంలో వృత్తిదారుల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ వైద్యుల సత్యనారాయణ కత్తుల షణ్ముఖ అవుట రవీందర్ ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకులు బిక్షపతి కత్తుల జగన్ మిరియాల యాదగిరి పిడిఎస్యు సాగర్ తెలగమల్ల యాదగిరి బొల్లూరి నరసింహ అవిశెట్టి శంకరయ్య చెరుకు పెద్దలు వనం నారాయణ గాదె నరసింహ మురారి మోహన్ కట్టెల శివకుమార్ బొల్లు రవీందర్ తదితర సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.
పలడుగు నాగార్జున
గంజి మురళీధర్
Apr 18 2023, 11:54