తెలంగాణ గురుకుల పోస్టుల్లో 80% మహిళలకే..*

2,876 ఉద్యోగాలకుగాను 2,301 వారికే..

లెక్చరర్‌, ఇతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

డెమో తరగతులకు 25 మార్కులు..

రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జూనియర్‌ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది. మొత్తం 2,876 పోస్టుల భర్తీకి వెలువరించిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికి దఖలుపడ్డాయి. అలానే జనరల్‌ కింద పేర్కొన్న మిగిలిన పోస్టులకు పురుషులతో పాటు మహిళలూ పోటీపడవచ్చు. గురుకులాల నిబంధనల మేరకు మహిళా విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళలే అర్హులు కావడంతో వారికి అదనపు ప్రయోజనం లభిస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ మహిళలవే కావడం గమనార్హం. ఈ విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక రోస్టర్‌ను అమలు చేయనున్నారు.

పరీక్షల షెడ్యూలును త్వరలో వెబ్‌సైట్లో పొందుపరుస్తామని గురుకుల బోర్డు వెల్లడించింది. పరీక్షలను ఓఎంఆర్‌ పద్ధతిలో లేదా కంప్యూటర్‌ ఆధారితంగా (సీబీఆర్‌టీ) ఆన్‌లైన్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని సూచించింది.

జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు పేపర్‌-1 అందరికీ ఒకటే(కామన్‌) ఉంటుందని, ఈ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని బోర్డు తెలిపింది. పేపర్‌-2, 3 ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి.

ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రిజర్వేషన్లు పొందాలని భావిస్తున్న అభ్యర్థులు 2023 జనవరి 1 తరువాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని గురుకుల బోర్డు తెలిపింది.

గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో పోస్టులకు డెమో మార్కుల విధానాన్ని బోర్డు యథాతథంగా కొనసాగిస్తోంది. వీటికి 25 మార్కులు ఉంటాయని తెలిపింది.

పరీక్ష ఫీజు రూ.1,200

ఈ పోస్టులకు పరీక్ష ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.1,200, రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు రూ.600గా బోర్డు నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన రిజర్వుడు అభ్యర్థులకు ఫీజు రాయితీ లేదు. పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

నిన్న ఢిల్లీ వెళ్లిన బండి... పార్టీ బలోపేతంపై చర్చించామన్న సంజయ్​

బీజేపీ హైకమాండ్ పిలుపుతో తెలంగాణ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల టైం మాత్రమే ఉండడంతో  హైకమాండ్​ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.

 బీఆర్ఎస్, కాంగ్రెస్​లో ఉన్న అసంతృప్తులను పార్టీలో చేర్చుకుని బీజేపీని బలోపేతం చేయాలనే చర్యలలో భాగంగానే సంజయ్​కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నేతలతో చర్చించినట్లు, అక్రమ అరెస్ట్​ గురించి అడిగినట్లు, కేసీఆర్​ అరాచకాలన్నీ పార్టీ పెద్దలకు వివరించినట్లు సంజయ్​ తెలిపారు.

 బూత్​ స్వశక్తి కరణ్​ అభి యాన్​ మీటింగ్​లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. జూపల్లి చేరికపై డీకే అరుణ మాట్లాడారని, 15న వరంగల్​లో నిరుద్యోగ మార్చ్​ నిర్వహిస్తున్నామని తెలిపారు.

యాచకురాలి దారుణ హత్య... భర్త పక్కనే వుండగానే...

సికింద్రాబాద్ లోని రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో యాచకురాలు అర్ధ రాత్రి దారుణ హత్యకు గురైంది. 

ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి, భర్త చూస్తుండగానే బండరాయి వేసి హత్య చేశాడు. భర్త భయంతో అరుస్తున్నా తన చేయిపట్టుకుని ముందుకు లాగి ఆమెపై బండరాయి వేశాడు. దాంతో ఆమె బాధతో విలవిల లాడి అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనాస్థలికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రేపు హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ...

రేపు 125వ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో భాగంగా  హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని

ఆవిష్కరించనుంది తెలంగాణ సర్కార్.

 అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలు...

అంబేడ్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం.. 11.80 ఎకరాలు

పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు విస్తీర్ణం.. రెండు ఎకరాలు

విగ్రహ స్తూపం(పీఠం) ఎత్తు .. 50 అడుగులు

విగ్రహం వెడల్పు.. 45 అడుగులు

పీఠం వెడల్పు.. 172 అడుగులు

విగ్రహం బరువు.. 435 టన్నులు

విగ్రహం తయారీకి వినియోగించిన ఉక్కు.. 791 టన్నులు

విగ్రహం తయారీకి వినియోగించిన ఇత్తడి.. 96 మెట్రిక్ టన్నులు

విగ్రహం తయారీకి రోజూ పని చేసిన కార్మికులు.. 425 మంది

దేశంలోనే అతి ఎత్తయిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించారు.

Telangana : ముగిసిన 10th Exams... రిజల్ట్స్ మాత్రం అప్పుడే...

తెలంగాణలో 10th పరీక్షలకు 4,86,194 మంది విద్యార్థులకుగాను, 4,84,384 మంది విద్యార్థులు (99.63శాతం) హజరుకాగా, ఈ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. 

పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు మే 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి.

 ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనుంది. ఫలితాలు మాత్రం మే 10వ తేదీన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.

 జూన్ ఒకటో తేదీ నుంచి 2023 - 24 ఇంటర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది.

డేటా చోరీ లో బిగ్ బాస్కెట్​, పాలసీబజార్, HDFC ఖాతాదారుల వివరాలు... 19మందిని అరెస్ట్...

డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ సిట్ పోలీసులు,  బిగ్ బాస్కెట్​కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు,

హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు.

 బిగ్ బాస్కెట్​కు సంస్థ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు, పాలసీబజార్ వినియోగదారుల వివరాల లీకేజీ పై సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్​లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.

 HDFC బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు.

మరో సారి తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అరకిలో బంగారం పట్టివేత...

కస్టమ్స్​ అధికారులు స్మగ్లర్ల ఆటలు కట్టించినా ఎయిర్ పోర్టులన్నీ అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు అడ్డాలుగా మారుతున్నాయి. స్మగ్లర్లు  పద్ధతులను కనుగొంటూనే ఉన్నారు.  

తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేయగా... స్క్రూస్ రూపంలో అరకిలో బంగారం అమర్చినట్లు గుర్తించారు. వెంటనే బ్యాగ్‌ను సీజ్ చేసి ప్యాసింజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ. 21.20 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shamshabad Air Port : ఆఖరి నిమిషంలో విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా... ఎందుకంటే...

హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిరిండియాకు సంబంధించిన విమానాలను ఆపరేషన్నల్స్​ కారణం చూపుతూ... రద్దు చేసింది యాజమాన్యం. 

 ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేయడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అప్పటికే విమానాశ్రయం చేరుకున్న 40 మంది ప్రయాణీకులు.

ప్రయాణికులను శాంతింపజేసిన యాజమాన్యం తక్షణమే డబ్బులు రీఫండ్ చేశారు. 

 హైదరాబాద్ నుండి తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, మైసూరు వెళ్లే విమానాలు, అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి.

ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్ అయింది. బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీకుమార్ అమలు చేస్తున్నారని రఘునందన్ రావు అన్న వ్యాఖ్యలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని ఫైర్ అయ్యారు. రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు ఉన్నాయని వెల్లడించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొంది.

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఛానెల్పై నిషేదం ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మలయాళ వార్తా ఛానెల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యూస్‌ ఛానెల్‌ టెలికాస్ట్‌ను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి మీడియా వన్ ఛానెల్ ను బ్యాన్ చేసింది. దాంతో ఆ ఛానెల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు ఇవాళ (ఏప్రిల్ 5) విచారణ చేపట్టింది.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరకంగా ఛానెల్‌ చేసిన ప్రసారాలను.. పత్రికా వ్యవస్థకు విరుద్ధమైనవిగా పరిగణించలేమని సుప్రీం అభిప్రాయపడి ఛానెల్ పై విధించిన బ్యాన్ ను తొలగించింది. పటిష్టమైన ప్రజాస్వామ్యాం కోసం స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరమని డివై చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియావన్ ఛానెల్‌పై జాతీయ భద్రతా వాదనలు లేవనెత్తినందుకు హోమ్‌ మంత్రిత్వశాఖను సుప్రీం నిలదీసింది.