యాచకురాలి దారుణ హత్య... భర్త పక్కనే వుండగానే...

సికింద్రాబాద్ లోని రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో యాచకురాలు అర్ధ రాత్రి దారుణ హత్యకు గురైంది. 

ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి, భర్త చూస్తుండగానే బండరాయి వేసి హత్య చేశాడు. భర్త భయంతో అరుస్తున్నా తన చేయిపట్టుకుని ముందుకు లాగి ఆమెపై బండరాయి వేశాడు. దాంతో ఆమె బాధతో విలవిల లాడి అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనాస్థలికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రేపు హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ...

రేపు 125వ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో భాగంగా  హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని

ఆవిష్కరించనుంది తెలంగాణ సర్కార్.

 అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలు...

అంబేడ్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం.. 11.80 ఎకరాలు

పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు విస్తీర్ణం.. రెండు ఎకరాలు

విగ్రహ స్తూపం(పీఠం) ఎత్తు .. 50 అడుగులు

విగ్రహం వెడల్పు.. 45 అడుగులు

పీఠం వెడల్పు.. 172 అడుగులు

విగ్రహం బరువు.. 435 టన్నులు

విగ్రహం తయారీకి వినియోగించిన ఉక్కు.. 791 టన్నులు

విగ్రహం తయారీకి వినియోగించిన ఇత్తడి.. 96 మెట్రిక్ టన్నులు

విగ్రహం తయారీకి రోజూ పని చేసిన కార్మికులు.. 425 మంది

దేశంలోనే అతి ఎత్తయిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించారు.

Telangana : ముగిసిన 10th Exams... రిజల్ట్స్ మాత్రం అప్పుడే...

తెలంగాణలో 10th పరీక్షలకు 4,86,194 మంది విద్యార్థులకుగాను, 4,84,384 మంది విద్యార్థులు (99.63శాతం) హజరుకాగా, ఈ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. 

పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు మే 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి.

 ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనుంది. ఫలితాలు మాత్రం మే 10వ తేదీన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.

 జూన్ ఒకటో తేదీ నుంచి 2023 - 24 ఇంటర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది.

డేటా చోరీ లో బిగ్ బాస్కెట్​, పాలసీబజార్, HDFC ఖాతాదారుల వివరాలు... 19మందిని అరెస్ట్...

డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ సిట్ పోలీసులు,  బిగ్ బాస్కెట్​కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు,

హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు.

 బిగ్ బాస్కెట్​కు సంస్థ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు, పాలసీబజార్ వినియోగదారుల వివరాల లీకేజీ పై సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్​లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.

 HDFC బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు.

మరో సారి తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అరకిలో బంగారం పట్టివేత...

కస్టమ్స్​ అధికారులు స్మగ్లర్ల ఆటలు కట్టించినా ఎయిర్ పోర్టులన్నీ అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు అడ్డాలుగా మారుతున్నాయి. స్మగ్లర్లు  పద్ధతులను కనుగొంటూనే ఉన్నారు.  

తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేయగా... స్క్రూస్ రూపంలో అరకిలో బంగారం అమర్చినట్లు గుర్తించారు. వెంటనే బ్యాగ్‌ను సీజ్ చేసి ప్యాసింజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ. 21.20 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shamshabad Air Port : ఆఖరి నిమిషంలో విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా... ఎందుకంటే...

హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిరిండియాకు సంబంధించిన విమానాలను ఆపరేషన్నల్స్​ కారణం చూపుతూ... రద్దు చేసింది యాజమాన్యం. 

 ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేయడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అప్పటికే విమానాశ్రయం చేరుకున్న 40 మంది ప్రయాణీకులు.

ప్రయాణికులను శాంతింపజేసిన యాజమాన్యం తక్షణమే డబ్బులు రీఫండ్ చేశారు. 

 హైదరాబాద్ నుండి తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, మైసూరు వెళ్లే విమానాలు, అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి.

ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్ అయింది. బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీకుమార్ అమలు చేస్తున్నారని రఘునందన్ రావు అన్న వ్యాఖ్యలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని ఫైర్ అయ్యారు. రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు ఉన్నాయని వెల్లడించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొంది.

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఛానెల్పై నిషేదం ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మలయాళ వార్తా ఛానెల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యూస్‌ ఛానెల్‌ టెలికాస్ట్‌ను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి మీడియా వన్ ఛానెల్ ను బ్యాన్ చేసింది. దాంతో ఆ ఛానెల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు ఇవాళ (ఏప్రిల్ 5) విచారణ చేపట్టింది.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరకంగా ఛానెల్‌ చేసిన ప్రసారాలను.. పత్రికా వ్యవస్థకు విరుద్ధమైనవిగా పరిగణించలేమని సుప్రీం అభిప్రాయపడి ఛానెల్ పై విధించిన బ్యాన్ ను తొలగించింది. పటిష్టమైన ప్రజాస్వామ్యాం కోసం స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరమని డివై చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియావన్ ఛానెల్‌పై జాతీయ భద్రతా వాదనలు లేవనెత్తినందుకు హోమ్‌ మంత్రిత్వశాఖను సుప్రీం నిలదీసింది.

భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..

ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాన్ని కొన్ని ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. భూమిలా జీవానికి అవసరం అయ్యే పరిస్థితుల ఏ గ్రహానికైనా ఉన్నాయా అని మన పాలపుంతలో శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని వందల ఎక్సో ప్లానెట్స్ గుర్తించినప్పటికీ భూమిని పోలిన గ్రహాల్లో జీవాలు ఉండే అవకాశం మాత్రం దాదాపుగా తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా భూమి పరిమాణం ఉన్న ఓ ఎక్సో ప్లానెట్ ను గుర్తించారు. ఈ గ్రహం నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్ ను కనుగొన్నారు. భూమి లాంటి అయస్కాంత క్షేత్రాన్ని కలిగి, వాతావరణం కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావంతో తన మాతృనక్షత్రం నుంచి విడుదలయ్యే హైఎనర్జీ పార్టికల్స్ ను తిప్పికొడుతూ తన వాతావరణాన్ని కాపాడుకుంటుందని, నక్షత్రం నుంచి వెలువడే విస్పోటనాలు ఈ అయస్కాంత క్షేత్రం గ్రహాన్ని కాపాడుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నక్షత్రం, గ్రహం మధ్య జరిగే చర్యల వల్ల రేడియో సిగ్నల్స్ ఉత్పన్నం అవుతున్నాయి.

ఈ గ్రహం భూమి నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ మరుగుజ్జు నక్షత్రం ‘వైజెడ్ సెటి’ నక్షత్రం చుట్టూ ఈ గ్రహం ‘వైజెడ్ సెటీ బి’ పరిభ్రమిస్తోంది. కొలరాడో యూనివర్సిటీ, బక్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సెబాస్టియన్ పినెడ, జాకీ విల్లాడ్ సెన్, కార్ల్. జి జాన్స్కీ వేరి లార్జ్ అర్రే అనే రేడియో టెలిస్కోప్ ద్వారా వైజెడ్ సెటీ నుంచి వెలువడుతున్న సిగ్నల్స్ ను రికార్డ్ చేశారు. ఒక గ్రహం వాతావరణాన్ని కలిగి ఉందా లేదా..? అనేది దాని అయస్కాంత క్షేత్రం బలంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

వైజెడ్ సెటీ బీ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ 2 రోజుల్లోనే పరిభ్రమణం పూర్తి చేస్తుంది. అంటే దాదాపుగా మన సౌర కుటుంబంలోని బుధుడి కక్ష్యకు సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గురుగ్రహాల వంటి భారీ గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టారు. అయితే భూమి వంటి చిన్న గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టేందుకు ఓ నమూనాను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ప్లాస్టిక్ తెచ్చిచ్చి గోల్డ్ తీస్కెళ్లండి!

 అది దక్షిణ కాశ్మీర్​లోని అనంత్ నాగ్ జిల్లాలోని సాడీవారా గ్రామం. చాలా ఊర్లలాగే ఆ ఊరు కూడా ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయింది. రోడ్ల వెంట, వీధుల్లో ఎక్కడ చూసినా వాడి పారేసిన పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. చెత్తను తొలగించేందుకు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ పేరుకుపోతూనే ఉంది. అందుకే ఆ గ్రామ సర్పంచ్, అడ్వొకేట్ ఫరూక్ అహ్మద్ గనై ఒక ప్లాన్ వేశాడు.

గ్రామస్తులు 20 క్వింటాళ్ల ప్లాస్టిక్​ను సేకరించి ఇస్తే పంచాయతీ తరఫున ఒక గోల్డ్ కాయిన్ ఇస్తామని ప్రకటించాడు. దీంతో ఊరోళ్లంతా ప్లాస్టిక్ వేటలో పడ్డారు. రోడ్లు, వీధుల వెంబడి మాత్రమే కాదు.. ఊరి పక్కనున్న నదిలో, వాగులు, కాలువల్లోనూ పడి ఉన్న ప్లాస్టిక్ ను సేకరించి తీసుకొచ్చారు. మొత్తంగా పదిహేను రోజుల్లోనే ఊరంతా ప్లాస్టిక్ చెత్త లేకుండా క్లీన్ అయిపోయింది. గ్రామాలను క్లీన్​గా ఉంచుకోవడంలో సాడీవారా ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచిందని ఉన్నతాధికారులు మెచ్చుకుంటున్నరు. అయితే.. గ్రామంలో ప్లాస్టిక్ చెత్తను సేకరించినందుకు ఎంత మందికి గోల్డ్ కాయిన్ లు ఇచ్చారన్నది మాత్రం వెల్లడి కాలేదు.