madagoni surendar

Apr 07 2023, 18:08

పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం.

పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం

జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గాను సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కోర్టు విధించిన జరిమానాలను కట్టలేని, బెయిల్ ఫీజును కట్టలేని పేద ఖైదీలకు కోసం పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపింది. సరైన చదువు లేక, అతి తక్కువ ఆదాయం ఉన్న ఖైదీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పింది. సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల కోర్టుకు జరిమానాలు కట్టలేని ఎంతో మంది పేద ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని... అలాంటి వారికి ఈ పథకం ఎంతో సాయపడుతుందని తెలిపింది. దీనికోసం ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిజమైన పేద ఖైదీలను గుర్తించడం సులభతరం అవుతుందని తెలిపింది.

madagoni surendar

Apr 07 2023, 18:03

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..

కరోనా కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను పెంచడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పౌరుల్లో అనవసర భయాందోళనలు కలిగించవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు..

ఈ సమావేశంలో కోవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్ర మంత్రి చర్చించారు. సూచించిన కోవిడ్ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించాలని, వాటిని పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఏప్రిల్ 10, 11వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు..

madagoni surendar

Apr 07 2023, 17:48

నల్గొండ జిల్లా :ఈతకు వెళ్లి యూవకుడు మృతి.

ఈతకు వెళ్లి యూవకుడు మృతి.

ఈతకు వెళ్లి యూవకుడు మృతి చెందిన సంఘటన. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామం లో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ గ్రామనకి చెందిన అనిల్ (19) శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ని బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందరు. దీంతో గ్రామం లో విషాదచాయాలు అలుముకున్నాయి. దీనికి సమాందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

madagoni surendar

Apr 07 2023, 17:14

70వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటాకి వైజాగ్ స్టీల్ కట్టబెడతారా.తప్పుడు లెక్కల్లో దొరికిపోయిన అదానికి అప్పగిస్తారా.

AP BRS Office

70వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటాకి వైజాగ్ స్టీల్ కట్టబెడతారా...

తప్పుడు లెక్కల్లో దొరికిపోయిన అదానికి అప్పగిస్తారా...

ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర సూటి ప్రశ్న

విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఉక్కు సంకల్ప పోరు....

8వ తేదీన విశాఖ పర్యటనకు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ ప్లాన్

ఈ నెల పదో తేదీని వైజాగ్ స్టీల్ ఉద్యోగ సంఘాలతో భేటీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు భారత రాష్ట్ర సమితి ఆంధప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్. స్టీల్ ప్లాంట్ను తన వ్యాపార మిత్రులు, సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వెల్లడించారు. పరిశ్రమలన్న తర్వాత లాభనష్టాలుంటాయని.. ప్రైవేటు రంగంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఉన్న టాటా ప్లాంట్ కూడా 70 వేల కోట్ల రూపాయల నష్టంలో నడుస్తోందని తోట చంద్రశేఖర్ వెల్లడించారు. కానీ.. టాటా కంపెనీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనేందుకు ఆసక్తి చూపుతోందని తెలిపారు. అసలు నష్టాల్లో ఉన్న టాటా స్టీల్.. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా టేకప్ చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. జిందాల్ స్టీల్, అదానీ గ్రూప్ ఇలా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. 2014 నుంచీ ఉద్దేశపూర్వంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టేశారని అన్నారు. అయినా 2021-22 వార్షిక సంవత్సంలో స్వల్ప లాభాలు ఆర్జించిన విశాఖ ఉక్కు కర్మాగారం.. ఇవాళ 30 వేల కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిందని వివరించారు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న తోట.. ఏపీలో పార్టీలన్నీ ప్రేక్షక వహించడం ద్వారా బీజేపీ సహకరిస్తున్నాయని ఆరోపించారు. కుట్రపూరితంగా దొడ్డిదారిన ప్రైవేటు భాగస్వామ్యాల్ని ఆహ్వానించేందుకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటీసుని కేంద్రం విడుదల చేసిందని బీఆర్ఎస్ మాత్రమే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తెలంగాణా మంత్రి కేటి రామారావు రాసిన బహిరంగ లేఖకు సమాధానం చెప్పే దమ్ముందా అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని పార్టీలు ఏమీ చేయలేవనే ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు తెలిపారు. ఏపీలో పార్టీలన్నీ బీజేపీ చేతిలో తోలు బొమ్మలుగా మారాయని.. కేంద్రం చెప్పినదానికి జీహుజూర్ అంటూ తలాడించేలా తయారయ్యాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని ఆ దిశగా బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రాంతాలకు అతీతంగా 32 మంది తెలుగు వాళ్లు బలిదానాలు చేశారని, వాటిని పట్టించుకోకుండా వ్యవహరించడం చారిత్రక తప్పిదం అవుతుందని తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఏకమైతే ఈ దుశ్చర్యని కచ్చితంగా అడ్డుకొని తీరతామని వెల్లడించారు. విశాఖ ప్లాంట్కు 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని వాటిని కారుచౌకగా కొట్టేసేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీ ఇందులో ముందు వరుసలో ఉన్నారని ఈ విషయం గూగుల్ కూడా చెబుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గూగుల్లో 'హూ వాంట్స్ టు బై వైజాగ్ స్టీల్ ప్లాంట్' అని కొడితే అదానీ పేరే చూపిస్తోందని తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం గంగవరం పోర్టును అదానీ గ్రూపు చేజిక్కించుకున్నట్లే.. విశాఖ స్టీల్ ప్లాంట్ను చౌకగా కొట్టేసే కుట్రలు జరగుతున్నాయ చంద్రశేఖర్ విమర్శించారు. అదానీ కాకపోతే మోదీ వ్యాపార మిత్రులు మరొకరైనా దీన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారని ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ, కార్మిక సంఘాలతో భేటీ కానున్నట్టు డాక్టర్ తోట చంద్రశేఖర్ వెల్లడించారు. ఈనెల పదో తేదీన విశాఖలో ఆయా బృందాలతో చర్చలు జరుపుతామని, పార్టీ అధిష్టానంతో చర్చించి స్పష్టమైన ప్రణాళిక ప్రకటిస్తామని ఆయన వివరించారు.

madagoni surendar

Apr 07 2023, 17:16

వైఎస్సార్ జిల్లా....కడపలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం..

వైఎస్సార్ జిల్లా....కడపలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం..

"మా నమ్మకం నువ్వే జగనన్న" పోస్టర్ ఆవిష్కరించిన డిప్యూటి సీఎం అంజద్ బాష...

పాల్గొన్న రాష్ట్ర చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, డిప్యూటీ మేయర్లు,

కార్పొరేటర్లు, మహిళా నాయకురాలు , కార్యకర్తలు...

డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ...

జగనన్న నీవే మా భవిషత్ ఆన్న నినాదంతో కొత్త కార్యక్రమం చేపట్టాం..

అధికారంలో ఉండగా తమ ప్రభుత్వ పనితీరును ధైర్యంగా చెప్పి, వారికి అవగాహన కల్పించే సాహసోపేత నిర్ణయం..

కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసేందుకే ఈ జగనన్నే మా భవిషత్ కార్యక్రమం..

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు ఏవేమీ అందుతున్నాయి.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గుర్తించేలా వైసిపి సైనికులు పనిచేస్తారు..

వైసిపి పార్టీ సైనికులు, గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వివరిస్తారు..

పథకాల వివరాలతో కరపత్రం, స్టిక్కర్ అందిస్తారు..

సంతృప్తి చెందితేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్..

అన్ని వర్గాలు, కులాలు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం...

madagoni surendar

Apr 07 2023, 17:00

ఏపీ :సిఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్.

CBN సెల్ఫీ ఛాలెంజ్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్!

నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు

చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరు లో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్

రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ వ్యాఖ్య

ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..నువ్వు కట్టిన ఇళ్లెక్కడ...జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటో తో ట్వీట్ చేసిన చంద్రబాబు

తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరిన చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్ కు, లీడర్స్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత

madagoni surendar

Apr 07 2023, 16:08

ఏపీ:కృష్ణాజిల్లా: గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా కలకలం..

కృష్ణాజిల్లా:

గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా కలకలం....

తెలప్రోలు గ్రామానికి చెందిన బసవయ్య అనే వ్యక్తి జ్వరం,జలుబు,దగ్గు తో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చాడు....

అనుమానం తో వైద్యులు కోవిడ్ పరీక్ష చేస్తే పాజిటివ్ అని రావడం తో కంగ్గుతిన్న బసవయ్య....

బసవయ్య ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి మెరుగైన వైద్యం కోసం తరలించారు...

madagoni surendar

Apr 07 2023, 16:05

తూర్పుగోదావరి. కొవ్వూరు పట్టణంలో శాంతి లాల్ జైన్ తాకట్టు షాపులో జరిగిన నాలుగున్నర కేజీల బంగారం దొంగతనాన్ని చేదించిన పోలీసులు

తూర్పుగోదావరి.

కొవ్వూరు పట్టణంలో శాంతి లాల్ జైన్ తాకట్టు షాపులో జరిగిన నాలుగున్నర కేజీల బంగారం దొంగతనాన్ని చేదించిన పోలీసులు

కొవ్వూరు డిఎస్పి కార్యాలయంలో పత్రికా సమావేశం పాల్గొన్న అడిషనల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు

సుమారు కోటి పది లక్షలు బంగారం స్వాధీనం

నిందితుడు బంగారం షాపులో పనిచేస్తున్న గుమస్తా రాము ని అరెస్ట్ చేసారు. అతని ని రిమాందుకు ఈ రోజు పంంపారు.

madagoni surendar

Apr 07 2023, 12:14

ఒక్కరోజే 6 వేల కరోనా కేసులు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నేడు కేంద్రం సమావేశం.

ఒక్కరోజే 6 వేల కరోనా కేసులు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నేడు కేంద్రం సమావేశం

24 గంటల్లో 6,050 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

వైరస్ వల్ల తాజాగా 14 మరణాలు నమోదు

3.39 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు

భారత్ లో  కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా గత 24 గంటల్లో  6,050 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటింది.

నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్ వల్ల  తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి.

దాంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

కరోన కేసుల వ్యాప్తి నేపథ్యంలో  కేంద్ర అప్రమత్తం అయింది.

కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

కరోనా వ్యాప్తిపై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

ప్రధాని మోదీ దీనిపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు.

నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు’ అని ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్‌ తెలిపారు...

madagoni surendar

Apr 07 2023, 11:16

నేడు బీజేపీలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి.

నేడు బీజేపీలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. ఈరోజు 12 గంటలకు ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఏపీకి ఆయన సేవలను పరిమితం చేస్తారా? తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో వినియోగించుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన కేంద్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరుతుండటంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.