madagoni surendar

Apr 07 2023, 16:08

ఏపీ:కృష్ణాజిల్లా: గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా కలకలం..

కృష్ణాజిల్లా:

గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా కలకలం....

తెలప్రోలు గ్రామానికి చెందిన బసవయ్య అనే వ్యక్తి జ్వరం,జలుబు,దగ్గు తో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చాడు....

అనుమానం తో వైద్యులు కోవిడ్ పరీక్ష చేస్తే పాజిటివ్ అని రావడం తో కంగ్గుతిన్న బసవయ్య....

బసవయ్య ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి మెరుగైన వైద్యం కోసం తరలించారు...

madagoni surendar

Apr 07 2023, 16:05

తూర్పుగోదావరి. కొవ్వూరు పట్టణంలో శాంతి లాల్ జైన్ తాకట్టు షాపులో జరిగిన నాలుగున్నర కేజీల బంగారం దొంగతనాన్ని చేదించిన పోలీసులు

తూర్పుగోదావరి.

కొవ్వూరు పట్టణంలో శాంతి లాల్ జైన్ తాకట్టు షాపులో జరిగిన నాలుగున్నర కేజీల బంగారం దొంగతనాన్ని చేదించిన పోలీసులు

కొవ్వూరు డిఎస్పి కార్యాలయంలో పత్రికా సమావేశం పాల్గొన్న అడిషనల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు

సుమారు కోటి పది లక్షలు బంగారం స్వాధీనం

నిందితుడు బంగారం షాపులో పనిచేస్తున్న గుమస్తా రాము ని అరెస్ట్ చేసారు. అతని ని రిమాందుకు ఈ రోజు పంంపారు.

madagoni surendar

Apr 07 2023, 12:14

ఒక్కరోజే 6 వేల కరోనా కేసులు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నేడు కేంద్రం సమావేశం.

ఒక్కరోజే 6 వేల కరోనా కేసులు.. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నేడు కేంద్రం సమావేశం

24 గంటల్లో 6,050 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

వైరస్ వల్ల తాజాగా 14 మరణాలు నమోదు

3.39 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు

భారత్ లో  కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా గత 24 గంటల్లో  6,050 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటింది.

నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్ వల్ల  తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి.

దాంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారం వారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

కరోన కేసుల వ్యాప్తి నేపథ్యంలో  కేంద్ర అప్రమత్తం అయింది.

కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

కరోనా వ్యాప్తిపై కేంద్రం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది.

ప్రధాని మోదీ దీనిపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు.

నేడు ఆరోగ్య మంత్రి మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు’ అని ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్‌ తెలిపారు...

madagoni surendar

Apr 07 2023, 11:16

నేడు బీజేపీలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి.

నేడు బీజేపీలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. ఈరోజు 12 గంటలకు ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఏపీకి ఆయన సేవలను పరిమితం చేస్తారా? తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో వినియోగించుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన కేంద్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరుతుండటంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

madagoni surendar

Apr 07 2023, 09:21

అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

అమరావతి

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

57మంది IAS అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.

ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత అధికారులు..

1.జి.అనంత రాము -

మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

2.RP సిసోడియా - APHRD డీజీ

3.B.శ్రీధర్ -.ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబెర్ సెక్రటరీ

4.సౌరభ్ గౌర్ - ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీ

5.రిటైర్డ్ అధికారి ఆదిత్య నాధ్ దాస్ ను బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.

6.కోన శశిధర్ - ఐటీ శాఖ కార్యదర్శి

7. కె.హర్షవర్ధన్ - శాప్ ఎండీ

8.ఎంవీ శేషగిరి బాబు - కార్మిక శాఖ కమిషనర్

9.ఎం. హరిజావహర్ లాల్ - కార్మిక కర్మాగారాలు బాయిలర్స్ కార్యదర్శి

10.ప్రవీణ్ కుమార్ - APIIC ఎండీ

11.ఎస్.సత్యనారాయణ - దేవదాయ శాఖ కమిషనర్

12.పి.బసంత్ కుమార్ - స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ఎండీ

13.ఎ. సూర్యకుమారి - పంచాయతీ రాజ్ కమిషనర్

14.పి.కోటేశ్వరరావు - మున్సిపల్ శాఖ డైరెక్టర్

15.కేవీఎన్ చక్రధర్ బాబు - ఏపీ జెన్కో ఎండీ

16.ఎం. హరినరాయన్ - నెల్లూరు కలెక్టర్

17.ఎస్.నాగలక్ష్మి - విజయనగరం కలెక్టర్

18.ఎన్. ప్రభాకర్ రెడ్డి - సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ

19.ఎస్ షన్మోహన్ - చిత్తూరు కలెక్టర్

20.ఎస్.సృజన - కర్నూల్ కలెక్టర్

21.కె.విజయ - సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్

22.పి.రంజిత్ బాషా - బాపట్ల కలెక్టర్

23.పి.రాజ బాబు - కృష్ణా జిల్లా కలెక్టర్

24 జీసీ.కిషోర్ కుమార్ - జీఎడి కి రిపోర్ట్

25.పి.అరుణ్ బాబు - సత్యసాయి కలెక్టర్

26.ఎం. గౌతమి - అనంతపురం కలెక్టర్

27.బి.లావణ్య వేణి - ఏలూరు కలెక్టర్

28.ఎం. విజయ సునీత - మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్

29.ఎ. సిరి - పార్వతీ పురం మన్యం జాయింట్ కలెక్టర్

30.జె.వెంకట మురళి - ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్

31.ఎస్.రామ సుందర్ - పశ్చిమగోదావరి జేసీ

32.సీఎం సైకత్ వర్మ - విశాఖ మున్సిపల్ కమిషనర్

33.తమీమ్ అన్సారియా - జీఎడి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు

34.సీహెచ్ శ్రీధర్ - ప్రకాశం కలెక్టర్

35.ఎస్.వెంకటేశ్వర్ - AP వైద్య విధాన పరిషత్ కమిషనర్

36.వి.వినోద్ కుమార్ - ఎండీ,స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్

37.బి.నవ్య - ఉపాధి కల్పన-శిక్షణ

38.పి.సంపత్ కుమార్ - NTR జిల్లా జాయింట్ కలెక్టర్

39.జి.గణేష్ కుమార్ - వైఎస్సార్ జిల్లా జేసీ

40.ఓ.ఆనంద్ కుమార్ - విశాఖ కమర్షియల్ టాక్స్ జేసీ

41.మహేష్ కుమార్ రావిరాల - కాకినాడ మున్సిపల్ కమిషనర్

42.రోనంకి గోపాల కృష్ణ - అడిషనల్ డైరెక్టర్,సర్వే-సెటిల్ మెంట్ శాఖ

43.అనుపమ అంజలి - GAD కి రిపోర్ట్

44.నారపురెడ్డి మౌర్య - తిరుపతి మున్సిపల్ కమిషనర్

45.కల్పన కుమారి - పీడీ,సీతంపేట ITDA

46.బి.శ్రీనివాసరావు - సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్

47.ఎ. భార్గవ్ తేజ - అడిషనల్ డైరెక్టర్,పంచాయతీ రాజ్ శాఖ

48.హిమాన్షు కౌశిక్ - అన్నమయ్య జిల్లా జేసీ

49.ఇమ్మడి పృథ్వి తేజ్ - సీఎండీ,APEPDCL

50.ఎం. జాహ్నవి - అనకాపల్లి జేసీ

51.నుపూర్ అజయ్ కుమార్ - సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ

52.వి.అభిషేక్ - పీడీ,పాడేరు ITDA

53.వికాస్ మర్మట్ - కర్నూల్ జేసీ

54.పి.శ్రీనివాసులు - చిత్తూరు జేసీ

55.అభిషిక్త్ కిషోర్ - డిప్యూటీ సెక్రటరీ,ఫైనాన్స్ డిపార్ట్మెంట్

56.ఎస్.సురేష్ కుమార్ - ఇంటర్ బోర్డు ఇంచార్జి కమిషనర్

57.జె.వీరపాండ్యన్ - సివిల్ సప్లైస్ ఇంచార్జి డైరెక్టర్.

madagoni surendar

Apr 07 2023, 09:16

పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ లభించింది.

|| " BIG BREAKING NEWS " ... బండి సంజయ్ కు బెయిల్ ||

▪️పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ లభించింది.

▪️హనుమకొండ మెజిస్ట్రేట్ ఆయనకి 20,000 పూచీ కత్తుతో బెయిల్ ఇచ్చింది.

▪️నిన్న సంజయ్ కు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు.

▪️బిజెపి లీగల్ సెల్ టీం సంజయ్ తరఫున హనుమకొండలో బెయిల్ పిటిషన్ వేసింది.

▪️దీనిపై సుదీర్ఘంగా విచారించిన మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది.

madagoni surendar

Apr 07 2023, 09:07

ఏపీ:గుడివాడ పర్యటనపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష.ఈ నెల 12న మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'

గుడివాడ పర్యటనపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష

ఈ నెల 12న మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'

ఈ నెల 13న గుడివాడలో రోడ్ షో, సభ

ఈ నెల 14న గుడివాడలో అంబేద్కర్ జయంతి

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభించనున్న చంద్రబాబు

గుంటూరు, : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ, మచిలీపట్నంలో ఆయన రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, గుడివాడ పర్యటనపై పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, వెనిగండ్ల రాముతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ జయంతిని గుడివాడలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిమ్మకూరులో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 12న మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు గుడివాడలోనే బస చేయనున్నారు. ఈ నెల 14న ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.

madagoni surendar

Apr 06 2023, 21:12

నల్గొండ జిల్లా:అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం.

అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం

బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్

నకిరేకల్ లో యూత్ కాంగ్రెస్ సమన్వయ సమావేశం

.

Streetbuzz news. నల్గొండ జిల్లా:

నకిరేకల్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకుంటున్న అవినీతిపరులపై యుద్ధం చేయడానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం అవుతోందని బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బూత్ జోడో యూత్ జోడో కార్యక్రమానికి తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక శిక్షణ అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నియామకాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ, విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతుంటే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, ఇప్పటికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి బూత్ కు సంబంధించిన ఓటర్లను సమన్వయపరుచుకోవడమే బూత్ జోడో యూత్ జోడో ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల కళలు సాకారం కావాలన్నా, బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

ధరణి దరిద్రాన్ని పారదోలుతాం: రాజారమేష్ యాదవ్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ఇబ్బందులు పెట్టే ధరిణి దరిద్రాన్ని పారదోలుతామని యూత్ కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాజారమేష్ యాదవ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న యువకులంతా ధరిణి పోర్టల్ ద్వారా ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో రైతులకు వివరించాలని కోరారు. నకిరేకల్ నియెజవర్గంలో ఎవరూ పోటీచేసినా కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని అన్నారు. బూత్ జోడో యూత్ జోడోతో ముందుకు పోతామని, క్రియాశీలకంగా పనిచేసే వారికి కాంగ్రెస్ లో ప్రథమ స్థానం ఉంటుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నకిరేకల్ చౌరస్తా వరకూ వందల సంఖ్య యూత్ కాంగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జఠంగి వెంకటనర్సయ్య, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, బొంబాయి శ్రీను, మాచర్ల శ్రీను, ఒంటే పాక తిరుమలేశ్, వేణు, పావురాల సైదులు, పజ్జూరి లింగస్వామి, బొజ్జ చంటి, తదితరులు పాల్గొన్నారు.

పీఆర్వో

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

madagoni surendar

Apr 06 2023, 21:08

నల్గొండ జిల్లా :అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం .కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం.

అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం

బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్

నకిరేకల్ లో యూత్ కాంగ్రెస్ సమన్వయ సమావేశం

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకుంటున్న అవినీతిపరులపై యుద్ధం చేయడానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం అవుతోందని బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బూత్ జోడో యూత్ జోడో కార్యక్రమానికి తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక శిక్షణ అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నియామకాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ, విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతుంటే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, ఇప్పటికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి బూత్ కు సంబంధించిన ఓటర్లను సమన్వయపరుచుకోవడమే బూత్ జోడో యూత్ జోడో ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల కళలు సాకారం కావాలన్నా, బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

ధరణి దరిద్రాన్ని పారదోలుతాం: రాజారమేష్ యాదవ్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ఇబ్బందులు పెట్టే ధరిణి దరిద్రాన్ని పారదోలుతామని యూత్ కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాజారమేష్ యాదవ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న యువకులంతా ధరిణి పోర్టల్ ద్వారా ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో రైతులకు వివరించాలని కోరారు. నకిరేకల్ నియెజవర్గంలో ఎవరూ పోటీచేసినా కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని అన్నారు. బూత్ జోడో యూత్ జోడోతో ముందుకు పోతామని, క్రియాశీలకంగా పనిచేసే వారికి కాంగ్రెస్ లో ప్రథమ స్థానం ఉంటుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నకిరేకల్ చౌరస్తా వరకూ వందల సంఖ్య యూత్ కాంగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జఠంగి వెంకటనర్సయ్య, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, బొంబాయి శ్రీను, మాచర్ల శ్రీను, ఒంటే పాక తిరుమలేశ్, వేణు, పావురాల సైదులు, పజ్జూరి లింగస్వామి, బొజ్జ చంటి, తదితరులు పాల్గొన్నారు.

పీఆర్వో

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

madagoni surendar

Apr 06 2023, 19:36

ఏపీ:దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డాక్టర్ పథకం. పేదవాడి ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డాక్టర్ పథకం

పేదవాడి ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత

జగన్నాధపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం ప్రభన్యూస్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఫ్యామిలీ డాక్టర్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు గురువారం తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్వర్గీయ దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పధకం ఇప్పుడు దేశానికీ శిరోధార్యంగా మారిందన్నారు. కరోన సమయంలో దేశం మొత్తం అల్లాడిపోయినా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్యం సమాచారం సేకరించిన సచివాలయం వ్యవస్థ ద్వారా మరింత మొరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే ఆశయంతో ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.పేదవాడి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధమపాధాన్యత అన్నారు. ఆరోగ్యానికి కాపాడుకొనేందుకు వేలాది, లక్షలాది. రూపాయలను వెచ్చించే దుస్థితి నుండి పేదవాడిని రక్షించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోపడుతుందన్నారు. దీనితో ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు పథకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. నాడు వైఎస్.రాజశేఖరరెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచన చేశారన్నారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ముప్పిడి సంపత్ కుమార్ జడ్పిటిసి సభ్యులు ముత్యాల ఆంజనేయులు తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషు లత పెంటపాడు ఎంపీపీ దాసర హేమావతి ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు