నల్గొండ జిల్లా:అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం.
అవినీతిపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సాకారం
బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్
నకిరేకల్ లో యూత్ కాంగ్రెస్ సమన్వయ సమావేశం
.
Streetbuzz news. నల్గొండ జిల్లా:
నకిరేకల్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకుంటున్న అవినీతిపరులపై యుద్ధం చేయడానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం అవుతోందని బూత్ జోడో యూత్ జోడో తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బూత్ జోడో యూత్ జోడో కార్యక్రమానికి తెలంగాణ ఇన్చార్జి శ్రీనివాస్ హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక శిక్షణ అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నియామకాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ, విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతుంటే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, ఇప్పటికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి బూత్ కు సంబంధించిన ఓటర్లను సమన్వయపరుచుకోవడమే బూత్ జోడో యూత్ జోడో ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల కళలు సాకారం కావాలన్నా, బాబాసాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
ధరణి దరిద్రాన్ని పారదోలుతాం: రాజారమేష్ యాదవ్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ఇబ్బందులు పెట్టే ధరిణి దరిద్రాన్ని పారదోలుతామని యూత్ కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాజారమేష్ యాదవ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న యువకులంతా ధరిణి పోర్టల్ ద్వారా ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో రైతులకు వివరించాలని కోరారు. నకిరేకల్ నియెజవర్గంలో ఎవరూ పోటీచేసినా కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని అన్నారు. బూత్ జోడో యూత్ జోడోతో ముందుకు పోతామని, క్రియాశీలకంగా పనిచేసే వారికి కాంగ్రెస్ లో ప్రథమ స్థానం ఉంటుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నకిరేకల్ చౌరస్తా వరకూ వందల సంఖ్య యూత్ కాంగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జఠంగి వెంకటనర్సయ్య, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, బొంబాయి శ్రీను, మాచర్ల శ్రీను, ఒంటే పాక తిరుమలేశ్, వేణు, పావురాల సైదులు, పజ్జూరి లింగస్వామి, బొజ్జ చంటి, తదితరులు పాల్గొన్నారు.
పీఆర్వో
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
Apr 07 2023, 09:07