నెల్లూరు జిల్లా: ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందికి వాటర్ కూలర్స్ , హ్యాట్స్, సన్ గ్లాసెస్ అందించిన జిల్లా యస్.పి. విజయ రావు, ఐపీఎస్ .*
నెల్లూరు జిల్లా
ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందికి వాటర్ కూలర్స్ , హ్యాట్స్, సన్ గ్లాసెస్ అందించిన జిల్లా యస్.పి. విజయ రావు, ఐపీఎస్ .
ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ట్రాఫిక్ పోలీసులకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 150 వాటర్ కూలర్స్ , 150 హ్యాట్స్ మరియు 150 సన్ గ్లాసెస్ పంపిణీ.నిత్యం ఎండలో నిలబడి దుమ్ము, ధూళి లెక్కచేయకుండా జిల్లాలోని ట్రాఫిక్ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు కనుక వారి సంక్షేమం నా భాధ్యత –యస్.పి.
ఎండ తీవ్రత కూడా విపరీతంగా పెరిగింది. మండుటెండలో తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
స్వీయ రక్షణ చాలా అవసరం. ఎండకు నీరు బాగా తాగాలి, డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అత్యవసర కార్యకలాపాలు సాఫీగా సాగుటకు ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనది.*
నిరంతరం ప్రజల కంటికి కనబడే పోలీస్ విభాగమే ట్రాఫిక్.
ప్రముఖుల రాకపోకలు, పరిక్షల సమయంలో, ఇటీవల జరిగిన శోభాయాత్రలో ట్రాఫిక్ సమన్వయం చాలా బాగుంది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలన వేయడంలో, ఫైన్ కట్టించుటలో బాగా విధులు నిర్వహిస్తున్నారని అభినందనలు.
విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలని తెలిపారు.
మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తా, చక్కగా పని చేయండి.
మా సంక్షేమంకొరకు ఎంతో శ్రద్ద తీసుకుంటు అన్ని రకాల సదుపాయలు అందిస్తున్న యస్.పి. గారికి సంతోషంతో ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తపరిచి విదులు సక్రమంగా
నిర్వహిస్తామని తెలిపిన ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది.
జిల్లా పోలీసు కార్యాలయం,
Apr 05 2023, 21:13