తెలంగాణ. సచివాలయ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు
తెలంగాణ. సచివాలయ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
30న శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు
గృహలక్ష్మి విధివిధానాలు రూపొందించండి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహావిషరణ సమీక్ష అనంతరం సచివాలయ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యాంశాలు
ఏప్రిల్ 30న 'డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగా ణ సచివాలయం' ప్రారంభ కార్యక్రమం ఉం టుంది. ఉదయం శాస్ర్తోక్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొం టారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది. సంబంధిత షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు.
సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి తన చాంబర్‌లో ఆసీనులు అవుతారు. వెంటవచ్చిన మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో సిబ్బంది, సచివాలయ సిబ్బంది తమతమ చాంబర్లలోకి వెళ్లి తమ సీట్లల్లో ఆసీనులు అవుతారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్తు చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధుసమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు పాల్గొంటారు. అందరూ కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారు. వీరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు.
సచివాలయం రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపడుతారు.
సచివాలయం నాలుగు దికుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు.
నార్త్‌ఈస్ట్ (ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్‌ఈస్ట్ (ఆగ్నేయం) ద్వారం విజిటర్స్ కోసం వినియోగిస్తారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
తూర్పుగేట్ (మెయిన్‌గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు.
దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్ బగ్గీలను ఏర్పాటుచేస్తారు. ప్రైవేట్ వాహనాలను సచివాలయంలోకి అనుమతించరు.
సత్వరమే గృహలక్ష్మి విధి విధానాలు
ఖాళీ స్థలాలు ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభించాలని సూచించారు. సత్వరమే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దళితబంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పారు.
Apr 05 2023, 20:48