తెలంగాణ. సచివాలయ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ. సచివాలయ ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

30న శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు

గృహలక్ష్మి విధివిధానాలు రూపొందించండి

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహావిషరణ సమీక్ష అనంతరం సచివాలయ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యాంశాలు

ఏప్రిల్‌ 30న 'డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ తెలంగా ణ సచివాలయం' ప్రారంభ కార్యక్రమం ఉం టుంది. ఉదయం శాస్ర్తోక్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొం టారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది. సంబంధిత షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు.

సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి తన చాంబర్‌లో ఆసీనులు అవుతారు. వెంటవచ్చిన మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో సిబ్బంది, సచివాలయ సిబ్బంది తమతమ చాంబర్లలోకి వెళ్లి తమ సీట్లల్లో ఆసీనులు అవుతారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్తు చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధుసమితి అధ్యక్షులు, మున్సిపల్‌ మేయర్లు తదితరులు పాల్గొంటారు. అందరూ కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారు. వీరికి భోజనాలు ఏర్పాటు చేస్తారు.

సచివాలయం రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపడుతారు.

సచివాలయం నాలుగు దికుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్‌ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు.

నార్త్‌ఈస్ట్‌ (ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్‌ఈస్ట్‌ (ఆగ్నేయం) ద్వారం విజిటర్స్‌ కోసం వినియోగిస్తారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

తూర్పుగేట్‌ (మెయిన్‌గేట్‌) ముఖ్యమంత్రి, సీఎస్‌, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు.

దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రిక్‌ బగ్గీలను ఏర్పాటుచేస్తారు. ప్రైవేట్‌ వాహనాలను సచివాలయంలోకి అనుమతించరు.

సత్వరమే గృహలక్ష్మి విధి విధానాలు

ఖాళీ స్థలాలు ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభించాలని సూచించారు. సత్వరమే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దళితబంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1022 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 1 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 30 ఏప్రిల్ 2023. ఈ పోస్టులను రిటైర్డ్ ఉద్యోగుల కొరకు కేటాయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం.. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను sbi.co.in సందర్శించాలి. మొత్తం 1022 ఉద్యోగాల్లో.. ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్, ఛానల్ మేనేజర్ సూపర్‌వైజర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మూడు కేటగిరీలకు కనీస వయోపరిమితి 60 ఏళ్లుగా, గరిష్ట వయో పరిమితి 63 ఏళ్లుగా నిర్ణయించారు.

స్టేట్ బ్యాంక్ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ బ్యాంకు నుండి రిటైర్డ్ ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఆపై వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

డిల్లీ: మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ.

డిల్లీ: మోదీ, అమిత్, నడ్డా భేటీ.. సంజయ్ అరెస్టుపై చర్చ

ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానితో మీటింగ్ అనంతరం అమిత్ షా, నడ్డా విడిగా సమావేశం అయ్యారు. సంజయ్ అరెస్టు నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీ :వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కుటుంబానికి ఉపాధి కల్పించిన ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను.

_*వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కుటుంబానికి ఉపాధి కల్పించిన ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను.

_వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ పురోభివృద్ధికి కృషిచేసిన కుటుంబానికి ప్రభుత్వవిప్,సామినేని ఉదయభాను అండగా నిలిచారు._

_జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఇడుపులపాటి సంతోష్ కుమార్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా పనిచేస్తూ ఉండేవాడు.అనుకోని విధంగా ప్రమాదవశాత్తు ఇటీవల కాలంలో మరణించాడు.దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మనోవేదనకు గురవడంతో స్పందించిన ప్రభత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు వారి స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించారు,వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అప్పటికే నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన సంతోష్ కుమార్ భార్య ప్రసన్న కుమారికి ఈరోజు విజయవాడలోని ప్రభుత్వ హాస్పటల్ నందు నర్సింగ్ జాబ్ ఇప్పించడం జరిగింది._

_ఈ సందర్భంగా వారి భార్య ప్రసన్న కుమారి మాట్లాడుతూ తన భర్త సోషల్ మీడియాలో పనిచేయడంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మా కుటుంబానికి అండగా నిలిచిందని,భర్త చనిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నా విషయాన్ని ఉదయభాను దృష్టికి తీసుకోవడంతో నర్సింగ్ పూర్తి చేసుకున్న నాకు వారి సహకారంతో ఈరోజు విజయవాడలో ప్రభుత్వ హాస్పటల్ నందు GNM(General Nursing and Midwifery) పోస్ట్ ఇప్పించడం జరిగిందని తెలిపారు. నా కుటుంబానికి ఇంతటి ఆర్థిక భరోసాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కి కృతజ్ఞతలు తెలిపారు._

_ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు._

ఏపీ 40G : ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్ ..

ఏపీ 40G : ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్ ...

ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది.

తమిళనాడు తరహాలోనే ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి.

కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి.

అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి.

వీటి స్ధానంలో కొత్త సిరీస్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు.

ప్రభుత్వం ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు.

ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు.

ఈ లోగా వచ్చే అభ్యంతరాలను పరిశీలించి నోటిఫికేషన్ లో తగు మార్పులు చేసి అమలు చేయబోతున్నారు.

తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.

వాస్తవానికి రాష్ట్రంలో వన్ స్టేట్-వన్ సిరీస్ ను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

దీంతో అప్పటివరకూ జిల్లాల వారీగా ఉన్న పలు సిరీస్ లు రద్దయ్యాయి.

వాటి స్ధానంలో కొత్తగా ఏపీ 39 సిరీస్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

దీంత ఇప్పుడు శ్రీకాకుళంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, తిరుపతిలో చేసుకున్నా అదే సిరీస్ వర్తిస్తోంది.

ప్రభుత్వ వాహనాలకు సైతం ఇదే సిరీస్ అమలు చేస్తున్నారు.

కానీ ప్రభుత్వ వాహనాలు ప్రత్యేకంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది..

ఇంజినీరింగ్ మొదటి ఏడాది తరగతులు సెప్టెంబరు 15 నుంచి: ఏఐసీటీఈ

ఇంజినీరింగ్ మొదటి ఏడాది తరగతులు సెప్టెంబరు 15 నుంచి: ఏఐసీటీఈ

ఇంజినీరింగ్ మొదటి ఏడాది తరగతులను సెప్టెం బరు 15 నుంచి ప్రారంభించాలని, ఈ లోపు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయా లని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. సాంకేతిక విద్యా కోర్సులకు 2023-24 అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఏఐసీటీఈ జూన్ 10లోపు కళాశాలలకు అనుమతులు లేదా తిర స్కరణ ప్రక్రియను పూర్తి చేస్తుందని, అప్పీల్ చేసుకున్న వాటికి జూన్ 30 లోపు అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తుందని వెల్లడించింది. విశ్వవి ద్యాలయాలు, బోర్డులూ జులై 31 లోపు కళాశాలలకు అనుబంధ గుర్తింపు, అనుమతులు ఇవ్వాలని సూచించింది. సాంకేతిక విద్యాకో ర్సుల సీట్ల రద్దు, పూర్తి రుసుము తిరిగి ఇచ్చేందుకు సెప్టెంబరు 11 వరకు గడువు ఇచ్చింది. రెండో ఏడాది కోర్సుల కోసం ల్యాటర్ ఎంట్రీకి సైతం చివరి గడువు సెప్టెంబరు 15గా విధించింది.పీజీడీఎం, పీజీసీఎం విద్యా సంస్థల్లో సైతం ప్రవేశాలను సెప్టెంబరు 15లోపు పూర్తి చేయా లని సూచించింది.

సకల సౌకర్యాలతో పునర్నిర్మాణం కానున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ..

అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే రీతిలో.. ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా.. సకల సౌకర్యాలతో పునర్నిర్మాణం కానున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.

₹719 కోట్లు ఖర్చు కానున్న ఈ బృహత్కార్యానికి ఈ నెల 8వ తేదీన శంఖుస్థాపన చేయనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ...

నల్గొండ జిల్లా:నకిరేకల్::బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగ్జీవన్ రామ్. విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి. అనంతరం. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ... కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని ఆయన అన్నారు.దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని ఆయన కొనియాడారు.జగ్జీవన్‌రామ్‌ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుంది అని ఆయన గుర్తు చేశారు.సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజాభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ :నెల్లూరు నగరం లోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప మిస్సింగ్ విషాదాంతం .

నెల్లూరు జిల్లా....

నెల్లూరు నగరం లోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప మిస్సింగ్ విషాదాంతం .

సర్వేపల్లి కాలువలో చిన్నారి మృతదేహం

నిన్న తెల్లవారు జామున ఊయలలో ఉన్న పాప అదృశ్యం...

ఊయలలో బొమ్మను ఉంచి పాపను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పాప తల్లిదండ్రులు అనూష, మణికంఠ...

పాప మరణం వెనుక ఉన్న హంతకులను పోలీసులు కనుగొని కఠినంగా శిక్షించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు*

భూమిని పోలిన గ్రహం

భూమిని పోలిన గ్రహం

దిల్లీ: సౌర కుటుంబం వెలుపల భూమిని పోలిన ఒక శిలామయ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనకు 12 కాంతి సంవత్సరాల దూరంలోని ఆ గ్రహానికి అచ్చం పుడమి లాంటి అయస్కాంత క్షేత్రం ఉంది. అమెరికాలోని కొలరాడో, బక్నెల్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన సెబాస్టియన్‌ పైనెడా, జాకీ విలాడ్సెన్‌లు కనుగొన్న ఈ గ్రహం.. ‘వై జడ్‌ సెటీ’ అనే ఎర్ర మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఆ గ్రహానికి ‘వై జడ్‌ సెటీ బి’ అని నామకరణం చేశారు. ఈ గ్రహ అయస్కాంత క్షేత్రానికి, దాని మాతృ నక్షత్రానికి మధ్య జరుగుతున్న చర్యలు రేడియో తరంగాలను సృష్టిస్తున్నాయి. వాటిని రేడియో టెలిస్కోప్‌ ద్వారా పసిగట్టడం వల్ల ఈ గ్రహ ఉనికిని కనిపెట్టగలిగారు. అయస్కాంత క్షేత్రం వల్ల దిక్సూచి.. ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఈ క్షేత్రం నక్షత్రం నుంచి గ్రహం మీదకు వచ్చిపడే ప్లాస్మానూ, శక్తిమంతమైన రేణువులను పక్కకు నెట్టి జీవం ఉనికికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇంతవరకు ఖగోళవేత్తలు గురు గ్రహంలాంటి బృహత్తర గ్రహాల అయస్కాంత క్షేత్రాలను మాత్రమే కనిపెట్టగలిగారు. భూమి వంటి చిన్న గ్రహాల క్షేత్రాలను కనిపెట్టడానికి ఇప్పుడు కొత్త పద్ధతులను ప్రయోగిస్తున్నారు.