సకల సౌకర్యాలతో పునర్నిర్మాణం కానున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ..

అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే రీతిలో.. ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా.. సకల సౌకర్యాలతో పునర్నిర్మాణం కానున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.

₹719 కోట్లు ఖర్చు కానున్న ఈ బృహత్కార్యానికి ఈ నెల 8వ తేదీన శంఖుస్థాపన చేయనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ...

నల్గొండ జిల్లా:నకిరేకల్::బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగ్జీవన్ రామ్. విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి. అనంతరం. ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ... కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని ఆయన అన్నారు.దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని ఆయన కొనియాడారు.జగ్జీవన్‌రామ్‌ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుంది అని ఆయన గుర్తు చేశారు.సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజాభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో.నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ :నెల్లూరు నగరం లోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప మిస్సింగ్ విషాదాంతం .

నెల్లూరు జిల్లా....

నెల్లూరు నగరం లోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప మిస్సింగ్ విషాదాంతం .

సర్వేపల్లి కాలువలో చిన్నారి మృతదేహం

నిన్న తెల్లవారు జామున ఊయలలో ఉన్న పాప అదృశ్యం...

ఊయలలో బొమ్మను ఉంచి పాపను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పాప తల్లిదండ్రులు అనూష, మణికంఠ...

పాప మరణం వెనుక ఉన్న హంతకులను పోలీసులు కనుగొని కఠినంగా శిక్షించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు*

భూమిని పోలిన గ్రహం

భూమిని పోలిన గ్రహం

దిల్లీ: సౌర కుటుంబం వెలుపల భూమిని పోలిన ఒక శిలామయ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనకు 12 కాంతి సంవత్సరాల దూరంలోని ఆ గ్రహానికి అచ్చం పుడమి లాంటి అయస్కాంత క్షేత్రం ఉంది. అమెరికాలోని కొలరాడో, బక్నెల్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన సెబాస్టియన్‌ పైనెడా, జాకీ విలాడ్సెన్‌లు కనుగొన్న ఈ గ్రహం.. ‘వై జడ్‌ సెటీ’ అనే ఎర్ర మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఆ గ్రహానికి ‘వై జడ్‌ సెటీ బి’ అని నామకరణం చేశారు. ఈ గ్రహ అయస్కాంత క్షేత్రానికి, దాని మాతృ నక్షత్రానికి మధ్య జరుగుతున్న చర్యలు రేడియో తరంగాలను సృష్టిస్తున్నాయి. వాటిని రేడియో టెలిస్కోప్‌ ద్వారా పసిగట్టడం వల్ల ఈ గ్రహ ఉనికిని కనిపెట్టగలిగారు. అయస్కాంత క్షేత్రం వల్ల దిక్సూచి.. ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఈ క్షేత్రం నక్షత్రం నుంచి గ్రహం మీదకు వచ్చిపడే ప్లాస్మానూ, శక్తిమంతమైన రేణువులను పక్కకు నెట్టి జీవం ఉనికికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇంతవరకు ఖగోళవేత్తలు గురు గ్రహంలాంటి బృహత్తర గ్రహాల అయస్కాంత క్షేత్రాలను మాత్రమే కనిపెట్టగలిగారు. భూమి వంటి చిన్న గ్రహాల క్షేత్రాలను కనిపెట్టడానికి ఇప్పుడు కొత్త పద్ధతులను ప్రయోగిస్తున్నారు.

ఏపీ.అమరావతి:జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి

జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా ముందుగానే ప్రకటించి మరీ తదనుగుణంగా లబ్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్‌ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి

నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరిచారు. ఆ వివరాలను గమనిస్తే...

ఏప్రిల్‌ 2023 – జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మే 2023 – వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా

జూన్‌ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)

ఆగష్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర

సెప్టెంబర్‌ 2023 – వైఎస్సార్‌ చేయూత

అక్టోబర్‌ 2023 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)

నవంబర్‌ 2023 – వైఎస్సార్‌ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)

డిసెంబర్‌ 2023 – జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జనవరి 2024 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)

ఫిబ్రవరి 2024 – జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మార్చి 2024 – జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు

ఏపీ .చంద్రబాబు ఇఫ్తార్ విందుకు జయప్రదం చేయండి: పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరిముల్లా*

చంద్రబాబు ఇఫ్తార్ విందుకు జయప్రదం చేయండి: పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరిముల్లా

ఏప్రిల్ 11 మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం సమీపంలో గల సీకే కన్వెన్షన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే ఆత్మీయ ఇఫ్తార్ విందులో మాజీ శాసనమండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్ , రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ముస్తక్ అహ్మద్ , అనుబంధ సంఘాల అధ్యక్షులు నజీర్ , రాష్ట్ర టిడిపి మైనార్టీ నాయకులందరూ పాల్గొంటారని కావున పార్లమెంట్ పరిధిలోని రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ కమిటీ, నియోజకవర్గ, మండల, పట్టణ, డివిజన్ కమిటీలోని వివిధ హోదాలో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొనాలని విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా తెలిపారు.ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమన్నారు.టిడిపి హాయంలో ఇఫ్తార్ విందులు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించే వాళ్ళమని నేడు వైసిపి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే విందులు తూతు మంత్రంగా నిర్వహిస్తున్నాయన్నారు. రంజాన్ సందర్భంగా మజీద్ ల అభివృద్ధికి, శుభ్రతకు, ఖబరస్తాన్ లకు ప్రత్యేక నిధులు విడుదల చేసి, రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందన్నారు.

ఏపీ. హైకోర్టులో జస్టిస్ గంగారావుకు పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు

ఏపీ హైకోర్టులో జస్టిస్ గంగారావుకు పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు

అమరావతి,4 ఏప్రిల్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యం.గంగారావుకు మంగళవారం నేలపాడులో గల రాష్ట్ర హైకోర్టులోని ప్రధమ కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయవాద పట్టా పొందిన జస్టిస్ గంగారావు 1988లో న్యాయవాదిగా నమోదు అయిన పిదప జస్టిస్ బిఎస్ఏ స్వామి వద్ద జూనియర్ న్యాయవాదిగా చేరి ప్రాక్టీసు ప్రారంభించారన్నారు.ప్రభుత్వ న్యాయవాదిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గాను సేవలందించిన తదుపరి 2017 సెప్టెంబరు 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారని తెలిపారు.న్యాయమూర్తిగా జస్టిస్ గంగారావు 8వేల 100 కేసుల్లో తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు.న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పుల్లో కొన్ని ప్రత్యేక ల్యాండ్ మార్క్ తీర్పులు కూడా ఉన్నాయని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు.అంతేగాక జస్టిస్ గంగారావు అనేక కమిటీలకు సభ్యునిగా సేవలందించారని అన్నారు.నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మంచి న్యాయమూర్తిని కోల్పోతోందని ఆయన సేవలు హైకోర్టుకు అవసరమని పేర్కొంటూ జస్టిస్ గంగారావు శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో గడవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆకాంక్షించారు.

న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్నజస్టిస్ గంగారావు మాట్లాడుతూ 1971-76 మధ్య అనంతపురం జిల్లా పత్తికొండలో తన పాఠశాల విద్య సాగిందని,1987లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ పూర్తి చేసి 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి బిఎస్ఏ స్వామి వద్ద తన న్యాయవాద వృత్తిని ప్రారంభించినట్టు గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ జిపిగా,జిపిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా తదుపరి న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం కలిగిందన్నారు.తన కేరీర్ లో ఎంతో మంది సీనియర్ న్యాయమూర్తులు,జూనియర్ న్యాయమూర్తులు,న్యాయవాదులు తదితరులు అందరూ తనకు ఎంతో సహాయ సహకారాలను అందించినందుకు వారందరికీ పేరుపేరున జస్టిస్ గంగారావు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కాని వ్యవస్థ అనేది శాశ్వతమని కావున న్యాయవాద వృత్తిని చేపట్టే ప్రతి న్యాయవాది వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తగిన సత్వర న్యాయసేవలను అందించేందుకు ప్రయత్నం చేయాలని జస్టిస్ గంగారావు సూచించారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ గంగారావు న్యాయవాదిగా,ప్రభుత్వ న్యాయవాదిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా ప్రస్తుతం న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో పనిచేసి ప్రజల న్యాయవాదిగా నిలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి మట్లాడుతూ 1961 ఏప్రిల్ 8న అనంతపురం జిల్లాలో జన్మించిన జస్టిస్ గంగారావు 1987లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది వివిధ హోదాల్లో పనిచేసిన తదుపరి 2017 సెప్టెంబరు 21 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఎల్లపుడూ చిరునవ్వుతో చురుకుగా ఉండే జస్టిస్ గంగారావు తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మకమైన తీర్పులను ఇచ్చారని గుర్తు చేశారు.ఎపి హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మాట్లాడుతూ జస్టిస్ గంగారావు సామాన్యుల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు.డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరనాధ్ మాట్లాడుతూ జస్టిస్ గంగారావు శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి,రిజిష్ట్రార్లు,రిజిష్ట్రార్ జనరల్,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోయేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(కమీషనర్ సమాచార పౌరసంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వారిచే జారీ)

నల్గొండ జిల్లా.నకిరేకల్ :చిరు వ్యాపారులకు అండగా బి జి ఆర్ ఫౌండేషన్.

చిరు వ్యాపారులకు అండగా బిజిఆర్ ఫౌండేషన్

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బి జి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గొడుగులు పంపిణీ చేశారు. ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు దంపతులు సుమారు 100 గొడుగులు పంపిణీ చేశారు.

రోజంతా ఎండనక, వాననక చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న మహిళలు, వృద్ధులకు నీడనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని వారు పేర్కొన్నారు. బిజీర్ ఫౌండేషన్ తరఫున రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, బీజిఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తి రూ.లక్ష కోట్లకు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ కుటుంబం ఆస్తి రూ.లక్ష కోట్లు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తి రూ.లక్ష కోట్లకు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై ఒక్క కేసు అయినా పెట్టారా?

అని ప్రశ్నించారు. భాజపా, భారాస మధ్య సంబంధాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. సంబంధం లేకపోతే కేసీఆర్‌ ఆస్తులపై ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు చేశానని.. ఒక్క దానిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు.

''రాష్ట్రంలో 80శాతం మంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ప్రజలు తమ వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు.. దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. పదేళ్లలో .. రాష్ట్రంలో భారాస, కేంద్రంలో భాజపా చేసిందేమిటో ప్రజలకు చెప్పగలరా? నీటిపారుదల విషయంలో కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ పార్టీ మొదలు పెట్టింది. ఇప్పుడు దాన్ని కేసీఆర్‌ మార్కెటింగ్‌ చేసుకున్నారు. పాదయాత్రలో అనేక విషయాలు స్థానిక ప్రజలకు సవివరంగా చెప్పగలిగాం. ప్రజలు అడిగినవి పక్కనపెడితే.. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? టీచర్‌ నియామకాలు చేపట్టారా? తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛనే కేసీఆర్‌ గుంజుకున్నారు.

Avalanche: సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురి మృతి!

Avalanche: సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురి మృతి!

గాంగ్‌టక్‌: సిక్కిం(Sikkim)లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది. ఇక్కడి నాథూలా (Nathu La) పర్వత లోయ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.

మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్‌(Gangtok)కు తరలించారు. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో దాదాపు 150 మందికిపైగా పర్యాటకులు అక్కడున్నట్లు సమాచారం.

గాంగ్‌టక్‌ను, చైనా సరిహద్దు సమీపంలోని నాథులా పాస్‌(Nathu La Pass)ను కలిపే జవహార్‌లాల్‌ నెహ్రూ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు రహదారుల సంస్థ(BRO), సిక్కిం పోలీసులు, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. ఇప్పటివరకు 22 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాల్లో చిక్కుకుపోయిన 350 మంది పర్యాటకులనూ కాపాడినట్లు తెలిపారు.