హైదరాబాదులో పలుచోట్ల ఈడి సోదాలు
ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు
దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్న ఈ డి అధికారులు
తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న చూదాలు
జూబ్లీహిల్స్ మాదాపూర్ లో ఫార్మా కంపెనీ డైరెక్టర్ ల ఇళ్ళల్లో సోదాలు
బీజేపీ డ్రామాలు ఇకనైనా ఆపాలి: బిగాల గణేష్ గుప్త
హైదరాబాద్: కేజీవాల్ చెప్పినట్లు BRSకు రూ.75 కోట్లు ఇచ్చానని సుఖేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు BRS నేత గణేష్ గుప్త.
బీజేపీ నేతలు ఇకనైనా డ్రామాలు ఆపాలని.. BRSకు డబ్బు ఇచ్చానని రేపు సిసోడియాతో కూడా చెప్పించినా ఆశ్చర్యం లేదన్నారు.
ఈడీతో ప్రతిపక్షాలపై బీజేపీ దాడులు చేయిస్తోందని.. సుఖేష్ కు లేఖ రాసిచ్చింది బీజేపీనేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నియంతృత్వంగా మారుస్తోందని విమర్శించారు.
Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..
హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెరుగుతాయి. దీనికి సంబంధించి జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న హైదరాబాద్-విజయవాడ (65), హైదరాబాద్-వరంగల్ (163) జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి.
విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు(నందిగామ), వరంగల్ హైవేపై బీబీనగర్ మండలం గూడురు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. రోజుకు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా సుమారు 30 వేలకు పైగా, గూడురు టోల్‌ప్లాజా వద్ద 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుంటాయి. తాజాగా టోల్‌ప్లాజా మీదుగా ప్రయాణించే వాహనాలకు వాటి స్థాయిని బట్టి ఒకవైపు, ఇరువైపులా కలిపి రూ.5 నుంచి రూ.40 వరకు, స్థానికుల నెలవారీ పాస్‌లపై రూ.275 నుంచి రూ.330 వరకు టోల్ రుసుములు పెరిగాయి. ఈ ధరలు 2024 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
హైదరాబాద్: రాష్ట్రంలో 4 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.శుక్రవారంతోపాటు వచ్చే నెల మూడో తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఎండలు మండనున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదేసమయంలో రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, కుమురంభీం-ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ అప్రమత్తత ప్రకటించింది.
ఆరెంజ్, యెల్లో రంగు హెచ్చరికలు
శుక్రవారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ రంగు సూచికను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో రంగు సూచికను జారీ చేసింది. ఈ జిల్లాల్లో వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉండాలని పేర్కొంది.
ఏ రంగుకు... ఏ హెచ్చరిక?
ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీలను దాటితే వాతావరణ శాఖ మూడు రకాల సూచనలను జారీ చేస్తుంది. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండేందుకు ఈ సూచనలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుంది. నగరాలు, పట్టణాల్లో ఉండే డిజిటల్ బోర్డులపైనా ప్రదర్శిస్తుంది. 36-40 డిగ్రీల మధ్య ఉంటే యెల్లో (పరిశీలన), 41-45 డిగ్రీల మధ్య ఉంటే ఆరెంజ్ (అప్రమత్తం), 45 డిగ్రీలపైన ఉంటే రెడ్ (హెచ్చరిక) సంకేతాలను జారీ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరెంజ్ రంగు హెచ్చరికల స్థాయి ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. అందుకే...ఆరుబయట పని చేసే వారు, ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండనున్న దృష్ట్యా ఆ సమయంలో నీడలో ఉంటే మేలంది.
'జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష'కు అత్యంత ప్రాధాన్యం: సీఎం జగన్
తాడేపల్లి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు..
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేపట్టడం లేదని.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం అని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామన్నారు.
ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని సీఎం పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు..
జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని అధికారులు వివరించారు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్న సీఎం.. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలని సూచించారు. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందని సీఎం అన్నారు.
KotamReddy: ఆయన చెబితే రాజధాని కదిలే అవకాశం లేదు: కోటంరెడ్డి..
తుళ్లూరు: అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైకాపా ప్రభుత్వం కదిలించలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
రాజధాని అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయన్నారు.
''రాజధాని అమరావతి 29 గ్రామాలది కాదు.. ప్రపంచంలోని కోట్లాది తెలుగువారిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడెందుకు కాదో జగన్ చెప్పాలి. జగన్ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. ప్రధాని మోదీ చెబితే రాజధాని ఇక్కడి నుంచి కదిలే అవకాశం లేదు. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారు'' అని కోటంరెడ్డి అన్నారు.
నేటి నుంచి ఐపీఎల్- సీజన్ 16 ప్రారంభం..
ముంబై: క్రికెట్ అభిమానులను వేసవి వినోదంలో ముంచెత్తే ఐపీఎల్-2023 సీజన్ నేడు మొదలవుతోంది. పొట్టి క్రికెట్ మెగా పండగ ఆరంభం కానుంది.
తమ అభిమాన జట్లలో టైటిల్ ఫేవరెట్ ఎవరనే దగ్గర్నుంచి, ఏ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తుంది? ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? టాప్ వికెట్ టేకర్ ఎవరవుతారు? క్యాచ్‌లు.. సిక్సర్లు.. కళ్లు చెదిరే క్యాచ్‌లు ఇలా.. బంతిబంతికి ఉత్కం ఠను రేకెత్తించే ఐపీఎల్ సంబరం గురించి అభిమానుల్లో చర్చ జోరం దుకుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ మునుపటి కంటే కాస్తంత విభిన్నంగా జరగనుంది. క్రికెట్ ద్వారా మరింత మజాను అందించేలా సిద్ధమైంది.
థ్రిల్లింగ్ మ్యాచ్‌లు వీక్షించేందుకు అభిమానులు ఆతృతగాఉన్నారు. ఆయా ఫ్రాంచైజీలు కూడా కొత్త సీజ న్‌పై కొత్త ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఐపీ ఎల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొత్తగా అమ లు చేయబోతున్న వినూత్న నిబంధనలు సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నా యి. టాస్ తర్వాత కూడా జట్లను ప్రకటించే వెసులుబాటుతోపాటు, వైడ్, నో బాల్స్‌పైనా రివ్యూ కోరే అవకాశం, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఈసీజన్‌కు కొత్త
World Bank Chief : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖరారైంది. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించకపోవడంతో
బుధవారం నామినేషన్లు ముగిశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ కొనసాగుతున్నారు.
అయితే, ఆయన పదవీకాలం ఒక సంవత్సరం ఉంది. ముందస్తుగా మాల్సాస్ పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాక్ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. సాధారణంగా అమెరికా ప్రతిపాదించిన వ్యక్తికే ప్రపంచ బ్యాంక్ నాయకత్వ బాధ్యతలు దక్కుతూ వస్తున్నాయి.
Covid cases: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 3 వేలు దాటిన కేసులు
భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.
తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది..
దాదాపు ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.యాక్టివ్ కేసులు 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా నమోదైంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది..
Apr 01 2023, 11:30