KotamReddy: ఆయన చెబితే రాజధాని కదిలే అవకాశం లేదు: కోటంరెడ్డి..
తుళ్లూరు: అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైకాపా ప్రభుత్వం కదిలించలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
రాజధాని అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయన్నారు.
''రాజధాని అమరావతి 29 గ్రామాలది కాదు.. ప్రపంచంలోని కోట్లాది తెలుగువారిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడెందుకు కాదో జగన్ చెప్పాలి. జగన్ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. ప్రధాని మోదీ చెబితే రాజధాని ఇక్కడి నుంచి కదిలే అవకాశం లేదు. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారు'' అని కోటంరెడ్డి అన్నారు.











Mar 31 2023, 20:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.7k