నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ.
నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు జిల్లా మీదుగా పరుగులు తీయనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనిని మొదట కాజీపేట మార్గంలో నడపాలని రూట్ మ్యాప్ రూపొందించినా.. ఎక్కువ దూర భారం అవుతుందని భావించి ప్రయాణ సమయం తగ్గించటానికి బీబీనగర్ నుంచి నడికుడ మార్గం సరైందని గుర్తించారు. ఈ మార్గంలో 130 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ఈ వందే భారత్ రైలుని మోడీ చేతుల మీదుగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నిత్యం వెళ్లే నారాయణాద్రి 12:30 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్ రైలు 9 గంటల కన్నా తక్కువ సమయంలో వెళ్లనుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, వందే భారత్ రైలును ఆరు స్టేషన్లలోనే ఆపనున్నారు. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్.. నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో నిలపనున్నారు.
Mar 31 2023, 17:31