madagoni surendar

Mar 31 2023, 15:47

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ.

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

నల్లగొండ మీదుగా వందేభారత్ రైలు పరుగులు.. ప్రారంభించనున్న పీఎం మోడీ

ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శుభవార్త అందింది. అనుకోని అతిథి వచ్చినట్టు జిల్లా మీదుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు జిల్లా మీదుగా పరుగులు తీయనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలును ఏప్రిల్ 8న ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనిని మొదట కాజీపేట మార్గంలో నడపాలని రూట్ మ్యాప్ రూపొందించినా.. ఎక్కువ దూర భారం అవుతుందని భావించి ప్రయాణ సమయం తగ్గించటానికి బీబీనగర్ నుంచి నడికుడ మార్గం సరైందని గుర్తించారు. ఈ మార్గంలో 130 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. ఈ వందే భారత్ రైలుని మోడీ చేతుల మీదుగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నిత్యం వెళ్లే నారాయణాద్రి 12:30 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్ రైలు 9 గంటల కన్నా తక్కువ సమయంలో వెళ్లనుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, వందే భారత్ రైలును ఆరు స్టేషన్లలోనే ఆపనున్నారు. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్.. నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో నిలపనున్నారు.

madagoni surendar

Mar 31 2023, 12:25

మధ్యప్రదేశ్ ::ఇండోర్‌ ట్రాజెడీలో పెరుగుతోన్న మృతుల సంఖ్య..34 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం

ఇండోర్‌ ట్రాజెడీలో పెరుగుతోన్న మృతుల సంఖ్య.. 34 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం

పండగపూట ఊహించని విషాదం.. శ్రీరామనవమి వేడుకల్లో ఘోరం ప్రమాదం .. ఇండోర్‌లో కుప్పకూలిన మెట్ల బావి.. అవును, ఇది పెనువిషాదం, అంతులేని దుఖం ఇది. పండగ సంబరం అనేక కుటుంబాల్లో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అధికారుల నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను తీసేసింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 34మంది  ప్రాణాలు కోల్పోయారు.  పలువురు  ఆచూకీ గల్లంతైంది.

సీతారాముల హోమం చేస్తుండగా మెట్ల భావి కుప్పకూలింది. ఊహించనివిధంగా జరిగిన ఈ ప్రమాదంలో 50 అడుగుల లోతున్న బావిలో పడిపోయారు భక్తులు. దీంతో రామనవమి వేడుకల్లో బాధాకరమైన అరుపులతో నిండిపోయాయి.

కొందరు తాడుతో, మరికొందరు పొడవాటి వెదురు నిచ్చెనతో రక్షించేందుకు పరుగులు తీశారు. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీశారు.

34మంది మృతి, పలువురికి గాయాలు:

బావిలో చిక్కుకున్నవారిలో కొందర్నీ సేఫ్‌గా కాపాడారు రెస్క్యూ సిబ్బంది. మృతుల్లో 11మంది మహిళలు ఉండటం అక్కడున్న అందర్నీ కలిచివేసింది. బేలేశ్వర్‌ మహదేవ్‌ ఆలయంలో ఈ దుర్ఘటన జరిగింది. పురాతన మెట్ల బావిపై 10 ఏళ్లక్రితం స్లాబ్‌వేసి ఓ గదిని నిర్మించారు. హోమం జరుగుతుండగా ఎక్కుమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును ఆపలేక కుంగిపోయింది. మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతైనట్లు కలెక్టర్ డాక్టర్ ఇళయరాజా టి తెలిపారు.

ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. గాయపడినవారికి 50వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌. ఇక, ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. శ్రీరామనవమిరోజు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో తనను కలిచివేసిందన్నారు పీఎం మోడీ..

madagoni surendar

Mar 31 2023, 12:15

తెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు.

ఇంద్రభవనంలా తెలంగాణ నూతన సచివాలయం

మరో నెలరోజుల్లో అందుబాటులోకి

హైదరాబాద్ : రాష్ట్ర నూతన పాలనా సౌధం ప్రారంభానికి సిద్ధమవుతోంది. మరో నెల రోజుల్లో కొత్త సచివాలయం అందుబాటులోకి రానుంది. పనులన్నీ దాదాపుగా పూర్తి కాగా ఫర్నీచర్ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. పాత ఫర్నీచర్ ఏ మాత్రం ఉపయోగించకుండా పూర్తిగా కొత్త వాటినే అమరుస్తున్నారు. ప్రారంభోత్సవమైన ఒకటి, రెండు రోజుల్లోనే కొత్త సచివాలయం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభానికి వారం రోజుల ముందు శాఖల వారీగా కేటాయింపులు చేయనున్నారు.

తెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏప్రిల్ 30వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్తం కూడా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. వచ్చే నెల 30వ తేదీ ఉదయం ఆరు గంటలా ఎనిమిది నిమిషాలకు మేష లగ్నాన కొత్త సచివాలయంలో వైదికంగా పూజలు ప్రారంభమవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 20 నిమిషాల నుంచి ఒంటి గంటా 33 నిమిషాల మధ్య సింహలగ్న శుభ మూహుర్తాన ముఖ్యమంత్రి కేసీఆర్ తన సీట్లో ఆసీనులవుతారు. ఆ తర్వాత మంత్రులందరూ వారి సీట్లలో కూర్చొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల నుంచి మూడు గంటలా 20 నిమిషాల వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.

కొత్త సచివాలయంలో కొత్త ఫర్నిచర్​

ప్రారంభోత్సవ ముహూర్తం దగ్గర పడుతున్న వేళ సచివాలయానికి సంబంధించి మిగిలిన పనులను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తుకు సంబంధించిన అన్ని పనులు చాలా రోజుల క్రితమే పూర్తయ్యాయి. మిగిలిన అంతస్తుల్లో ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సచివాలయం కోసం ఫర్నీచర్ అంతా కొత్తగానే కొనుగోలు చేశారు. ఎక్కడ కూడా పాత ఫర్నీచర్ ఉపయోగించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఛాంబర్లు, పేషీలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫర్నీచర్, సామాగ్రి పూర్తిగా ఏకరూపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇష్టారీతిన కాకుండా అందరికీ ఒకే తరహా ఫర్నీచర్ అమరుస్తున్నారు.

సచివాలయంలో ఉద్యోగుల కేటాయింపు ఏప్రల్​ 25కి పూర్తవుతుంది

ఏప్రిల్ 20వ తేదీ వరకు ఏ పనీ మిగలకుండా అన్ని రకాల పనులు పూర్తవుతాయని అంటున్నారు. ఆ తర్వాత ఆయా శాఖలకు కేటాయింపులు చేయనున్నారు. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ, కేబినెట్ సమావేశ మందిరం, ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉండనున్నాయి. మిగిలిన అన్ని శాఖలకు ఇతర అంతస్తులను కేటాయించనున్నారు. ఒక్కో మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి, మంత్రి పేషీ, సంబంధిత శాఖ కార్యదర్శి, ఉద్యోగులు విభాగాలు ఒకే చోట ఉండేలా కేటాయింపులు జరగనున్నాయి. పాత సచివాలయంలో కొన్ని శాఖలు మినహాయిస్తే మెజార్టీ శాఖలకు సంబంధించి మంత్రి పేషీ ఒక అంతస్తులో కార్యదర్శి, ఉద్యోగులు మరో అంతస్తుల్లో ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తు, ఇతరత్రా కారణాల రీత్యా ఎలాంటి మార్పులకు అస్కారం లేకుండా చూస్తున్నారు. కేటాయింపుల ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు.

ప్రారంభోత్సవం అనంతరం కార్యక్రమాలు అక్కడి నుంచే

ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం అనంతరం ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు కొత్త సచివాలయం నుంచి జరిగేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్ నుంచి కేవలం కంప్యూటర్లు, సంబంధిత సామాగ్రి, దస్త్రాలను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని ప్రారంభోత్సవం తర్వాత వీలైనంత త్వరగా వాటిని కొత్త సచివాలయానికి తరలించి పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు.

madagoni surendar

Mar 31 2023, 09:44

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజెసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజెసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news.నల్గొండ జిల్లా ::

కట్టంగూర్ టౌన్ శ్రీరామ్ నగర్ కాలనికి చెందిన అయితగోని సైదులు తల్లి అయితగోని లక్షవమ్మ అనారోగ్యం తో మృతి చెందాగా వారి భౌతికకాయాని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబం సభ్యులను పరామర్శించి.10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజెసిన.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,ఆయన వెంట జెడ్పీటీసీ తరాల బలరామ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, ఉప సర్పంచ్ అంతటీ శీనువాస్, వార్డు మెంబర్ రెడ్డి పల్లి మనోహర్,పోటిచెటి సైదులు, అంతటి నాగేష్ నాగమణి,PACS డైరెక్టర్ నిమ్మల సత్యనారాయణ,మండల నాయకులు బోల్లేద్దు యాదయ్య, శ్రీ పాద రామకృష్ణ, నోముల వెంకటేశ్వర్లు, రాచకొండ యాదయ్య,కానుగు లింగయ్య, మేకల నాగరాజు,జిల్లా యాదయ్య,బోల్లేద్దు నరసింహ, తదితరులు పాల్గొన్నారు.....

madagoni surendar

Mar 31 2023, 09:35

హైదరాబాద్,: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు.

రాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై

హైదరాబాద్,: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్రి మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి శుక్రవారం ఉదయం కొత్తగూడెం చేరుకుంటారు. భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్ హౌజ్​లో బస చేస్తారు. రాములోరి పట్టాభిషేకంలో పాల్గొన్న తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. శుక్రవారం రాత్రి కొత్తగూడెం నుంచి బయల్దేరి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు.

madagoni surendar

Mar 30 2023, 19:34

ఏపీ :తెనాలి : పెద్దమొత్తంలో పట్టుబడ్డ గంజాయి

ఏపీ :తెనాలి : పెద్దమొత్తంలో పట్టుబడ్డ గంజాయి

తెనాలి టూ టౌన్ పోలీసులు పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్నారు. ఐతానగర్ ప్యాడిసన్ పేట కమ్యునిటీ హాలు వద్ద ఐలా శ్రీనివాస్, మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు..

కమ్యునిటీ హాలు వద్ద కూర్చుని తమ వెంట తెచ్చిన గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు. నర్సీపట్నం నుండి గంజాయి తీసుకువచ్చి స్ధానికంగా విక్రయిస్తున్న ముఠాను తెనాలి టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను డిఎస్పీ కె స్రవంతి రాయ్ తెలియజేశారు..

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం…ఐతానగర్‌కు చెందిన ఐలా శ్రీనివాస్‌ గతంలో గంజాయి, దొంగతనం, హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. నర్సీపట్నం నుండి విష్ణు అనే వ్యక్తి ద్వారా గంజాయి దిగుమతి చేసుకుని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఐతానగర్‌లోని ప్యాడిసన్ పేటలో గల కమ్యూనిటీ హాలు వద్ద మరో ఐదుగురితో కలిసి గంజాయిని చిన్నపొట్లాలుగా మార్చి విక్రయాలు చేస్తుండగా టూ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ బి శివరామయ్య సిబ్బందితో కలిసి ఘటనాస్దలానికి వెళ్లి ప్రధాన నిందితుడు ఐలా శ్రీనివాస్‌తో పాటు నందులపేటకు చెందిన దేవరకొండ మను శివ శంకర్‌, ఐతానగర్‌కు చెందిన తాడికొండ చంద్రశేఖర్‌, తాతపూడి సునీల్‌, పల్లె సంజయ్‌, వల్లభాపురపు సునీల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 15 కేజీల జంగాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు.

madagoni surendar

Mar 30 2023, 19:27

ఏపీ ::ఎవరోస్తారో రండి.. వైసీపీ నేతలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్.. నడ్డిరోడ్డుపై కూర్చుని..

ఎవరోస్తారో రండి.. వైసీపీ నేతలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్.. నడ్డిరోడ్డుపై కూర్చుని..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ పలువురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..

వారిలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒకరు. వైసీపీ నుంచి మేకపాటిని సస్పెండ్ చేసిన తరువాత.. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కాయి. ఆయనను నియోజకవర్గం నుంచి తరిమికొడతామని వార్నింగ్ ఇచ్చాయి.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. నేడు రోడ్డు మీదకు వచ్చారు. బస్టాండ్‌ సెంటర్‌లో కుర్చీ వేసుకొని కూర్చున్నారు. తాను వస్తే తరిమేస్తానని సవాల్ చేసిన వాళ్లు రావాలంటూ సవాల్ విసిరారు.

బస్టాండ్‌ సెంటర్‌లో కలియతిరిగారు. వైసీపీ నాయకత్వం తనపై అభాండాలు వేసి సస్పెండ్‌ చేసిందని ఆరోపించారు. తాను. పార్టీలో లేనని చెప్పి కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను ఇక్కడి నుంచి నుంచి తరిమికొట్టాలని సవాల్ విసిరారు.

madagoni surendar

Mar 30 2023, 19:05

మధ్యప్రదేశ్ ::శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి..11 మంది మృతి.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి..11 మంది మృతి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్లబావి కూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. 11 మంది మృతదేహాలు బయటకు తీశామని..మరో 19 మందిని సిబ్బంది సురక్షితంగా రక్షించామని ఇండోర్ కలెక్టర్ డాక్టర్ టి. ఇళయరాజా వెల్లడించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్రప్రదేశ్ సీఎం చౌహాన్.. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 కు పైగా మంది మెట్ల బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికులు సైతం బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తు్న్నారు. బావిలో పడిన వారిని రెస్క్యూ టీంతో పాటు నిచ్చెన సాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

madagoni surendar

Mar 30 2023, 18:51

న్యూడిల్లీ :కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తో. ఏపీ.ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ,

న్యూఢిల్లీ

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం

ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరి వెళ్లారు

ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు

1. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని కోరిన సీఎం. 

2. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని వివరించిన సీఎం. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం

3. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరిన సీఎం.

4. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కోరిన సీఎం. 

5. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరిన సీఎం. 

6. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదలచేయాలన్న సీఎం.  

7. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలన్న సీఎం.

8. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా చర్చించిన సీఎం. 

9. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన సీఎం.

madagoni surendar

Mar 30 2023, 16:35

బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు.

బలగం’ మొగిలయ్య అనారోగ్యంపై స్పందించిన హరీష్ రావు


‘బలగం’ సినిమాలో నటించి, అందర్నీ కంటతడి పెట్టించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వీ6 తెలుగు వార్తా ఛానెల్ లో ప్రసారమైన కథనంపై స్పందించిన మంత్రి… పుట్టెడు కష్టాలతో, అనారోగ్య సమస్యలతో సతమవుతున్న మొగిలయ్యకు కావాల్సిన మందులు అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డయాలసిస్ సేవలు అందేలా ఏర్పాటు చేయాలని సూచించారు.  

కరోనా టైంలో మొగిలయ్య రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. దీంతో ఆయన రోజు తప్పించి రోజు డయాలసిస్ కోసం దవాఖాన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల మొగిలయ్యను మరో హెల్త్​ ప్రాబ్లమ్​ చుట్టుముట్టింది. బీపీ, షుగర్‍ పెరగడంతో.. ఆయన రెండు కండ్లపై ఎఫెక్ట్ పడింది. ఎప్పట్నుంచో బీపీ, షుగర్‍ తో బాధపడుతున్న ఆయనకు .. ఇప్పుడు ఆ ప్రభావం మిగతా అవయవాలపైనా పడింది. ‘బలగం’ సినిమా చేస్తున్న సమయంలోనూ ఓ సారి ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. హాస్పిటల్​ కు తీసుకెళ్లి చెక్​ చేయిస్తే.. కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. టెస్టులు చేయిస్తే.. రెండు కిడ్నీలు ఫెయిలైనట్టు రిపోర్ట్​ వచ్చింది. ఇంతకుముందు కరోనా సోకడం వల్లే మొగిలయ్య కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు అన్నారు. ఇక డయాలసిస్ చేయించడం కంపల్సరీ అని చెప్పారు. దీంతో అప్పటినుంచి వారానికి మూడు రోజులు హాస్పిటల్​ కు వెళ్లి డయాలసిస్​ చేయించుకుంటున్నారు.

వరంగల్​ సిటీకి వచ్చిపోవడానికి తోడూ మందులకు ప్రతినెలా రూ. 20 వేల దాకా ఖర్చు అవుతున్నది. ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని మొగిలయ్య భార్య కొమురమ్మ ఏడుస్తూ చెప్పారు. నమ్ముకున్న కళ ద్వారా సంపాదించుకున్న రూ.8 లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేశామని, మరో రూ.6 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ మధ్య కాలంలో డయాలసిస్‍ చేయడానికి కూడా మొగిలయ్య శరీరం సహకరించడం లేదని డాక్టర్లు అంటున్నారు. మెరుగైన ట్రీట్‍మెంట్‍ కోసం రూ.3 లక్షలు అవసరమని చెప్తున్నారు.


 కండ్లు మళ్లీ కనపడాలంటే మొగిలయ్యకు రెండుసార్లు ఆపరేషన్‍ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు కావాల్సిన దాదాపు రూ.2 లక్షలు కూడా ప్రస్తుతం మొగిలయ్య దగ్గర లేవు. బలగం డైరెక్టర్ వేణు కొంత సాయం చేసినా.. అన్ని రకాల ట్రీట్‍మెంట్‍, మందుల కోసం దాదాపు రూ.8 లక్షలు అవసరమవుతాయని కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మనసున్న మారాజులు తమను ఆదుకోవాలని ఈ దంపతులు కోరుతున్నారు.