AI వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయండి.. ఎలాన్ మస్క్‌ సహా 1000 మంది నిపుణుల బహిరంగ లేఖ

టెక్ వర్గాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంత ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తుందో.. అంతకు మించి ఆందోళన కలిగిస్తోంది. ఏఐ వల్ల భవిష్యత్​లో ఉద్యోగాలు పోవడంతో పాటు మానవాలికే ముప్పు కలగనుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ వంటి టెక్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోన్న విషయం.

అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ ఎలాన్ మస్క్ సహా వేయి మంది టెక్ నిపుణులు బహిరంగ లేఖ రాసి సంతకం చేశారు. ఇందులో యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ వంటి నిపుణులు కూడా ఉన్నారు. ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తరఫున విడుదల చేశారు.

మానవ మేధస్సుతో పోటీ పడే జీపీటీ-4 వంటి ఏఐ వ్యవస్థలు సమాజానికి, యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే ఏఐ వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.

పాకిస్థాన్ కు బిగ్ షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌

ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఎదుగుతున్న అఫ్గానిస్థాన్‌ జట్టు పాకిస్థాన్ కు బిగ్ షాకిచ్చింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య షార్జా వేదికగా మార్చి 25న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది.  

బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ లేకుండా బరిలోకి దిగిన పాక్‌.. అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. దీంతో 92 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్‌ జట్టు మరో 6 వికెట్లు, 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అఫ్గానిస్థాన్‌ను మహమ్మద్‌ నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) నిలకడగా ఆడి గెలిపించారు.

పాకిస్థాన్ పై అఫ్గానిస్థాన్‌ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మున్మందు ఇదే జోరును కొనసాగిస్తామని అఫ్గానిస్థాన్‌ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌ వెల్లడించాడు.

ఈ ఆలయంలో మహిళా వేషధారణలో పురుషులు పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా?

కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి రెండు రోజులలో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి రెండు రోజులలో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే, స్థానిక దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని దీని వెనుక ఉన్న నమ్మకం.

కొన్నేళ్లుగా బంధువులు, స్నేహితులతో వచ్చే మగవారి సంఖ్య పెరిగి 10000 దాటింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కొట్టంకులంగర చమయవిళక్కు అంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది పురుషులు మహిళ వేషధారణలో శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు. పురుషులు మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీగా పాల్గొన్నారు. వారు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళి నెల ‘మీనం’ 10 ,11వ తేదీల్లో ఘనంగా జరుపుకుంటారు. 

ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి.. ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు.

అది ఎలా మొదలైంది..

అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ప్రకారం, ఆవులను మేపుతూ అమ్మాయిల వేషధారణలో ఉన్న అబ్బాయిల బృందం ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది. పూలు, ‘కోటాన్’ (కొబ్బరితో చేసిన వంటకం) సమర్పించారు. ఒకరోజు దేవత ఒక బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత, పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైంది. రాయిని దేవతగా భావిస్తారు. ఏళ్ల తరబడి రాయి పరిమాణం పెరుగుతోందనే నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆచారం అత్యంత ప్రాచుర్యం పొందింది, ఈ పండుగ వివిధ మతాల ప్రజలను ఆకర్షిస్తుంది. వారిలో పెద్ద సంఖ్యలో కేరళ నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు.

మరో కథ కూడా ఉంది.

ఓ రోజు కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని.. బండ రాయితో పగలగొట్టే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా రాయిలోంచి రక్తం కారింది. దీంతో ఆ పిల్లలు భయపడి.. వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. అనంతరం వారు జ్యోతిషులను సంప్రదించారు. ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుందని వెంటనే అక్కడ ఆలయం నిర్మించాలని జ్యోతిషులు చెప్పారు. దీంతో స్థానికులు గుడి కట్టి.. ప్రతీఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన షెల్డన్ అనే యువకుడు మాట్లాడుతూ.. “నేను ఈ ఆచారం గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. నేను రావాలనుకున్నాను. చివరకు ఈ సంవత్సరం వచ్చాను.” స్త్రీ వేషధారణ తర్వాత, నేను కొంతకాలంగా అనుకున్నది సాధించినట్లు అనిపించిందని తెలిపాడు. ఆచారంలో పాల్గొనడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సంప్రదాయ చీరలు ధరించిన పురుషులు సాయంత్రం దీపాలు మోసుకుంటూ పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.

మగవాళ్ళు ఆడవాళ్ళు లేదా అమ్మాయిల వేషం వేసుకోవడానికి దీపాలను తీసుకువెళ్లాలి. అద్దెకు దొరుకుతుంది, కానీ వారు తమ సొంత దుస్తులను తీసుకురావాలి. ఎవరికైనా సహాయం కావాలంటే, బ్యూటీషియన్లు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఆదివారంతో పండుగ ముగియడంతో వేలాది మంది ప్రజలు ఆశలు, ఆనందంతో తిరిగి వెళ్తారు.

ప్రధాని కళ్లలో భయం చూశా.. అందుకే నాపై అనర్హత వేటు

అదానీపై నా తరువాతి ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ కళ్లలో భయాన్ని చూశాను. నేను ఏ ప్రశ్న అడిగిన ఆలోచించే అడుగుతానని అన్నారు. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తెలిస్తే జైళ్లలో వేయండి అని అన్నారు. దేశం నాకు గౌరవం, ప్రేమ ఇచ్చారని అన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోందని అన్నారు. నేను జైలు శిక్ష గురించి భయపడనని అన్నారు. ప్రజల్లోకి వెళ్లడమే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం అని అన్నారు. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధం.. వయనాడ్ ప్రజల మనసులో ఏం ఉందో లేఖ రాస్తానని అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఖతం అయిందని అన్నారు.

భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లానని, తాను ప్రజల్లోనే ఉంటానని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య స్వభావాన్ని రక్షించడం, దేశంలోని సంస్థలను రక్షించడం నా పని అని, దేశంలోని పేద ప్రజల గొంతును వినిపిస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. తనపై పూర్తిగా అనర్హత వేటు వేసినా పట్టించుకోనని, పార్లమెంట్ లో ఉన్నా లేకున్నా ప్రజలు, దేశం కోసం పనిచేస్తా అని అన్నారు. ‘మోదీ ఇంటి పేరు’ వివాదం గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ కోసం చర్చను తప్పుదారి పట్టించొద్దని సూచించారు. మీరెందుకు బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. మీరు బీజేపీకి కోసం పనిచేస్తే బీజేపీ సింబల్ ఛాతిపై పెట్టుకోవాలి అని విమర్శించారు.

కర్ణాటకలో ఎన్నికల వేడి.. 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్..

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే.. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలకు షాకివ్వాలని జేడీఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్.. తాజాగా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ 124 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా ఉన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా, శివకుమార్‌ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే.. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలకు షాకివ్వాలని జేడీఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్.. తాజాగా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ 124 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా ఉన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా, శివకుమార్‌ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

కాగా.. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. దీంతో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలను చేస్తోంది. దీంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు గాను బీజేపీ 104 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు కైవసం చేసుకున్నాయి. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు దక్కించుకోగా.. ఒక ఇండిపెండెంట్ సైతం గొలుపొందారు.

2019లో జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారును చేసింది.. ఆ తర్వాత కొన్ని రోజులకే కూటమిలో సంక్షోభం తలెత్తడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

అనర్హత వేటు ఎఫెక్ట్.. రాహుల్‌ అధికార బంగళా ఖాళీ చేయాల్సిందేనా!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్​సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది. వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్​సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది.

మరోవైపు అనర్హత వేటు వల్ల రాహుల్ గాంధీ దిల్లీలోని ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటితమైన రాహుల్‌ గాంధీకి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఉన్నత న్యాయస్థానం నుంచి ఊరట లభించకపోతే.. ఆయన దిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది. 2004లో లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి రాహుల్‌కు తుగ్లక్‌ లైనులోని 12వ నంబరు బంగళాను కేటాయించారు. రాహుల్‌కు ఊరట లభిస్తే తప్ప మార్చి 23 నుంచి నెలరోజుల్లోపు తన అధికార బంగళాను ఆయన ఖాళీచేయక తప్పదు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భద్రతా బందోబస్తును తగ్గించినందున ఆమె కూడా 2020 జూలైలో తన అధికార బంగళాను ఖాళీ చేశారు.

ఉక్రెయిన్‌-రష్యా పోరులో యుద్ధ ఖైదీలకు నరకం.. తీవ్ర ఆందోళనలో ఐరాస

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఏడాదికిపైగా భీకర యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యుద్ధంలో లక్షల మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది సైన్యం మట్టిలో కలిసిపోయారు. లక్షల భవనాలు.. పట్టణాలు నేలమట్టమయ్యాయి. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు. కుటుంబ పెద్దను కోల్పోయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న పోరులో యుద్ధఖైదీలు దారుణమైన వేధింపులకు గురవుతున్నారు. వారిని క్రూరంగా హింసించడంతో పాటు, పోరులో రక్షణ కవచాలుగా వాడుకోవడానికి సైతం ఇరు దేశాలు వెనుకాడటం లేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ మేరకు కీవ్‌లోని ఐరాస మానవహక్కుల మిషన్‌ జనవరి నుంచి ఆరు నెలల కాలానికి తయారు చేసిన నివేదికను విడుదల చేసింది.

400 యుద్ధఖైదీలతో తాము మాట్లాడామని, ఇందులో రష్యా విడిచిపెట్టిన ఉక్రెనియన్లు సగం మంది, ఉక్రెయిన్‌లో ఖైదీలుగా ఉన్న రష్యన్లు సగం మంది ఉన్నారని తెలిపింది. మాస్కో అధీనంలోని జైళ్లలో మగ్గుతున్న యుద్ధఖైదీలతో మాట్లాడేందుకు అనుమతి లభించలేదని పేర్కొంది. ‘‘25 మంది రష్యా ఖైదీలకు ఉక్రెయిన్‌ సాయుధ దళాలు మరణశిక్ష విధించాయి. ఇది మాకు ఆందోళన కలిగించింది’’ అని ఐరాస పర్యవేక్షణ మిషన్‌ అధిపతి మటిల్డా బాగ్నర్‌ తెలిపారు. అయితే ఈ దారుణానికి మూలకారణం మాత్రం ఉక్రెయిన్‌పై ఆక్రమణేనని బాగ్నర్‌ పేర్కొన్నారు.

పేదలకు ఉపాధి హామీ వేతనం పెంచిన కేంద్రం

ఉపాధి హామీ కూలీలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. ఉపాధి హామీ వేతనాలను కేంద్రం రూ.15 మేర పెంచింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో AP, TS రూ. 257 గా ఉన్న కూలీ రూ.272 కు చేరింది.

అత్యధికంగా హర్యానాలో రూ. 357, కేరళలో రూ. 333, గోవాలో రూ. 322, కర్ణాటకలో రూ. 316, లక్షద్వీప్ లో రూ. 304, పంజాబ్ లో రూ. 303, పుదుచ్చేరి, తమిళనాడులో రూ. 294 కూలీ దక్కనుంది. అన్ని రాష్ట్రాల్లో సమాన వేతనాలు అమలు చేయాలన్న స్థాయి సంఘం నివేదికను కేంద్రం పట్టించుకోలేదు.

ఉత్తరాఖండ్‌లో అమృత్‌పాల్‌.. అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు

ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అమృత్‌పాల్‌ దేశం విడిచిపోయి పారిపోయే అవకాశాలున్నందున పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. మార్చి 20న హరియాణాలో ఉన్న అమృత్‌పాల్‌.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌కు చేరుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నేపాల్‌ మీదుగా కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్‌ – నేపాల్‌ సరిహద్దుల వద్ద అతడి పోస్టర్లను అంటించారు.

మరోవైపు అమృత్‌పాల్‌ నేరచరిత్రను తవ్వుతున్న అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. డ్రగ్‌ డీలర్లతో సంబంధాలు, డీ అడిక్షన్‌ కేంద్రాల పేరిట ప్రైవేటు సైన్యాలు, హంతకులతో సంబంధాలు.. ఇలా అతడి చరిత్ర భయానకంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

‘శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ’ తాను అనుకొన్నట్లు సిక్కు చరిత్రను అన్వయించాలని అమృత్‌పాల్‌ భావించాడు. మత ప్రచారం పేరిట హింసాత్మక భావజాలాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. ‘ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌’ (ఏకేఎఫ్‌) పేరిట ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేశాడు. మాదకద్రవ్యాల డీఅడిక్షన్‌ పేరుతో తన పూర్వీకుల గ్రామంలో ఓ కేంద్రం ఏర్పాటు చేశాడు. అమృత్‌పాల్‌ గన్‌మన్‌ తేజిందర్‌సింగ్‌ గిల్‌ ఫోను నుంచి ఖన్నా పట్టణ పోలీసులు కీలక వీడియోలను స్వాధీనం చేసుకొన్నారు.

యజమానిని చంపిన వాళ్లను పట్టించిన చిలుక.. తొమ్మిదేళ్ల తర్వాత ఇద్దరికి జీవిత ఖైదు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేశారు. ఈ కేసులో మహిళ పెంపుడు కుక్క కూడా చనిపోయింది. యజమాని తన కొడుకుతో కలిసి పెళ్లికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి తన భార్య, కుక్క మృత్యువాత పడడం చూసి షాక్ అయ్యాడు. ఈ కేసులో తొమ్మిదేళ్ల తర్వాత ఢిల్లీ సెషన్స్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. మొదట్లో ఈ కేసు నిలబడేందుకు సరైన ఆధారాల్లేక తొమ్మిదేళ్లుగా సాగుతూ వచ్చింది. చివరకు కేసు ఎలా నిలబడింది అనేది ఆసక్తికరం.

ఫిబ్రవరి 20, 2014న ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ తన కుమారుడితో కలిసి వివాహ నిమిత్తం ఫిరోజాబాద్‌కు వెళ్లాడు. అర్థరాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య నీలం మృతదేహం కనిపించింది. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సమీపంలో వారి పెంపుడు కుక్క కూడా చనిపోయి పడి ఉంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

పోస్టుమార్టంలో మహిళ శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. కుక్కను 9 సార్లు పొడిచారు. పోలీసులు కేసును ఛేదించేందుకు ప్రయత్నించినా ఎలాంటి క్లూ లభించలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా బోనులో ఉన్న చిలుక ఏదో చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ చిలుక గద్గద స్వరాన్ని పోలీసులు అనుసరించారు. చిలుక సరిగ్గా ఏమి మాట్లాడుతుందోనని పోలీసులు అనుమానించారు. వాళ్లు సావధానంగా వింటున్నప్పుడు అతడు పోలీసులకు.. ‘ఆషు ఆయ థా’.. ‘ఆషు ఆయ థా’ అని చెబుతున్నాడు. ఈ ఆశు ఎవరు అని ఆరా తీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది.

ఆశును పోలీసులు తీవ్రంగా గాలించినా ఫలితం లేదు. ఈ కేసులో పద్నాలుగో సాక్షిని పోలీసులు చూపించడంతో అప్పుడే ఓ కొలిక్కి వచ్చింది. చిలుక చెప్పిన ఆశు.. ఆశు.. అన్నది.. అశుతోష్ అని అతడు యజమాని నీలమ్ మేనల్లుడని తేలింది. ఆభరణాల కోసం అశుతోష్‌, రోనీలు.. నీలమ్‌ వద్ద ముడుపులు తీసుకున్నట్లు తేలింది.

చిలుక ఏం చెబుతుందో యజమాని విజయ్ శర్మ పోలీసులకు సరిగ్గా వివరించాడు. పోలీసులు కూడా ఈ చిలుకతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత విజయ్ శర్మ కూడా పోలీసులకు చిలుక భాష వివరించాడు. అనంతరం అశుతోష్, రోనీలను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిద్దరిపై కోర్టులో చార్జిషీటు దాఖలైంది. పోలీసులు చిలుక అరుపులను సాక్ష్యంగా ఛార్జిషీటులో పొందుపరిచారు. అయితే ఈ వాంగ్మూలాన్ని కోర్టు అంగీకరించలేదు. కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత తొమ్మిదేళ్ల పాటు కేసు కొనసాగింది, ఆ తర్వాత కేసు తీర్పును గురువారం చదివారు.

ప్రభుత్వ పక్షం కుక్క చేసిన గాయాల ప్రస్తావన

ఎవరైనా తన యజమానిపై దాడి చేస్తే.. కుక్క సాధారణంగా ఊరుకోదు.. తీవ్రంగా పోరాడతాడు. ఈ ఘటనలో అశుతోష్ గోస్వామి కుక్కకాటుతో తీవ్రంగా గాయపడ్డాడు. అందుకే నీలం పెంపుడు కుక్క స్వామి భక్తురాలి అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నిందితులను తీవ్రంగా ప్రతిఘటించాడు. కుక్కను కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో నిందితుడి మేనల్లుడు అశుతోష్ గోస్వామి శరీరంపై కుక్కకాటుకు తీవ్ర గాయాలయ్యాయి.

అజయ్ శర్మ కరోనా కాలంలో మరణించాడు. అయినప్పటికీ, ఆమె కుమార్తెలు తమ తల్లి కేసుపై చివరి వరకు స్థిరంగా కొనసాగించారు. కోర్టు తేదీలకు హాజరవుతున్నారు. ఈ కేసులో ప్రభుత్వం 14 మంది సాక్షులను హాజరుపరిచింది. డిఫెన్స్ ఒక సాక్షిని మాత్రమే సమర్పించింది. లభ్యమైన ఆధారాల ప్రకారం మేనల్లుళ్లు అశుతోష్, రోనీలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితులు అశుతోష్ గోస్వామి, రోనీ మాస్సీ ఇద్దరికీ ప్రత్యేక సెషన్స్ జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధించారని అధికార పార్టీకి చెందిన మహేంద్ర దీక్షిత్ తెలిపారు.