ఎన్టీఆర్ జిల్లా :జగ్గయ్యపేట: పోటా పోటీగా ప్రచారం, గెలుపుపై ఇరువురు ధీమా. జగ్గయ్యపేట: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తంగా మారాయి.
జగ్గయ్యపేట:
రసవత్తంగా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు.
_పోటా పోటీగా ప్రచారం, గెలుపుపై ఇరువురు ధీమా.
జగ్గయ్యపేట: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తంగా మారాయి. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ లో మొత్తం 69 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రెసిడెంట్ పదవికి, మరో ఇద్దరు జనరల్ సెక్రెటరీ పదవికి పోటీలో ఉన్నారు. మిగిలిన పదవులకు ఏకగ్రం అయ్యాయి. వీటిలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అన్నేపాక సుందర్ రావు, అన్నేపాక కాంతారావులు పోటీ పడుతుండగా, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అభ్యర్థులుగా ఎలమంచిలి నాగ రాజేంద్రప్రసాద్, మెట్టెల వీరాంజనేయులు పోటీపడుతున్నారు. ఒకరికొకరు నేను గెలుస్తా అంటే నేను గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నేపాక సుందర్ రావు గతంలో ఐదు సంవత్సరాలు పాటు బార్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవంతో పాటు గతంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని ధీమాతో ఉండగా, అన్నెపాక కాంతారావు గతంలో ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోవడం, మరోమారు జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సీనియర్ న్యాయవాదిగా, న్యాయవాదులతో తనకున్నటువంటి సన్నిహిత సంబంధం దృశ్య తాను గెలుస్తానని గెలుపు దేమాతో అన్నారు.
_తను గతంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది: అన్నపాక సుందర్ రావు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.
గతంలో తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో కోర్టు మొక్క ముఖ ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటుతోపాటు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని, బార్ అసోసియేషన్ కు రెండు వైపులా కారిడార్ ఏర్పాటుతోపాటు, కోర్టు గ్రీన్సు ఏర్పాటు చేయడం, న్యాయవాదులకు 35 కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు అసోసియేషన్ టేబుల్స్ పై క్లాత్ లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్లు నిరంతరాయంగా మినరల్ కూల్ వాటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో బార్ అసోసియేషన్ స్థలం కేటాయింపు జరిగింది. తాను ప్రస్తుతం ప్రెసిడెంట్ గా గెలుపొందితే పైన గల ఏ డి ఏం కోర్టు ప్రక్కన న్యాయవాదులు, కక్ష దారుల సౌకర్యార్థం షెడ్డు ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి ఒక్క న్యాయవాదికి కోర్టులో కూర్చోవడానికి కుర్చీలను ఏర్పాటు చేస్తానని, కోర్టులో ఇతర అభివృద్ధితో పాటు న్యాయవాదులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. కోర్టులో సిబ్బంది తక్కువగా ఉండటం జరిగిందని, దీంతో సిబ్బందిపై పని భారం పెరిగినందున వారు పడుతున్న ఇబ్బందులను గౌరవ న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లి సిబ్బందిని ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానన్నారు. గతంలో తాను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మంజూరైన బార్ అసోసియేషన్ స్థలం నందు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. న్యాయవాదులకు ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వేతర సంస్థల నుండి గాని లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తానన్నారు. ఈ పనులు తప్పక చేయగలరని కాబట్టి తనపై నమ్మకం ఉంచి న్యాయవాదు మిత్రులందరు తనకు, జనరల్ సెక్రెటరీగా పోటీ చేయుచున్న ఎలమంచిలి నాగ రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు.
_బారు సభ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడుతా. అన్నేపాక కాంతారావు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.
తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే న్యాయవాదులు యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడతానని, ప్రతి న్యాయవాది సంరక్షణ కోసం బార్ కు కావలసిన అన్ని వసతులు, న్యాయవాదులకు వచ్చినటువంటి కష్టాన్ని బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి తీర్చుటకు ప్రయత్నం చేస్తానన్నారు. బార్ కు బెంచ్ కు తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా ఉండేటట్లు చూడటం, న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు ప్రభుత్వం నుండి రావలసిన సౌకర్యాలను న్యాయవాదులు అందించడం, బార్ లో కావలసిన వసతులు న్యాయవాదులందరుతో కలిసి సమిష్టిగా పనిచేసి వాటిని సంపాదించుకోవడం జరుగుతుందని కాబట్టి తనను బార్ ప్రెసిడెంట్ గా గెలిపించాలని న్యాయవాదులను కోరారు. ఇప్పటికే ప్రచారం గడువు ముగియగా ఎవరికి వారే గెలుపు దీమాతో ఉన్నారు. 69 మంది న్యాయవాదులలో 9 మంది న్యాయవాదులు న్యూట్రల్ గా ఉండటం జరిగింది. ఈ తొమ్మిది మంది న్యాయవాదులు ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారని తెలుస్తుంది. గెలుపు ఓటములు తెలియాలంటే ఈనెల 31 సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూడాల్సిందే.
Mar 30 2023, 13:54