madagoni surendar

Mar 30 2023, 13:31

జగన్ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు.. తాజాగా నిర్మలా సీతారామన్ తో భేటీ*

జగన్ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పు.. తాజాగా నిర్మలా సీతారామన్ తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగానే అనుకున్న విధంగా బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను జగన్ కలిశారు. అమిత్ షా నివాసంలో సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు జగన్ విజయవాడకు బయలుదేరుతారని మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ, పర్యటనలో మార్పు చేసుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో కూడా జగన్ భేటీ అయ్యారు. తొలుత నిర్మల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఉదయాన్నే ఏపీ బయల్దేరాలని జగన్ భావించారు.

కానీ, చివరి నిమిషంలో రావాలని జగన్‌కి సీతారామన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం జగన్.. ఆమెతో సమావేశం అయ్యారు. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్‌ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని నిర్మలను జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. కాగా, 15 రోజుల వ్యవధిలో జగన్‌ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన చర్చలు జరిపారు.

madagoni surendar

Mar 30 2023, 13:25

ఏపీ :ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు.

ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

ఏప్రిల్ 1న 15వ విడత బాలకాండ అఖండ పారాయణం సర్వ ఏకాదశి..

ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలు..

ఏప్రిల్ 6న తుంబరుతీర్థ ముక్కోటి పౌర్ణమి గరుడసేవ..

ఏప్రిల్ 16న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం..

ఏప్రిల్ 23న అక్షయతృతీయ..

ఏప్రిల్ 25న శ్రీ భాష్యకారుల శాత్తుమొర శ్రీ రామానుజ జయంతి శంకర జయంతి శ్రీ అనంతాళ్వారు ఉత్సవారంభం..

ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది..

madagoni surendar

Mar 30 2023, 13:21

ఏపీ :శ్రీ రామ నవమి సెలెబ్రేషన్స్ : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి..

శ్రీ రామ నవమి సెలెబ్రేషన్స్ : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి..

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు చెబుతున్నారు. చిన్న ప్రమాదం జరిగినా.. భయంతో పరుగులు తీశారు భక్తులు.. అంతా సురక్షితంగా బయటపడడంతో.. అటు భక్తులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

madagoni surendar

Mar 29 2023, 21:09

హైదరాబాద్:తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం. చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.*టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం.

చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ

హైదరాబాద్, : చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29 అని, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో వెల్లడించారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమని వెల్లడించారు.

రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు అని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు పేర్కొన్నాడు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అధికారం కావాలని ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారని స్పష్టం చేశారు. తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని చెప్పినట్లు వెల్లడించారు. తెలుగుజాతి వసుదైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టమని తెలిపారు. తెలుగుజాతిని ఉద్ధరించడానికి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. మానవత్వమే తన సిద్ధాంతమని చాటి చెప్పారన్నారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమన్న చంద్రబాబు అందరి అవసరం కోసం అందరి కోసం తెలుగుదేశం పార్టీ ఉందని వివరించారు. మార్చ్ 29 చరిత్రను తిరగరాసింది. తెలుగుజాతి రుణం తీర్చుకోవాలి ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. పది కోట్ల తెలుగువారు ఒక కుటుంభం దానికి ప్రతినిధి టీడీపీ. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ గుర్తు ఉంటారు. ఆహార భద్రతపై ఆలోచించింది ఎన్టీఆర్. ప్రజలవద్దకు పరిపాలన తెచ్చేందుకు మండల వ్యవస్త తెచ్చారు అది వికేంద్రీకరణ. యుగ పురుషుడి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. టీడీపీకు ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం అని గొంతెత్తారు. ఆహార భద్రత కోసం రూ.2కు కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. సంస్కరణలకు మారుపేరు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని ప్రశంసించారు. నిరుపేదలను చదివించాలని రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ తెచ్చారన్నారు.

ఆడబిడ్డలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. నేను వచ్చాక రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాను.

తెలుగుజాతి చిహ్నం.. ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌*

రాజమహేంద్రవరంలో మహానాడు సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహిస్తాం. తెలుగుజాతి గర్వపడేలా భవిష్యత్తుకు నాంది పలికేలా కార్యక్రమాలు చేపడుతామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

ఎన్టీఆర్‌కు గౌరవ సూచకంగా కేంద్రం రూ.100 వెండి నాణెం విడుదల చేసిందన్నారు. టీడీపీ హయాంలో సంస్కరణలు తీసుకువచ్చామని వ్యాఖ్యానించారు. విద్యుత్‌, పోర్టులు, రోడ్లు తదితర రంగాల్లో సంస్కరణలు తెచ్చామని వివరించారు. మహిళలకు చేయూత కోసం డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామని వెల్లడించారు.

madagoni surendar

Mar 29 2023, 21:02

పులివెందుల డి.ఎస్.పి కార్యాలయం. పులివెందుల డి.ఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం

పులివెందుల డి.ఎస్.పి కార్యాలయం.

పులివెందుల డి.ఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం

వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కాల్పుల ఘటన చోటుచేసుకుందని పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పులివెందులలో మీడియాతో డి.ఎస్.పి మాట్లాడారు. కాల్పుల కేసులో నిందితుడైన భరత్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు పిస్టల్ ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. ఈ కేసు విషయంలో ఇంకా అవాస్తవ ప్రచారాలు, వదంతులు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. వ్యక్తిగత విబేధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో 28 న మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో దిలీప్(27) భరత్ యాదవ్ లు గొడవపడి అంతట భరత్ యాదవ్ తన ఇంటిలోని పిస్టల్ ను తీసుకుని వచ్చి దిలీప్ మరియు మహబూబ్ బాషా(38) లపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడన్నారు. ఘటన స్థలంలో తీవ్రంగా గాయపడిన దిలీప్ వేంపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగిందని డి.ఎస్.పి తెలిపారు. గాయపడ్డ మహబూబ్ బాషా ను మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి అనంతరం చిత్తూరు కు తరలించడం జరిగిందని వివరించారు.

భరత్ యాదవ్ కు గతంలో నేర చరిత్ర లేదు...కేసులు లేవు...డి.ఎస్.పి స్థాయిలో తాను గన్ లైసెన్స్ కు రికమండ్ చేయలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు... డి.ఎస్.పి శ్రీనివాసులు

తాను డి.ఎస్.పి స్థాయిలో గన్ లైసెన్స్ కు రికమండ్ చేయలేదనేది పూర్తిగా అవాస్తవమని శ్రీనివాసులు తెలిపారు.

భరత్ యాదవ్ 2019 సం లో తనపై హత్యాయత్నం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదయింది. తాను ఓ ప్రముఖ కేసులో సాక్షిగా ఉన్నందున తనకు ప్రాణ హాని ఉందని, సి.బి.ఐ అధికారులకు వినతి పత్రం అందచేశారు. అదే ఫిర్యాదును జిల్లా ఎస్.పి గారికి కూడా అందచేసినట్లు తెలిపారు. విట్ నెస్ ప్రొటెక్షన్ స్కీం 2018 క్లాజ్ 7(O) క్రింద భరత్ యాదవ్ తనకు రక్షణ కావాలని 2021, జూన్ లో మీడియా లో స్టేట్ మెంట్ ఇచ్చాడని, 2021 నవంబర్ లో దీనిపై తాను థ్రెట్ పెర్సెప్షన్ రిపోర్ట్ (టి.పి.ఆర్) నివేదిక ను ఉన్నతాధికారులకు ఫార్వార్డ్ చేయడం జరిగింది. అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎం.ఎల్.సి ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ మేరకు భరత్ యాదవ్ తన పిస్టల్ ను ఫిబ్రవరి 26 న పులివెందుల పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేసి ఎన్నికల అనంతరం మార్చి 24 న తిరిగి తీసుకున్నాడు.

madagoni surendar

Mar 29 2023, 20:18

ఏపీ :అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అమరావతి:

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

madagoni surendar

Mar 29 2023, 20:09

ఎన్టీఆర్ జిల్లా :జగ్గయ్యపేట: పోటా పోటీగా ప్రచారం, గెలుపుపై ఇరువురు ధీమా. జగ్గయ్యపేట: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తంగా మారాయి.

జగ్గయ్యపేట:

రసవత్తంగా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు.

_పోటా పోటీగా ప్రచారం, గెలుపుపై ఇరువురు ధీమా.

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తంగా మారాయి. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ లో మొత్తం 69 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రెసిడెంట్ పదవికి, మరో ఇద్దరు జనరల్ సెక్రెటరీ పదవికి పోటీలో ఉన్నారు. మిగిలిన పదవులకు ఏకగ్రం అయ్యాయి. వీటిలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అన్నేపాక సుందర్ రావు, అన్నేపాక కాంతారావులు పోటీ పడుతుండగా, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అభ్యర్థులుగా ఎలమంచిలి నాగ రాజేంద్రప్రసాద్, మెట్టెల వీరాంజనేయులు పోటీపడుతున్నారు. ఒకరికొకరు నేను గెలుస్తా అంటే నేను గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నేపాక సుందర్ రావు గతంలో ఐదు సంవత్సరాలు పాటు బార్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవంతో పాటు గతంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని ధీమాతో ఉండగా, అన్నెపాక కాంతారావు గతంలో ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోవడం, మరోమారు జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సీనియర్ న్యాయవాదిగా, న్యాయవాదులతో తనకున్నటువంటి సన్నిహిత సంబంధం దృశ్య తాను గెలుస్తానని గెలుపు దేమాతో అన్నారు.

_తను గతంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది: అన్నపాక సుందర్ రావు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.

గతంలో తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో కోర్టు మొక్క ముఖ ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటుతోపాటు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని, బార్ అసోసియేషన్ కు రెండు వైపులా కారిడార్ ఏర్పాటుతోపాటు, కోర్టు గ్రీన్సు ఏర్పాటు చేయడం, న్యాయవాదులకు 35 కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు అసోసియేషన్ టేబుల్స్ పై క్లాత్ లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్లు నిరంతరాయంగా మినరల్ కూల్ వాటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో బార్ అసోసియేషన్ స్థలం కేటాయింపు జరిగింది. తాను ప్రస్తుతం ప్రెసిడెంట్ గా గెలుపొందితే పైన గల ఏ డి ఏం కోర్టు ప్రక్కన న్యాయవాదులు, కక్ష దారుల సౌకర్యార్థం షెడ్డు ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి ఒక్క న్యాయవాదికి కోర్టులో కూర్చోవడానికి కుర్చీలను ఏర్పాటు చేస్తానని, కోర్టులో ఇతర అభివృద్ధితో పాటు న్యాయవాదులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. కోర్టులో సిబ్బంది తక్కువగా ఉండటం జరిగిందని, దీంతో సిబ్బందిపై పని భారం పెరిగినందున వారు పడుతున్న ఇబ్బందులను గౌరవ న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లి సిబ్బందిని ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానన్నారు. గతంలో తాను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మంజూరైన బార్ అసోసియేషన్ స్థలం నందు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. న్యాయవాదులకు ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వేతర సంస్థల నుండి గాని లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తానన్నారు. ఈ పనులు తప్పక చేయగలరని కాబట్టి తనపై నమ్మకం ఉంచి న్యాయవాదు మిత్రులందరు తనకు, జనరల్ సెక్రెటరీగా పోటీ చేయుచున్న ఎలమంచిలి నాగ రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు.

_బారు సభ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడుతా. అన్నేపాక కాంతారావు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.

తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే న్యాయవాదులు యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడతానని, ప్రతి న్యాయవాది సంరక్షణ కోసం బార్ కు కావలసిన అన్ని వసతులు, న్యాయవాదులకు వచ్చినటువంటి కష్టాన్ని బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి తీర్చుటకు ప్రయత్నం చేస్తానన్నారు. బార్ కు బెంచ్ కు తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా ఉండేటట్లు చూడటం, న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు ప్రభుత్వం నుండి రావలసిన సౌకర్యాలను న్యాయవాదులు అందించడం, బార్ లో కావలసిన వసతులు న్యాయవాదులందరుతో కలిసి సమిష్టిగా పనిచేసి వాటిని సంపాదించుకోవడం జరుగుతుందని కాబట్టి తనను బార్ ప్రెసిడెంట్ గా గెలిపించాలని న్యాయవాదులను కోరారు. ఇప్పటికే ప్రచారం గడువు ముగియగా ఎవరికి వారే గెలుపు దీమాతో ఉన్నారు. 69 మంది న్యాయవాదులలో 9 మంది న్యాయవాదులు న్యూట్రల్ గా ఉండటం జరిగింది. ఈ తొమ్మిది మంది న్యాయవాదులు ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారని తెలుస్తుంది. గెలుపు ఓటములు తెలియాలంటే ఈనెల 31 సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూడాల్సిందే.

madagoni surendar

Mar 29 2023, 20:05

ఏప్రిల్ 5 న ఢిల్లీ లో కార్మిక, కర్షక ర్యాలీని జయప్రదం చేయండి - సిఐటియు*

ఏప్రిల్ 5 న ఢిల్లీ లో కార్మిక, కర్షక ర్యాలీని జయప్రదం చేయండి - సిఐటియు

Streetbuzz news :

ఏప్రిల్ 5న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని

వీరులపాడు మండలం జుజ్జూరు లో కరపత్రాలు పంపిణీ చేస్తూ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 65శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని అని తెలిపారు. వ్యవయసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దుకై రైతులు సంవత్సరం పైగా నడిపిన చారిత్రాత్మక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన చట్టాల రద్దు ప్రకటించినా దొడ్డి దారిన అమలు జరపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

కార్మికుల హక్కులను కాలరాస్తు 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల రక్త మాంసాలను, రైతు హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందన్నారు. రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచివుందన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్,సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు సునీత, ఎం రాణి, సుజాత ,ఎస్.కె దిలీషా, సుబ్బమ్మ, కోటేశ్వరి, వి.ఒ.ఎ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ కే బేగం , షేక్ బాజీ మున్నీ కౌలు రైతుల సంఘం వీరులపాడు మండల కార్యదర్శి చాట్ల.రవి తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Mar 29 2023, 17:39

ఏపీ :అమరావతి:: వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష.

అమరావతి.

వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష.

రబీ ధాన్యం సేకరణ

ఏప్రిల్‌15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్‌

అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ స్ధితి గతులను అడిగి తెలుసుకున్న సీఎం.

ఎన్యుమరేషన్‌ జరుగుతోందని, ఏప్రిల్‌ మొదటి వారంలో నివేదిక ఖరారుచేస్తామని, ఏప్రిల్‌ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదలచేస్తామని సీఎంకు తెలిపిన అధికారులు.

వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి.

రబీ సన్నాహకాలపైన సీఎం సమీక్ష.

ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్‌ పూర్తైందని వెల్లడించిన అధికారులు.

నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం.

ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశం.

ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలన్న సీఎం

సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీచేస్తున్నామన్న అధికారులు.

ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన అధికారులు.

ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్‌ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు వెల్లడించిన అధికారులు.

నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా చేయడానికి ఇది దోహదపడుతుందన్న అధికారులు.

పొలంబడి శిక్షణ

పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్న అధికారులు.

ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు.

ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయన్న అధికారులు.

పత్తిలో 16శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయన్న అధికారులు.

పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అన్న అధికారులు.

26 ఎఫ్‌పీవో(ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌)లకు జీఏపి (గుడ్‌అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌) సర్టిఫికెట్‌ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు.

వ్యవసాయ పరికరాల పంపిణీ

రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందన్న సీఎం.

ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ.

జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్‌ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ.

జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్‌ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ.

మిల్లెట్స్‌ సాగుపై చర్యలు

రాష్ట్రంలో మిల్లెట్స్‌ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఆదేశాలమేరకు అనేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు.

19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్‌ క్లస్టర్లు పెట్టామన్న అధికారులు.

3 ఆర్గానిక్‌ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడి.

ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు.

2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతిచేయదగ్గ వరి రకాలను సాగుచేస్తున్నామన్న అధికారులు.

దాదాపు 6.29 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయ్యిందని వెల్లడి.

2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించిన అధికారులు.

ఆర్బీకేల్లో కియోస్క్‌ల సేవలు పూర్తిస్థాయిలో రైతులకు అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్న సీఎం.

ఉద్యానవన పంటల మార్కెటింగ్‌ పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.

కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నకొద్దీ.. మార్కెటింగ్‌ ఉదృతంగా ఉండాలన్న సీఎం.

దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవని, మంచి ఆదాయాలు కూడావస్తాయన్న సీఎం.

ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌

ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.

భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించుకోవాలన్న సీఎం.

ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

జూన్‌లో ఖరీఫ్‌ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్న సీఎం.

పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్న సీఎం.

ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌... ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్న సీఎం.

ఈ సమీక్షకు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్‌ రెడ్డి, ఉద్యానవన శాఖ సలహాదారు శివప్రసాద్‌ రెడ్డి, ఏపీ ఆగ్రోస్‌ ఛైర్మన్‌ బి.నవీన్‌ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌. శ్రీధర్, మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌పాండే, ఎపీఎస్‌ఎస్‌డీసీఎస్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబు, ఏపీ ఆగ్రోస్‌ వీసీ అండ్‌ ఎండీ ఎస్‌.కృష్ణమూర్తి, పలువురు ఉన్నతాధికారులు.

madagoni surendar

Mar 29 2023, 17:18

విజయవాడ:* - *స్నేహితుడి తల్లిని మోసం చేసి భీమా సొమ్ము 20 లక్షలు కొట్టేసిన నలుగురు కేటుగాళ్లు* - సహకరించిన కడీసీసీ బ్యాంక్ మేనేజర్.

విజయవాడ:

- స్నేహితుడి తల్లిని మోసం చేసి భీమా సొమ్ము 20 లక్షలు కొట్టేసిన నలుగురు కేటుగాళ్లు

- సహకరించిన కడీసీసీ బ్యాంక్ మేనేజర్

- పుప్పాల వెంకట గౌరీ కుమారుడు, జనసేన కార్యకర్త చిరంజీవి బ్రెయిన్ ట్యూమర్ తో గత ఏడాది అక్టోబర్ 26న మృతి...

- స్నేహితుడు మహేష్ వద్ద 50 లక్షలకు భీమా పాలసీ కట్టిన మృతుడు

- చిరంజీవి చనిపోవడంతో భీమా సొమ్ము ఇప్పిస్తామని

తల్లి గౌరిని నమ్మించి సంతకాలు చేయించిన మహేష్ ఆతని స్నేహితులు...

- కడీసీసీ బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై గౌరీకి అకౌంట్ ఓపెన్ చేయించి సెల్ఫ్ చెక్కులతో 50 లక్షలు విత్ డ్రా చేసిన కేటుగాళ్లు

- విషయం తెలిసి గౌరీ కుమార్తె నిలదీయటంతో 30 లక్షలు వెనక్కి ఇచ్చిన నిందితులు..

- మిగతా 20 లక్షలు ఇవ్వకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు

- నిందితులు నెలిబండ్ల మహేష్, కొడిబోయిన కృష్ణ ప్రసాద్, లక్ష్మణ్ తేజ, అభిషేక్, బ్యాంక్ మేనేజర్ పై కేసు

- 420, 406, 468, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు

- విచారణ చేపట్టిన పటమట పోలీసులు