madagoni surendar

Mar 29 2023, 17:10

తెలంగాణ : ములుగు జిల్లా ::కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత..

తెలంగాణ : కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత..

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేనికి చెందిన 24 మంది వ్యవసాయ కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు..

ఆ గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి తోటలో పనికి వెళ్లిన కూలీలు భోజనం విరామ సమయంలో సమీపంలోని మరో రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని పైపుల వద్ద నీటిని సేకరించి తాగారు. కొద్దిసేపటికి పలువురు వాంతులు చేసుకోవడం, నాలుక తిమ్మిరిగా ఉండటం, కళ్లు తిరగడంతో ఆందోళన చెందారు.

ఈ క్రమంలో మిగిలిన కూలీలు ఆరాతీయగా రైతు తన పొలంలోని డ్రిప్‌ పైపులను శుభ్రపరిచేందుకు పాస్ఫరిక్‌ యాసిడ్‌ అనే రసాయన మందును ఉపయోగించారని.. ఆ పైపుల నుంచే నీరు విడిచిపెట్టినట్లు తేలింది. అస్వస్థతకు గురైన కూలీలందరినీ ట్రాక్టర్‌పై వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. ముగ్గురు కూలీలకు తీవ్రస్థాయిలో వాంతులు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన కూలీలందరికీ సామాజిక ఆసుపత్రిలోనే సేవలందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

madagoni surendar

Mar 29 2023, 15:43

తాడేపల్లి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్‌ ప్రెస్‌మీట్‌:

తాడేపల్లి.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్‌ ప్రెస్‌మీట్‌:

కులాల మధ్య చిచ్చు పెట్టాలని రామోజీరావు కుట్ర

మాల, మాదిగల మధ్య కూడా చిచ్చు పెట్టే కుయుక్తి

దళితులను వైయస్సార్‌సీపీకి దూరం చేయాలన్న లక్ష్యం

అందుకే రోజూ విషపు రాతలు. అదే పనిగా దుష్ప్రచారం

ఈనాడు రాతలపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌

చంద్రబాబు హయాంలోనే దళితులకు అన్యాయం

వారిపై యథేచ్ఛగా దాడులు. అవమాన కార్యక్రమాలు

ఆ కాలంలోనే ఎస్సీ, ఎస్టీ కేసులు అత్యధికం

ఎన్‌సీబీ రికార్డుల్లోనే స్పష్టంగా ఆ వివరాలు

మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

చంద్రబాబు మంచి వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసు

జగన్‌గారిపైనా అదే ముద్ర వేయాలన్న కుతంత్రం

అందుకే సత్యదూరమైన రాతలు, గత తప్పిన విశ్లేషణ

మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టీకరణ

ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాసేలా రామోజీరావు వ్యవహారం

అది ఆక్షేపణీయం. అత్యంత దుర్మార్గం. అతి హేయం

పత్రికా విలువలు కాలరాస్తూ, ప్రభుత్వంపై నిత్యం విషం

ఇప్పటికైనా మీ వైఖరి, పద్ధతి మార్చుకొండి

లేకపోతే మీ పత్రికకు, టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు

ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

తాడేపల్లి:

ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఏం మాట్లాడారంటే..:

కుట్రతో వాస్తవాల వక్రీకరణ:

ఈనాడులో దళితుల గురించి అదే పనిగా కథనాలు రాస్తున్నారు. దళితులు, ప్రభుత్వం మధ్య విభేదాల సృష్టించాలని చూస్తున్నారు. మా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా దళితుల కోసం చేసిందంతా వక్రీకరించి, వారికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చేలా కుట్ర చేస్తున్నారు. అందుకే ప్రతిరోజూ విషపు రాతలు రాస్తున్నారు. ఈనాడు చంద్రబాబుకు ఒక కరపత్రం మాదిరిగా మారింది. దీన్ని ప్రజలూ గుర్తిస్తున్నారు.

రామోజీగారు టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలన్న కార్యక్రమాన్ని మీ భుజాల మీద వేసుకుంటే, చంద్రబాబు ఒక వీరుడు, శూరుడు, విక్రమార్కుడు అని రాసుకొండి. మాకేం అభ్యంతరం లేదు. అంతే కానీ, రోజూ మా ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే ప్రజలే నీకు, నీ పత్రికకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

ప్రజలంతా జగన్‌గారి వెంటే:

సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇచ్చారు. ఇది కేవలం ఆయనకు మాత్రమే దక్కే గౌరవం. సీఎంగారి భావజాలన, చిత్తశుద్ధి, పథకాలు, కార్యక్రమాల అమలు వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే వారంతా ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా అంతులేని ప్రేమ, ఆప్యాయత చూపుతున్నారు. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు.

రామోజీ ‘చిచ్చు’ కుట్ర:

అందుకే ఎలాగైనా కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారు. 17 శాతం ఉన్న ఎస్సీలు, 6 శాతం ఉన్న ఎస్టీలు.. ఇద్దరూ కలిపి 23 శాతం. వారికి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చూసి, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రధాన వర్గాలైన మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు, దళితులను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేయాలన్న కుట్ర చేస్తున్నారు.

ఇవాళ రామోజీరావుకు ఒకటే చెబుతున్నాం. దళితులపై ఎప్పుడైనా దాడులు జరిగాయంటే, వారికి అన్యాయం జరిగిందంటే అది కేవలం చంద్రబాబు హయాంలోనే. ఇంకా ఎస్సీ కమిషన్‌ గురించి కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆ పదవిలో ఉన్న వ్యక్తి, మొత్తం రాజకీయాలు చేశారు. కానీ ఇవాళ ఆ పదవిలో ఉన్న విక్టర్‌ ప్రసాద్‌ ఉన్నారు. ఆయన నీతి, నిజాయితీకి మారుపేరు. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా వెళ్తున్నారు. ఎవరి తప్పున్నా సరే, ఉపేక్షించడం లేదు. ఎక్కడైనా పోలీసుల తప్పుంటే, వారిపైనా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఆ దిశలోనే పోలీసులను సస్పెండ్‌ చేయడం జరిగింది.

జగన్‌గారిపైనా అదే ముద్రకు యత్నం:

చంద్రబాబు గురించి రాయడానికి ఏమి లేదని రామోజీరావుకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు దుష్ట బుద్ది, రాజకీయ జీవితంలో ఆయన చేసిన మోసాలు, చిట్టా అంతా రామోజీ దగ్గర ఉంది కాబట్టి.. చంద్రబాబు మంచోడని రామోజీ రాయడానికి ఏమి లేదు కాబట్టి.. చంద్రబాబు మంచోడని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి.. జగన్‌గారు కూడా మంచోడు కాదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు.

‘మార్గదర్శి’ కోసం..:

దళిత సామాజిక వర్గానికి ప్రభుత్వానికి మధ్య ఒక అగాథం ఉందని భ్రమ కల్పించే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నానికి అసలు కారణాలు ప్రజలకు తెలియాలి.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ చందాదారుల సొమ్ముతో దందా చేసి, డబ్బును పక్క దారి పట్టించి వారి కష్టార్జితాన్ని మీ లాభాపేక్షకు వాడుకుని స్కామ్‌కు పాల్పడిన నేపథ్యంలో సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు (29వ తేదీ), రేపు (30వ తేదీ), ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో విచారణకు రావాలని కోరారు. అందుకే ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా మరింత విషం చిమ్మే కార్యక్రమానికి తెర లేపారు. పత్రికా విలువలను తుంగలో తొక్కి బరి తెగించి అసత్య కథనాలు రాస్తున్నారు. 

అప్పుడే కేసులు ఎక్కువ:

చంద్రబాబు హయాంలో ఎస్సీలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

2014లో 2,113 కేసులు, 2015లో 2,263 కేసులు 2016లో 2,335 కేసులు, 2017లో 1969 కేసులు నమోదయ్యాయి. అంటే ఏటా సగటున 2,103 కేసులు నమోదయ్యాయి

అదే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–2021 వరకు సగటున 2011 కేసులు నమోదయ్యాయి. 2021లో 2014 కేసులు నమెదయ్యాయని నేషనల్‌ క్రై మ్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రికార్డు చెబుతోంది.

ఇక ఎస్టీలకు సంబంధించి 2014లో 390 కేసులు 2015లో 362 కేసులు, 2016లో 405 కేసులు, 2017లో 361 కేసులు నమోదయ్యాయి. అంటే టీడీపీ హయాంలో ఏటా సగటున 365 కేసులు నమోదయ్యాయి. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో 361 కేసులు నమోదు కాగా, 2019–2021 వరకు ఏటా సగటున 337 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఎన్‌సీబీ రికార్డుల్లో ఉన్నాయి. దీని వల్ల ఎవరి హయాంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయన్న విషయం స్పష్టమవుతుంది.

ఇప్పుడు పరిహారం ఎక్కువ:

టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీల సంఖ్య ఎక్కువ ఉండగా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వారికి మరింత న్యాయం జరుగుతోంది.

అదెలా అంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 వరకు వారికి రూ.52.32 కోట్ల పరిహారం ఇవ్వగా, మా ప్రభుత్వ హయాంలో, 2019–22 మధ్య మూడేళ్లలోనే ఎస్సీ, ఎస్టీలకు రూ.125 కోట్ల పరిహారం అందించారు.

ప్రజలు మిమ్మల్ని నమ్మబోరు:

మీ పత్రిక గత నాలుగేళ్లగా దిగజారుడు రాతలు రాస్తూ పత్రిక విలువలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా వదిలేసిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దళితులపై దమనకాండ అంటూ రాయడానికి కారణం ఏంటి? దళితుల్ని భుజాన వేసుకున్నామని మీరు చెప్పే ప్రయత్నం, వారి కోసం పాటు పడుతున్నామన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.

దళితుల భూమి లాక్కుని, రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మించిన మీరు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రాష్ట్ర ప్రజలు అంత నిరాక్షరాస్యులు కాదు.

వ్యూహాత్మకంగా దుష్ప్రచారం:

ముందు రోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏదని లోకేష్‌ మాట్లాడితే వెంటనే మీరు దానికి సంబంధించి వార్త పతాక శీర్షికలో రాస్తారు. ఆ వెంటనే దుష్ట చతుష్టయం ఎల్లో మీడియాలో చర్చ పెడుతుంది. వాటిలో ఏయే పెయిడ్‌ ఆర్టిస్టులు పాల్గొంటారో అందరికి తెలుసు. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతోంది. 

దురుద్దేశంతో దుష్ప్రచారం:

ఇక్కడ ఒకటే విషయం. చంద్రబాబు హయాంలో గరగపర్రు నుంచి జెర్రిపోతులపాలెం వరకు జరిగిన ఘటనలు రామోజీరావుకు ఎందుకు గుర్తు లేవు?. వాటి గురించి ఎందుకు రాయడం లేదు? దళితులగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని అన్న చంద్రబాబు, దానిమీద కనీసం క్షమాపణ కూడా కోరలేదు.

చంద్రబాబు మంచి వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసు. అందుకే జగన్‌గారు కూడా మంచివారు కాదని ప్రచారం చేసే కుట్ర. అందుకే విషపు రాతలు. దుష్ప్రచారం.

దళితులంటే బాబుకు కోపం:

చంద్రబాబుకు ఏనాడూ దళితులపై ప్రేమ లేదు. నిరుపేదలు, దళితులకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే. దాన్ని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లాడు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, డెమొగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని దానిపైనా కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ వద్దన్నారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఒక రాజ్యాంగ నిపుణుడిని నియమిస్తే దానిపైనా కోర్టును ఆశ్రయించాడు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహం వద్దంటూ ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నాడు.

ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వారు మురికివాడల్లో ఉంటారన్న వారిని మంత్రివర్గంలో కొనసాగించాడు. చుండూరు, కారంచేడు ఘటనలకు బాధ్యులు ఎవరన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏనాడూ ఎస్సీల కోసం సబ్‌ ప్లాన్‌ అమలు చేయలేదు. ఆయనకు తెలిసిందల్లా దోచుకోవడమే.

వైఖరి మార్చుకోకపోతే..:

అచ్చెన్న హత్య బాధాకరం. అది దురదృష్టకర ఘటన. ఈరోజు సత్యదూరమైన రాతలు, గత తప్పిన విశ్లేషణ. కేవలం ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాసే విధంగా రామోజీరావు వ్యవహరించడం ఆక్షేపణీయం. దుర్మార్గం. పత్రికా విలువలు కాలరాస్తూ, ప్రభుత్వంపై విషం చిమ్మడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఇది సరి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొండి. లేదు మేము మారం. తెలుగుదేశం పార్టీ కోసమే రాస్తామని అనుకుంటే, మీ పత్రికకు, తెలుగుదేశం పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెబుతారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

టీడీపీ స్క్రిప్ట్‌ శ్రీదేవి నోట:

అక్కడ దళిత ఎమ్మెల్యే అన్నది కాదు. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా పని చేయడం అన్నది చూడాలి. పార్టీ నాయకత్వాన్ని బలహీనపర్చే విధంగా ఎవరు ప్రవర్తించినా, వాకు కచ్చితంగా క్రమశిక్షణకు బాధ్యులవుతారు. ఎమ్మెల్యే శ్రీదేవి నిజంగా క్రాస్‌ ఓటింగ్‌ చేయకపోతే, మర్నాడు అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఇక్కడే ప్రెస్‌మీట్‌ ఎందుకు నిర్వహించలేదు. హైదరాబాద్‌లో ఎందుకు మాట్లాడారు? అమరావతి అంశాన్ని భుజానికి ఎందుకు ఎత్తుకున్నారు? అంటే ఆమె తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్‌ను చదివారు.

దృష్టి మళ్లించే కుట్రలు:ఈరోజు చూడండి. రామోజీరావుకు మార్గదర్శి కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వగానే దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, విషపు రాతలు రాస్తున్నారు. అలా అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో ఒకసారి ఇలాగే 2017–18లో అసెంబ్లీలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌పై చర్చ జరగకుండా.. కావాలని అంబేడ్కర్‌ 125వ జయంతి విషయాన్ని సభలో ప్రస్తావించారు. ఇప్పుడు కూడా దళితులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అవసరం తీరాక వారిని వదిలేయడం చంద్రబాబుకు, రామోజీరావుకు అలవాటు. ఇప్పుడు శ్రీదేవితోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

madagoni surendar

Mar 29 2023, 15:35

దేశంలోని విమానాశ్రయాలకు నేరుగా విమానాలు నడపండి..అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు తిరుపతి విమానాశ్రయం సిద్ధం.

దేశంలోని విమానాశ్రయాలకు నేరుగా విమానాలు నడపండి

అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు తిరుపతి విమానాశ్రయం సిద్ధం

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రితో భేటీ అయిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

ఎట్టకేలకు ఫలించిన ఎంపీ గురుమూర్తి కృషి కువైట్ నుంచి నేరుగా తిరుపతికి విమాన సౌకర్యం

తిరుపతి ఒక ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక నగరమని, దేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల సందర్శకులు సందర్శించే ప్రాంతం కావడంతో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల మధ్య మరింత ఎక్కువ కనెక్టివిటీ అవసరమని కేంద్ర పౌర విమాన యన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వివరించారు. ఈ విషయం గూర్చి ఇదివరకే ఆయనకు లేఖ రాసిన విషయాన్ని కూడా ఆయనకి గుర్తు చేసారు.

విమానాశ్రయం అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరియు ప్రత్యక్ష విమానాల సంఖ్య పెరిగినప్పటికీ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల మధ్య మరింత కనెక్టివిటీ అవసరమని ఇది పర్యాటక, వ్యాపార రంగాలను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మరియు ప్రాంతం యొక్క మొత్తం అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల మధ్య నేరుగా విమానాలను నడపడానికి చర్యలు తీసుకొనవలసిందిగా కోరారు. దీని వలన ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా ఇది సహాయపడుతుందని ఆయనకి తెలియజేసారు.

అలాగే తిరుపతి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండా అనేక ప్రముఖ విద్యాసంస్థలకు నిలయంగా ఉంటూ ఎకనమికల్ జోన్‌గా కూడా గుర్తించబడిందని అనేక ప్రధాన పరిశ్రమలు మరియు అంతర్జాతీయ కంపెనీలు ఈ ప్రాంతంలో ఉన్నాయని ఆయనకి వివరిస్తూ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేయబడి మరియు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయని. అంతర్జాతీయ ప్రయాణికుల మరియు వారి వస్తువుల రవాణాకు అవసరాలను తీర్చడానికి విమానాశ్రయం సిద్ధంగా ఉందని ఆయనకి వివరించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మిడిల్ ఈస్ట్ ప్రత్యేకించి కువైట్‌కు వెళ్లే ప్రయాణీకులకు గేట్‌వేగా ఉపయోగపడుతుందని ఈ విమానాశ్రయం తిరుపతి, నెల్లూరు ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల సంభావ్యత కలిగి ఉందని వారికి ఉపయుక్తంగా ఉంటుందని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తద్వారా కీలకమైన ఆర్థిక, విద్యా మరియు పర్యాటక కేంద్రంగా దాని పూర్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సహకరించాలని వారిని అభ్యర్ధించారు.

అంతా సావధానంగా విన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారని తగు చర్యలు తీసుకొంటామని అందులో భాగంగా త్వరలో కువైట్ నుంచి తిరుపతికి అంతర్జాతీయ విమాన సౌకర్యం కల్పిస్తామని తెలిపారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలియజేసారు. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను కూడా ఎంపీ కలిశారు.

madagoni surendar

Mar 29 2023, 15:17

ఏపీ :గుంటూరు జిల్లా ::పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!

ఏపీ : పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!

చేబ్రోలు: తమ ప్రేమని పెద్దలు కాదనడంతో యువ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటు చేసుకుంది.

స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి రెండురోజుల క్రితం తెనాలిలోని డిగ్రీ కళాశాలకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో వెళ్లడాన్ని గమనించిన స్నేహితురాలు.. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది..

దీంతో మంగళవారం వారు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్‌ గుర్తించారు. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందింది తమ కుమార్తే అని నిర్ధారించుకుని కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

madagoni surendar

Mar 29 2023, 13:56

ఏపీ ::దిశా నిర్దేశం చేయండి. నిర్మాణాత్మక సలహాలు అనివార్యం. లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం జి 20 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

దిశా నిర్దేశం చేయండి.

నిర్మాణాత్మక సలహాలు అనివార్యం.

లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం

జి 20 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

విశాఖపట్నం :

పేదలకు లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం

అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

స్థిరమైన విధానాలపై చక్కటి సూచనలు ఇవ్వండి

చిరకాలం నిలిచేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటుపై తగిన ఆలోచనలు చేయండి

వర్టికల్ గ్రోత్‌ కన్నా హారిజాంటల్‌ గ్రోత్‌ ఉండాలి

దీనికి మార్గనిర్దేశం, సహకారం కావాలి

జి-20 దేశాల ప్రతినిధులను కోరిన సీఎం

విశాఖపట్నం:

విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్లో జి-20 రెండవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం. జి-20 తరఫున వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు. 

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

మౌలిక సదుపాయాలు రంగంమీద జి-20 వర్కింగ్‌ గ్రూపు సమావేశంమయ్యింది:

చాలా మంచి అంశం మీద వర్కింగ్‌ గ్రూపు చర్చిస్తోంది:

మా రాష్ట్రంలో భూమి లభ్యత చాలా ఉంది:

భూమి లభ్యత ఉన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలి:

ఈ లక్ష్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది:

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… మా ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద సంఖ్యలో 30లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం:

దాదాపు 22 లక్షల ఇళ్లను కడుతున్నాం:

ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి:

ఇన్ని లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది:

డ్రైనేజీ, రోడ్లు, కరెంటు… ఇలా కనీస మౌలికసదుపాయాలను కల్పించడంలో స్థిరమైన విధానాలపై ఈ వర్కింగ్‌ గ్రూపు సమాలోచనలు చేయాలని కోరుతున్నాను:

ఖర్చును తగ్గించే, నాణ్యతమైన నిర్మాణాలు జరిగేలా… అదే సమయంలో అవి చిరకాలం ఉండేలా ఎలాంటి విధానాలను అనుసరించాలన్న దానిపై చర్చ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను:

మీరంతా చర్చించి.. ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనేలా… సమిష్టిగా తగిన పరిష్కారాలను చూపుతారని ఆశిస్తున్నాను:

వర్టికల్‌ గ్రోత్‌కు భిన్నంగా … హారిజాంటల్‌

గ్రోత్‌ ఉండాలన్నది నా అభిప్రాయం:

హారిజాంటల్‌ గ్రోత్‌కు కూడా సరైన మార్గనిర్దేశకత్వం, తగిన మద్దతు అవసరం:

అప్పుడే అందమైన ఇళ్లు సాకారం అవుతాయి:

దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయినబుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నాను:

విశాఖపట్నంలో మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉండాలని ఆశిస్తున్నాను:

madagoni surendar

Mar 29 2023, 13:35

కర్ణాటక ఎలక్షన్ : మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

కర్ణాటక ఎలక్షన్ : మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

దిల్లీ: దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది..

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్‌ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది..

వృద్ధులకు ఇంటి నుంచే ఓటు..

రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా 'ఓటు ఫ్రమ్‌ హోం (ఓటు From Home)' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16,976 మంది 100ఏళ్లు పైబడిన ఓటర్లున్నట్లు తెలిపారు. శతాధిక వయసు గల ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే కావడం విశేషం.

madagoni surendar

Mar 29 2023, 13:30

న్యూడిల్లీ ::మొహమ్మద్ Faizal: లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

మొహమ్మద్ Faizal: లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ (Mohammad Faizal)పై గతంలో వేసిన అనర్హత (disqualification) వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది..

ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్ (లోక్ సభ సెక్రటేరియట్ ) బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం. (మొహమ్మద్ Faizal Disqualification)..

madagoni surendar

Mar 29 2023, 13:22

*దేశంలో కరోనా వైరస్ మరోసారి గుబులు పుట్టిస్తోంది*

దేశంలో కరోనా వైరస్ మరోసారి గుబులు పుట్టిస్తోంది

గత కొద్ది నెలలుగా కట్టడిలో ఉన్న కొత్త కేసులు ఇటీవల పెరుగుతున్నాయి.

24 గంటల వ్యవధిలో 2,151 మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గత ఐదు నెలలకాలంలో రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే మొదటిసారి.

మంగళవారం 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. రెండువేలకు పైగా కేసులు వచ్చాయి.

గత అక్టోబర్ 28న 2,208 కేసులు వచ్చాయి.

ఆ తర్వాత ఇవే అత్యధికం. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 11,903కు చేరాయి.

మంగళవారం 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. రెండువేలకు పైగా కేసులు వచ్చాయి.

గత అక్టోబర్ 28న 2,208 కేసులు వచ్చాయి.

ఆ తర్వాత ఇవే అత్యధికం. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 11,903కు చేరాయి.

madagoni surendar

Mar 29 2023, 13:17

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. విచారణలో సుప్రీంకోర్టు లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. విచారణలో సుప్రీంకోర్టు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా (Judge MR Shah) అభ్యంతరం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు దర్యాప్తు అధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశింది. ఈ నేపథ్యంలో తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్‌తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది. అయితే రాంసింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి అన్నారు.

వివేకా కేసులో విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని ఆయన భార్య తులశమ్మ కోర్టును కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అయితే ఈ కేసును దర్యాప్తును ఏప్రిల్ 15కల్లా పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలన్న తులశమ్మ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

madagoni surendar

Mar 29 2023, 13:00

గుంటూరు విజయవాడ ప్రాంత ప్రజలకు మరో వెసులుబాటు.. ఈరోజు నుంచి ఎయిర్ ఇండియా కువైట్ కు విమాన సర్వీసులు ప్రారంభించింది..

గన్నవరం నుంచి కువైట్ కు విమాన సర్వీసులు.. .

గుంటూరు విజయవాడ ప్రాంత ప్రజలకు మరో వెసులుబాటు..

ఈరోజు నుంచి ఎయిర్ ఇండియా

కువైట్ కు విమాన సర్వీసులు ప్రారంభించింది..

ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి కువైట్ కు మధ్యాహ్నం 2.40 నిమిషాలకు చేరుతుంది.

తిరిగి కువైట్ నుంచి మధ్యాహ్నం 3.40 కు బయలు దేరి రాత్రి 8.35 కు గన్నవరం చేరుకుంటుంది..

వాస్తవానికి ఇప్పటివరకు కువైట్ వెళ్లాలంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది..

ఇప్పుడు గన్నవరం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేయడం వలన సమయం, డబ్బు ఆదాయం అవుతుంది..