madagoni surendar

Mar 29 2023, 15:17

ఏపీ :గుంటూరు జిల్లా ::పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!

ఏపీ : పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!

చేబ్రోలు: తమ ప్రేమని పెద్దలు కాదనడంతో యువ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటు చేసుకుంది.

స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి రెండురోజుల క్రితం తెనాలిలోని డిగ్రీ కళాశాలకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో వెళ్లడాన్ని గమనించిన స్నేహితురాలు.. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది..

దీంతో మంగళవారం వారు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్‌ గుర్తించారు. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందింది తమ కుమార్తే అని నిర్ధారించుకుని కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

madagoni surendar

Mar 29 2023, 13:56

ఏపీ ::దిశా నిర్దేశం చేయండి. నిర్మాణాత్మక సలహాలు అనివార్యం. లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం జి 20 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

దిశా నిర్దేశం చేయండి.

నిర్మాణాత్మక సలహాలు అనివార్యం.

లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం

జి 20 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

విశాఖపట్నం :

పేదలకు లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం

అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

స్థిరమైన విధానాలపై చక్కటి సూచనలు ఇవ్వండి

చిరకాలం నిలిచేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటుపై తగిన ఆలోచనలు చేయండి

వర్టికల్ గ్రోత్‌ కన్నా హారిజాంటల్‌ గ్రోత్‌ ఉండాలి

దీనికి మార్గనిర్దేశం, సహకారం కావాలి

జి-20 దేశాల ప్రతినిధులను కోరిన సీఎం

విశాఖపట్నం:

విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్లో జి-20 రెండవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం. జి-20 తరఫున వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు. 

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

మౌలిక సదుపాయాలు రంగంమీద జి-20 వర్కింగ్‌ గ్రూపు సమావేశంమయ్యింది:

చాలా మంచి అంశం మీద వర్కింగ్‌ గ్రూపు చర్చిస్తోంది:

మా రాష్ట్రంలో భూమి లభ్యత చాలా ఉంది:

భూమి లభ్యత ఉన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలి:

ఈ లక్ష్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది:

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… మా ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద సంఖ్యలో 30లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం:

దాదాపు 22 లక్షల ఇళ్లను కడుతున్నాం:

ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి:

ఇన్ని లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది:

డ్రైనేజీ, రోడ్లు, కరెంటు… ఇలా కనీస మౌలికసదుపాయాలను కల్పించడంలో స్థిరమైన విధానాలపై ఈ వర్కింగ్‌ గ్రూపు సమాలోచనలు చేయాలని కోరుతున్నాను:

ఖర్చును తగ్గించే, నాణ్యతమైన నిర్మాణాలు జరిగేలా… అదే సమయంలో అవి చిరకాలం ఉండేలా ఎలాంటి విధానాలను అనుసరించాలన్న దానిపై చర్చ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను:

మీరంతా చర్చించి.. ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనేలా… సమిష్టిగా తగిన పరిష్కారాలను చూపుతారని ఆశిస్తున్నాను:

వర్టికల్‌ గ్రోత్‌కు భిన్నంగా … హారిజాంటల్‌

గ్రోత్‌ ఉండాలన్నది నా అభిప్రాయం:

హారిజాంటల్‌ గ్రోత్‌కు కూడా సరైన మార్గనిర్దేశకత్వం, తగిన మద్దతు అవసరం:

అప్పుడే అందమైన ఇళ్లు సాకారం అవుతాయి:

దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయినబుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నాను:

విశాఖపట్నంలో మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉండాలని ఆశిస్తున్నాను:

madagoni surendar

Mar 29 2023, 13:35

కర్ణాటక ఎలక్షన్ : మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

కర్ణాటక ఎలక్షన్ : మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

దిల్లీ: దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది..

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్‌ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది..

వృద్ధులకు ఇంటి నుంచే ఓటు..

రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా 'ఓటు ఫ్రమ్‌ హోం (ఓటు From Home)' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16,976 మంది 100ఏళ్లు పైబడిన ఓటర్లున్నట్లు తెలిపారు. శతాధిక వయసు గల ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే కావడం విశేషం.

madagoni surendar

Mar 29 2023, 13:30

న్యూడిల్లీ ::మొహమ్మద్ Faizal: లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

మొహమ్మద్ Faizal: లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ (Mohammad Faizal)పై గతంలో వేసిన అనర్హత (disqualification) వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది..

ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్ (లోక్ సభ సెక్రటేరియట్ ) బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం. (మొహమ్మద్ Faizal Disqualification)..

madagoni surendar

Mar 29 2023, 13:22

*దేశంలో కరోనా వైరస్ మరోసారి గుబులు పుట్టిస్తోంది*

దేశంలో కరోనా వైరస్ మరోసారి గుబులు పుట్టిస్తోంది

గత కొద్ది నెలలుగా కట్టడిలో ఉన్న కొత్త కేసులు ఇటీవల పెరుగుతున్నాయి.

24 గంటల వ్యవధిలో 2,151 మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గత ఐదు నెలలకాలంలో రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే మొదటిసారి.

మంగళవారం 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. రెండువేలకు పైగా కేసులు వచ్చాయి.

గత అక్టోబర్ 28న 2,208 కేసులు వచ్చాయి.

ఆ తర్వాత ఇవే అత్యధికం. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 11,903కు చేరాయి.

మంగళవారం 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. రెండువేలకు పైగా కేసులు వచ్చాయి.

గత అక్టోబర్ 28న 2,208 కేసులు వచ్చాయి.

ఆ తర్వాత ఇవే అత్యధికం. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 11,903కు చేరాయి.

madagoni surendar

Mar 29 2023, 13:17

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. విచారణలో సుప్రీంకోర్టు లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. విచారణలో సుప్రీంకోర్టు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా (Judge MR Shah) అభ్యంతరం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు దర్యాప్తు అధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశింది. ఈ నేపథ్యంలో తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక అందజేసింది. రాంసింగ్‌తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది. అయితే రాంసింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని న్యాయమూర్తి అన్నారు.

వివేకా కేసులో విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని ఆయన భార్య తులశమ్మ కోర్టును కోరారు. ఆ విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అయితే ఈ కేసును దర్యాప్తును ఏప్రిల్ 15కల్లా పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలన్న తులశమ్మ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

madagoni surendar

Mar 29 2023, 13:00

గుంటూరు విజయవాడ ప్రాంత ప్రజలకు మరో వెసులుబాటు.. ఈరోజు నుంచి ఎయిర్ ఇండియా కువైట్ కు విమాన సర్వీసులు ప్రారంభించింది..

గన్నవరం నుంచి కువైట్ కు విమాన సర్వీసులు.. .

గుంటూరు విజయవాడ ప్రాంత ప్రజలకు మరో వెసులుబాటు..

ఈరోజు నుంచి ఎయిర్ ఇండియా

కువైట్ కు విమాన సర్వీసులు ప్రారంభించింది..

ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి కువైట్ కు మధ్యాహ్నం 2.40 నిమిషాలకు చేరుతుంది.

తిరిగి కువైట్ నుంచి మధ్యాహ్నం 3.40 కు బయలు దేరి రాత్రి 8.35 కు గన్నవరం చేరుకుంటుంది..

వాస్తవానికి ఇప్పటివరకు కువైట్ వెళ్లాలంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది..

ఇప్పుడు గన్నవరం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేయడం వలన సమయం, డబ్బు ఆదాయం అవుతుంది..

madagoni surendar

Mar 29 2023, 12:50

తెలంగాణ ::అలంపురం పుణ్యక్షేత్రంలో బుధవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఆరుద్రోత్సవంను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.

అలంపురం పుణ్యక్షేత్రంలో బుధవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఆరుద్రోత్సవంను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజున ఈ ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పురేంద కుమార్ , దేవస్థానం ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ తెలిపారు. 

శ్రీశైలం మహా క్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రమైన ఆలంపురం పుణ్యక్షేత్రంలో ప్రతినెల జరుగుతున్నటువంటి ఆరుద్రోత్సవ మహోత్సవ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది.

 ఈ సందర్భంగా ముందుగా దేవస్థానం ధ్వజస్తంభం మండపం దగ్గర ముక్కోటి దేవత మూర్తులకు ప్రతిరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య గో సహితంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు .

ఇలా చేయడం ద్వారా భూమండలంలోని ముక్కోటి పుణ్యక్షేత్రాలు తీర్థాలలో ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఆరుద్రోత్సవం సందర్భంగా అలంపురం పుణ్యక్షేత్రంలో చేసే ఆలయ ప్రదక్షణానికి ఏకకాలంలో అలాంటి ఫలితం వస్తుందని అర్చకులు తెలిపారు .

అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు.

 అదేవిధంగా మహాన్యాస పారాయణాలు నిర్వహించి బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి నమక చమకాలతో 11 పర్యాయాలు ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు.

స్వేతాన్నంతో అన్న సూక్త పారాయణ చేస్తూ బాలబ్రహ్మేశ్వరుడికి అన్నాభిషేకం నిర్వహించారు

 అదే అన్నంతో స్వామివారిపైన లింగాకృతిలో చక్కగా అలంకరించి సహస్రనామాలు బిల్వాష్టోత్తరాన్ని పాటించారు .

మహా నివేదనలు సమర్పణ చేసి దశవిద హారతులను అందజేశారు.

ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

madagoni surendar

Mar 29 2023, 11:59

కృష్ణ : కృష్ణా జిల్లా బీబీగూడెం దాసరి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం.

కృష్ణ : కృష్ణా జిల్లా బీబీగూడెం దాసరి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెం దాసరి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను గ్రావెల్ క్వారీ లారీ ఢీకొట్టింది.

ఈప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

madagoni surendar

Mar 29 2023, 10:49

అమరావతి : కేబినెట్ లో కీలక పరిణామాలు

బిగ్ బ్రేకింగ్

అమరావతి : కేబినెట్ లో కీలక పరిణామాలు

- మంత్రివర్గంలోకి రానున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు

- ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

- మరోసారి కేబినెట్ లోకి కొడాలి నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి

- వీరిద్దరితో పాటు ప్రసన్నకుమార్ రెడ్డికి మంత్రిగా అవకాశం

- కేబినెట్ లో మరికొన్ని మార్పులపై కసరత్తు చేస్తున్న సీఎంవో

- ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో మార్పులకు శ్రీకారం చుట్టిన వైసీపీ

- గవర్నర్ తో భేటీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఊపందుకున్న ముందస్తు ఎన్నికల ప్రచారం

-ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లభిస్తే తెలంగాణ ఎన్నికలతో ఆంధ్రాలో కూడా ఎన్నికలు.