జోగులాంబ గద్వాల జిల్లా: మిషన్ భగీరథ లో ఒంటిపూట నీళ్లు. గత పది రోజుల నుంచి అరకొరగా నీటి సరఫరా. ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.
జోగులాంబ గద్వాల జిల్లా: మిషన్ భగీరథ లో ఒంటిపూట నీళ్లు.
గత పది రోజుల నుంచి అరకొరగా నీటి సరఫరా.
ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.
Strrtbuzz news
జోగులాoబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, రాజోలి మండలం, పచ్చర్ల గ్రామంలో గత పది రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు అరకోరగా రావడంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. మార్చి నెలలో ఎండలు అధికమవడంతో నీటి అవసరాలు కూడా అధికంగా ఉంటాయన్నారు. గత పది రోజుల నుండి అరకొరగా కొళాయి నీళ్లు రావడంతో మిషన్ భగీరథ లో ఒంటి పూట నీళ్లు రావడంతో గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారని, ఉదయం పూట మాత్రమే కొళాయి నీళ్లు వస్తున్నాయని, అది కూడా ఒక గంటకు నాలుగు లేక ఐదు బిందెలు మాత్రమే వస్తున్నాయన్నారు. వచ్చే నీళ్లు కూడా సన్నగా వస్తున్నాయని, సాయంత్రం వేళ గత పది రోజుల నుంచి కొళాయి నీళ్లు రావడంలేదని, ఎన్ని రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారో కూడా మాకు తెలియడం లేదని గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ దృష్టికి తీసుకొని ఉదయం సాయంత్రం వేళ నీటి సరఫరా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు పై అధికారులను కోరుతున్నారు.
Mar 26 2023, 15:31