డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (రాహుల్ గాంధీ ) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (ఎంపీ )పై అనర్హత వేటు పడింది..

అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (ఎంపీ /MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(మహమ్మద్ ఫైజల్ )ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (ఎంపీ ) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (లాలు ప్రసాద్ యాదవ్ ) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (అజాం ఖాన్ ).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (జయలలిత ) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

డిసక్వాలిఫైడ్ ఎంపీస్ - ఎమ్మెల్యేస్ | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (రాహుల్ గాంధీ ) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (ఎంపీ )పై అనర్హత వేటు పడింది..

అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (ఎంపీ /MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(మహమ్మద్ ఫైజల్ )ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (ఎంపీ ) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (లాలు ప్రసాద్ యాదవ్ ) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (అజాం ఖాన్ ).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (జయలలిత ) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ శాసన సభ బడ్జెట్ సమావేశ విశేషాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ శాసన సభ బడ్జెట్ సమావేశ విశేషాలు

వెలగపూడి : తొమ్మిదో రోజైన శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర       2023-24 బడ్జెట్ సమావేశం శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం అయింది. సభ్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజు తదితరులు రాష్ట్రంలో “ఆయుష్మాన్ భారత్ యోజన” పథకం అమలుపై అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని సమాదానం చెపుతున్న సమయంలో ప్రధాన ప్రతి పక్ష పార్టీకి చెందిన శాసన సభ్యలు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తూ క్వశ్చన్ అవర్ ను ముందుకు సాగనివ్వకుండా గలాటా చేస్తూ వెల్లోకి దూసుకు వస్తూ తమ ఆందోళనలను ఉదృతం చేశారు. అదే సమయంలో స్పీకర్ మేని సీతారాం వారిని వారిస్తూ వెల్లో గీసిన ఎర్ర గీతను దాటి వస్తే మాత్రం ఆటోమేటిక్ సస్పెన్షన్ ను అమలు చేస్తానని హెచ్చరించారు.

స్పీకర్ హెచ్చరికతో వారంతా వెల్లో గీసిన ఎర్ర గీత వద్ద ఆగిపోయి ఆ గీత దాటకుండానే నినాదాలు చేస్తూ నిలిచిపోయారు. లక్ష్మణ రేఖ తరహాలో ఆ ఎర్ర గీతకు ఎంతో ప్రాధాన్యత నిస్తూ టిడిపి సభ్యులు ఇలా ప్రవర్తించడంపై సభ్యులు యావన్మంది అవాక్కయ్యారు.

సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యలు ఎర్ర గీత వద్ద నిలబడి తమ ఆందోళనను కొనసాగిస్తున్నప్పటికీ స్పీకర్ క్వశ్చన్ అవర్ ను కొనసాగించారు. గౌరవ సభ్యులు జక్కంపూడి రాజా, మల్లాది విష్ణు, మహమ్మద్ మస్తఫా షేక్, కైలె అనిల్ కుమార్, వసంత వెంకట కృష్ణప్రసాద్, సింహాద్రి రమేష్ బాబు తదితరులు జగన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పనపై అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రతిపక్ష పార్టీ సభ్యుల ఆందోళన మద్యే సమాదానం చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఒనగూరే ప్రయెజనాలను, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యలను గౌరవ సభ్యులు జక్కంపూడి రాజా తదుపరి మల్లాది విష్ణు సభ దృష్టికి తెస్తున్న సమయంలో ప్రతి పక్ష పార్టీ సభ్యుల ఎర్రగీతను దాని పోడియంపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్పీకర్ వారిని ఎన్ని సార్లు వారిస్తున్నప్పటికీ ఎర్ర గీతను దాటి పోయి పోడియం పైకి వెళ్లడంతో స్పీకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వారందరినీ నేటి సమావేశం నుండి సస్పెండ్ చేస్తున్న ప్రకటించారు. 

వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, కింజరపు అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, గద్దే రామమాహన్, ఏలూరి సాంబశివరావు, డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బెందాళం అశోక్ తదితరులను నేటి బడ్జెట్ సమావేశం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం మార్షల్స్ వచ్చి వారందరినీ బయటకు పంపించేందుకు ప్రయత్నించడంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేఖకంగా పలు నినాదాలు చేస్తూ సభ బయటకు వెళ్లిపోయారు. అనంతరం ప్రశ్నోత్తర సమయాన్ని స్పీకర్ కొనసాగించారు. 

గౌరవ సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్, విశ్వనరాయి కళావతి, జొన్నలగడ్డ పద్మావతి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తదితరులు ఇళ్ల పట్టాలపై పంపిణీ అంశానికి సంబందించి అడిగిన ప్రశ్నకు  రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమాదానం చెపుతూ 2019 నుండి ఇప్పటి వరకూ మొత్తం 30,65,315 ఇళ్ల పట్టాలను రాష్ట్రంలోని నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు మొత్తం 25,427.13 ఎకరాల విస్తీర్ణంగల పట్టాభూమిని సేకరించడమైందని, నేటికి రూ.11,343.71 కోట్లను వెచ్చించడం జరిగిందని తెలిపారు. 

మత్స్యకారులకు ఆర్థిక సాయం అనే అంశంపై పలువురు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్రం పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు సమాదానం చెపుతూ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం క్రింద వేట నిషేద సమయంలో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని, మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఎక్సెగ్రేషియాగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుచున్నదన్నారు. గత నాలుగేళ్ల కాలంలో మత్స్యకారు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు వినూత్న పథకాలను అమలు చేయడం జరుగుచున్నదని, ఆయా పథకాల క్రింద ఇప్పటి వరకూ రూ.811.377 కోట్ల మే ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 

•అదే విధంగా గౌరవ సభ్యులు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, నంబూరు శంకరరావు, టి.జె.ఆర్.సుధాకర్ బాబు ధూప దీప నైవేద్య పథకం అమలుపై అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమాదానం చెపుతూ ఈ పథకం క్రింద రూ.1.00 లక్ష కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుచున్నదన్నారు. ఈ పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 4,603 దేవాలయాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ పథకం క్రింద గత నాలుగేళ్లలో రూ.56.96 కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేయగా గత ప్రభుత్వ హయాంలో  కేవలం రూ.40.45 కోట్లను మాత్రమే వెచ్చించడం జరిగిందని తెలిపారు. 

•అజెండాలో ఉన్న మిగిలిన ప్రశ్నలను అడిగిన ప్రతి పక్షపార్టీ సభ్యులు సభలో లేనందున వాటన్నింటికీ సమాదానాలు చెప్పినట్లు స్పీకర్ ప్రకటించారు.

•అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ శాసన సభచే ఆమోదించబడి శాసన మండలి ఆమోదానికై పంపబడిన పలు బ్లిలు తే.20.03.2023 దీన నిర్వహించిన శాసన మండలి సమావేశంలో శాసన సభచే పంపబడిన బిల్లులు అన్నింటినీ ఎటు మార్పులు లేకుండా ఆమోదంచి వాటిని తిరికి శాసన సభకు నేను పంపించడం జరిగిందని తెలిపారు. 

•అదే విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుండి చివరి రోజైన నేటి వరకూ సభలో నిర్వహించిన క్వశ్చన్ అవర్ లలో చర్చకు రాని 29 స్టార్డ క్వశ్చన్లు, రెండు అన్ స్టార్డు క్వశ్చన్లను మరియు నోటీసులను కూడా ఈ సభ ప్రొసీడింగ్స్ లో భాగంగా గుర్తించడంమైందని ప్రకటిస్తూ వాటి సమాదానాలను సంబందిత శాఖల మంత్రులు ప్రశ్నలు అడిగిన సభ్యులకు నేరుగా వ్రాతపూర్వంగా సత్వరమే అందజెయాలని ఆదేశించారు. అనంతరం జీరో అవర్ ను స్పీకర్ ప్రారంభించారు. 

•ఈ జీరో అవర్ లో భాగంగా పలువురు శాసన సభ్యులు వారి నియోజక వర్గాల్లోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకు వస్తూ వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబందిత మంత్రులను కోరారు.  

                                                                                         •నందికొట్కూరు శాసనసభ్యులు ఆర్డర్ తొగూరు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా తమ ప్రాంతంలోని అరటి, మిరప, మిరప తోటలు దారుణంగా దెబ్బ తిన్నాయని ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. 

•కందుకూరి శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 500 మంది హోంగార్డుల సమస్యను పరిష్కరించాలని, రాష్ట్ర విభజనకు ముందు ఉభయ రాష్ట్రాల్లో ఈ హోంగార్డులు నియమితులయ్యారని, రాష్ట్రం విడిపోయినా, వారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారని, వారి ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ కు పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సైతం అంగీకరించిందన్నారు. అయితే సంబందిత పైలు ఆర్థిక శాఖ లో పెండింగ్ లో ఉందని దాన్ని వెంటనే ఆమోదించి వీరిని మన రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.

•కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రాంతమైన కొల్లేరులో మత్స్య పరిశ్రమ 1975 నుంచి గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. కొల్లేటి వాసులు చేపల చెరువుల ద్వారా మత్స్య పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరింప చేశారన్నారు. తమ ప్రాంతంలో మత్స్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వలన ఈనాటికి ఇక్కడ చేప పిల్లల హ్యాచరీ లేదన్నారు. కైకలూరు ప్రాంతంలో వైయస్సార్ ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్వా జోన్ పరిధిలో లేదని విద్యుత్ శాఖ చేపల చెరువుల రైతుల నుంచి పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.

•ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ తాళ్ళరేవు మండలంలో లక్షకు పైగా జనాభా ఉందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రెండు ఉన్నాయని, తమ ప్రాంతంలో కిడ్నీ పేషెంట్లు అధికమని వారికోసం డయాలసిస్ సెంటర్ ఒకటి ప్రారంభించాలని అభ్యర్థించారు.

•గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గంగవరం పోర్టు కారణంగా స్థానిక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని, భారీ వాహనాల రద్దీ కారణంగా ఎగిసిపడుతున్న దుమ్ము ధూళితో పలువురికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

•విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరానికి ఉత్తరాంధ్ర నుంచి పలువురు తూర్పు కాపులు, కొండ దొరలు తదితర కులస్తులు నియోజకవర్గంలో వివిధ వృత్తుల కేసు జీవనం కొనసాగిస్తున్నారని, వీరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017 నుంచి ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రాలు అధికారులు ఇవ్వడం లేదన్నారు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.

•పెనమలూరు శాసన సభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ తాను లేవనెత్తుతున్న సమస్య రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందన్నారు. వీధి కుక్కలు సంఖ్య విపరీతంగా పెరిగిపోయి చిన్నారులను పెద్దలను కడిచి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. పొరుగు రాష్ట్రంలో పసిపిల్లలను హతమార్చిన ఘటన కూడా నమోదు కావడం గమనార్హం అన్నారు. పశుసంవర్ధక శాఖ వీటికి పునరుత్పత్తి నిరోధక ఇంజక్షన్ ఇవ్వడం లేదా చట్టంలో ఏదైనా మార్పు తీసుకొచ్చి వీధి కుక్కలను సమూలంగా నిర్మూలించే విధంగా చట్టం రూపొందించాలన్నారు.

• పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా తమ ప్రాంతంలో మామిడి జీడి మామిడి తదితర పంటలకు విపరీతమైన నష్టం కలిగిందన్నారు. అలాగే ఏనుగులు గుంపు పొలాలపై విరుచుకుపడి సోలార్ పంపుసెట్లు ధ్వంసం చేస్తున్నాయన్నారు.  నష్టాలకు గురైన బాదిత రైతులకు తగు సహాయం చేయాలని ఆమె కోరారు. 

•కమలాపురం శాసనసభ్యులు పొచిమ‌రెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ గత వారంలో అరగంటసేపు కురిసిన వడగళ్ల వాన తన ప్రాంత రైతులను ఆర్థికంగా తీవ్రంగా నష్టానికి గురి చేసిందని తెలిపారు. వరి, నువ్వులు, హార్టికల్చర్ కు సంబంధించిన వివిధ పంటలు దారుణంగా దెబ్బతిన్నా యన్నారు. నిమ్మ పిందె దశలో ఉన్నందున పంట పూర్తిగా నాశనం అయిందన్నారు. రైతుకు పంట నష్టం వచ్చేందుకు ఏమాత్రం అనుకూలించని ఉద్యానవన శాఖ నిబంధనలను ప్రభుత్వం మార్చాలన్నారు.

•పెదకూరపాడు నియోజక వర్గం శాసన సభ్యులు నంబూరి శంకర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యేసరికి మిర్చి, పత్తి విత్తనాలు రైతులకు అందడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అచ్చంపేట ప్రాంతంలో గంగాభవాని అనే రకం విత్తనాలు రైతులను తీవ్రంగా నష్టపర్చిందన్నారు. పంటల బీమా తమ ప్రాంత రైతులకు కల్పించాలని ఆయన కోరారు. అలాగే బుడగజంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారు అనేక ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నారన్నారంటూ వారిని ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

•నరసరావుపేట నియోజక వర్గం శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి క్వింటాల్ 25 వేల రూపాయల ధర పడుతుందని రైతు సంబరపడిపోతున్న సమయంలో మిర్చి కల్లాలులో ఉండగానే తడిచిపోయిందని తెలిపారు. తూర్పు రాయలసీమకు ఒక యూనివర్సిటీ కావాలనే ప్రతిపాదన ఏనాటి నుంచో ఉన్నదని అందుకై 87 ఎకరాలు స్థలం కూడా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం చొరవ చూపి ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.

• ఈ సందర్బంగా కందుకూరి శాసన సభ్యులు మహీదర రెడ్డి మాట్లాడుతూ జీరో అవర్ జీరోగా ఉండిపోతుందనే భావన చాలా మంది శాసన సభ్యులలో ఉందని, ఇటు వంటి భావనకు స్వస్తి పలికే విధంగా జీరో అవర్ ను నిర్వహించాలన్నారు. పలువురు శాసన సభ్యులు వారి నియోజక వర్గాల్లోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకు రావడం జరుగుచున్నదని, అయితే సంబందిత మంత్రులు సభలో ఉండకపోవడం దురదృష్టకరమని, ఇతర మంత్రులు సభ్యలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగిందని, వాటిని సంబందిత మంత్రి దృష్టికి తీసుకువెళతామని ఏదో మొక్కుబడిన సమాదానాలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. గతంలో తాను ఇదే సభలో దేవాదాయ శాఖకు సంబందించి తమ నియోజకవ వర్గంలోని సమస్యను సంబందిత మంత్రి దృష్టికి తీసుకురాగా, దానికి సంబందించి ఇంతవరకు తమకు ఎటు వంటి సమాదానం అందలేదని, సదరు మంత్రి కూడా మారిపోవడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రస్తుత జీరో అవర్ లో సభ్యులు సభ దృష్టికి తెచ్చిన పలు సమస్యల విషయం మరో మార్పుకు దారితీయకుండా వాటిపై తగు చర్యలు తీసుకోవడమే కాకుండా సమాదానాలు సకాలంలో అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సభాధిపతి తమ్మినేని సీతారామ్ ను కోరారు.

• అదే విధంగా పలువరు శాసన సభ్యులు ఈ జీరో అవర్ లో మాట్లాడుతూ వారి నియోజక వర్గాల సమస్యలను సభ దృష్టికి తీసుకవచ్చి వాటి తక్షణ పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

•తదుపరి స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ జీరో అవర్ ముగిస్తున్నట్లు ప్రకటించారు.

•అదే విధంగా ఏలూరు సాంబశివరావు, ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

•అజెండాలోని అన్ని పేపర్లు సభ ముందు ఉండమైనట్టు స్పీకర్ ప్రకటించారు.

•అనంతరం పలు శాఖలకు చెందిన పలు బిల్లుల సవరణలకు సభ ఆమోదం తెలపాలంటూ సంబందిత మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.

•రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిపభావంతులు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీ చరణ్ 2023 ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ (సవరణ) బిల్లును, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ దేశీయ జలమార్గముల ప్రాధికార సంస్థ బిల్లును మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త (సవరణ) బిల్లును సభ పరిశీలనార్థం మరియు ఆమోదించడం కోసం సభలో ప్రవేశ పెట్టారు.

•ఈ సవరణ బిల్లులు అన్నింటిపై పలువురు సభ్యులు ప్రసంగించిన తదుపరి ఈ బిల్లులపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించడంతో సభ్యలు అందరూ ఆయా బిల్లుల ఆమోదానికి అంగీకారం తెలపడంతో సవరణ బిల్లులు అన్నింటినీ సభ ఆమోదించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు.. కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించిన సీఎం జగన్‌

ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు.. కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించిన సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ రెండు కీలక తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది..

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని ఒక తీర్మానం. అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని మరో తీర్మానం చేసింది ఏపీ అసెంబ్లీ. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్‌.

పాదయాత్రలో.. ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశాం. రాయలసీమ జిల్లాల్లో ఆ కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్‌ తెలుసుకుంది. ప్రభుత్వానికి నివేదిక అందించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీర్మానం చేశాం అని సీఎం జగన్‌ తెలిపారు.

ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వారిని నేను కూడా అలాగే గుండెల్లో పెట్టుకుంటా. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండబోదని, గిట్టని వారే ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారాయన.

అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని.. ఉమ్మడి ఏపీలో దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలో తీర్మానం జరిగింది. మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం. మతం మారినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారవు.

కుంకుమ పువ్వు కృత్రిమ సాగుకు ప్రోత్సాహం.

కుంకుమ పువ్వు కృత్రిమ సాగుకు ప్రోత్సాహం

రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, మార్చి 24: కృత్రిమ వాతావరణంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించే దిశగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుందని ఆ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఒక యువ వ్యవసాయ పట్టభద్రురాలు ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు మొదలెట్టి తొలి ప్రయత్నంలోనే స్వచ్ఛమైన 200 గ్రాముల ఫస్ట్‌ గ్రేడ్‌ దిగుబడి సాధించిన విషయం మీ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందా అని రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన విద్యార్ధిని ఒకరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన ఇంట్లోనే హ్యుమిడిఫైర్స్‌ సాయంతో సెమి హైడ్రోపోనిక్స్‌ పరిస్థితులు సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.

జమ్మూ, కాశ్మీర్‌లోని పంపోర్‌, పుల్వామా, బుడ్గాం, శ్రీనగర్‌ ప్రాంతాల్లో కుంకుమ పువ్వు సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ వాణిజ్య స్థాయిలో ఈ పంట సాగు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమశీతోష్ణ వాతావరణం, నీరు నిల్వని వదులైన భూమి కుంకుమ పువ్వు సాగుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయి. భూమిలో పీహెచ్‌ విలువ 6.3 నుంచి 8.3 వరకు ఉండాలి. వాతావరణం ఎండా కాలంలో 23 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మధ్య శీతాకాలం అయింతే మైనస్‌ 15 డిగ్రీల నుంచి మైనస్‌ 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గకుండా ఉంటే మంచి నాణ్యమైన కుంకుమ పువ్వు దిగుబడి సాధించవచ్చని మంత్రి తెలిపారు. కృత్రిమ వాతావరణంలో నిరూపితమైన టెక్నాలజీని వినియోగించి కుంకుమ పువ్వుతో సహా ఎలాంటి పంటలు సాగు చేయడానికైనా ఉద్యానవన పంటల సమగ్ర అభివృద్ధి మిషన్‌ (ఎంఐడీహెచ్‌) ద్వారా వ్యవసాయ మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈ విధంగా చేపట్టే కృత్రిమ పంటల సాగుకు అవసరమయ్యే పాలిహౌస్‌, కృత్రిమ వాతావరణ కల్పన కోసం చేపట్టే నిర్మాణాల ఖర్చులో 50 శాతం వ్యవసాయ మంత్రిత్వ శాఖ భరిస్తుందని ఆయన తెలిపారు. ప్లాంటేషన్‌ కోసం మౌలిక వసతుల అభివృద్ధిలో భాగమైన ఫాన్‌, పాడ్‌ సిస్టమ్‌, సహజమైన వెంటిలేషన్‌ కోసం నిర్మించే ట్యూబ్యులర్‌ స్ట్రక్చర్‌, వుడెన్‌ స్ట్రక్చర్‌, బాంబూ స్ట్రక్చర్‌ వంటి వాటి నిర్మాణంలో 50 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఆహార భద్రత మిషన్‌లో చిరుధాన్యాలకు ప్రోత్సాహం

న్యూఢిల్లీ, మార్చి 24: చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంగా చేసుకుని వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద సబ్-మిషన్ ఏర్పాటు చేసిందని ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో గురువారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. గడిచిన అయిదేళ్ళలో దేశంలో 814.17 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు ఆమె తెలిపారు. 2017-18లో 164.36 లక్షల మెట్రిక్ టన్నులు, 2018-19లో 137.17 ఎల్ఎంటీ, 2019-20లో172.6, ఎల్.ఎం.టీ, 2020-21లో 180.2ఎల్ఎంటీ, 2021-22 లో 159.9 ఎల్ఎంటీ చిరుధాన్యాలు ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ప్రకారం 2022-23లో దేశంలో 159.09 లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలతో సహా మొత్తం 3235.54 లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగనున్నట్లు అంచనా వేశారు. అయితే 2022-23లో అంచనా వేసిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చిరు ధాన్యాల ఉత్పత్తి కేవలం 4.92% మాత్రమే.  

టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్ (మిడ్ డే మీల్) తదితర పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 6.07లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా యాక్ట్-2013 ప్రకారం ధాన్యం, గోధుమలు, ముతక ధాన్యం, నాణ్యత కల్గిన ఇతర రకాలను కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలుగా గుర్తిస్తోందని అన్నారు. చిరుధాన్యాలకు చట్టంలో ప్రత్యేక నియమం ఏదీ లేదని మంత్రి తెలిపారు. అయితే ఆహార భద్రత చట్టం కింద లబ్ధి పొందుతున్న వారిలో పోషక విలువలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వినియోగిస్తున్న చిరుధాన్యాల ప్రాధాన్యతనుబట్టి చిరుధాన్యాలు కొనుగోలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే చిరుధాన్యాలు టార్గెటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగమైనట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ముతక ధాన్యం కొనుగోలు, నిల్వ, పంపిణీ చేస్తున్నాయని మంత్రి తెలిపారు.

ఉద్యోగుల హెల్తు స్కీం, పీఆర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సిఎస్ అధ్యక్షతన సమావేశం.

ఉద్యోగుల హెల్తు స్కీం, పీఆర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సిఎస్ అధ్యక్షతన సమావేశం.

అమరావతి,24 మార్చి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హెల్తు స్కీం, పీఆర్సీ అంశాలపై శుక్రవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతి నిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం.

 ఈసమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన హెల్తు స్కీం, పీఆర్సీ అంశాలపై సమీక్షిస్తున్నారు.

ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి,వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం.టి. కృష్ణబాబు,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్ ఆర్) చిరంజీవి చౌదరి,ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సత్యనారాయణ,సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ఆరోగ్య శ్రీ సిఇఒ హరీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.

ఈసమావేశంలో ఉద్యోగ సంఘాల తరపున ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి జెఎసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామి రెడ్డి,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్యనారాయణ,ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

(కమీషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వారిచే జారీ చేయడమైనది)

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి.పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా.

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా 

 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య. అన్నారు.శుక్రవారం రామన్న పేట ఎంపీడీఓ కార్యాలయంలో రామన్న పేట మండలానికి చెందిన 45 మందికి రూ.45 లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కులను,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. .పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని...దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు. అనంతరం.సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి*

రామన్న పేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు రూ. 12 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులకు అందజేశారు.

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

Streetbuz news.నల్గొండ జిల్లా :

గ్రామాల సర్వతోముకాభివృద్దికి సర్పంచుల పాత్ర కీలకమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కట్టంగూర్ మండల స్థాయిలో వివిధ కేటగిరీల కింద ఎంపికైనా గ్రామా పంచాయతీల సర్పంచులకు జాతీయ పంచాయతీ అవార్డులు ప్రధానం చేసి ఘనంగా సన్మానించి.అనంతరం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి

కట్టంగూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ. 5 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో. కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి,నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, ఎంపీటీసీలు,వివిధ గ్రామాల సర్పంచులు,వార్డ్ నెంబర్లు,ఎంపీడీఓ సునీత,తదితరులు పాల్గొన్నారు.

15 రోజులు బ్యాంకులు బంద్.

15 రోజులు బ్యాంకులు బంద్ 

మార్చి 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు జరగనున్నాయి, ఈసారి ఏప్రిల్ నెల మొత్తం 15 రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి, ఏప్రిల్ 1,2,4,5,7,8,9,14,15,16,18,21,22,23,30, తేదీలలో బ్యాంకు సెలవులు ఉండ ఉన్నాయి, బ్యాంకు కస్టమర్లు. మీకు బ్యాంకు పనులు ఉంటే సెలవులకు తగ్గట్టుగా ముందే ప్లాన్ చేసుకోండి..

తిరుపతి : నేడు శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్ల విడుదల

తిరుపతి : నేడు శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్ల విడుదల

తిరుపతి : నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల కానున్నాయి..

మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ టోకెన్లను విడుదల చేయనుంది. గురువారం స్వామివారిని 58,965 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.5 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 25,113 మంది తలనీలాలు సమర్పించారు..