TeluguCentralnews

Mar 21 2023, 17:13

గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్లు.. యాప్​ డౌన్​లోడ్​ చేయించి నిలువు దోపిడి

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర కూర్చుని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఒక్క పాస్‌వర్డ్, ఓటీపీ, ఇంటి చిరునామా ఇవ్వడం ద్వారా వారికి కావాల్సిన అంగట్లో వస్తువులన్నీ డెలివరీ చేయబడతాయి. అంతేకాకుండా.. రైలు, బస్సు, విమానం రిజర్వేషన్లు ఇంటి నుంచి సులువుగా చేస్తున్నారు. ఈ క్రమంలో మనం కస్టమర్​కేర్​ సెంటర్లను ఆన్​లైన్​లో వెతికామంటే.. సైబర్​ నేరగాళ్ల చేతిలో బలైపోయినట్టే.. ఇలాంటి సైబర్‌ కేసులు రెండు నెలల్లో నగరంలో సుమారు 200 దాకా ఇలాంటి తరహా కేసులు నమోదయ్యాయి.

నకిలీ వెబ్‌సైట్లు

నకిలీ వెబ్‌సైట్లు నయాగా తయారు చేసి ఫోన్‌ నంబర్లను సైబర్​ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. ఇలా.. హరియాణా, ఝార్ఖండ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్‌ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. దీన్ని గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్‌ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్​లో నకిలీదే ముందు కనిపిస్తుంది. వీటిని నమ్మి బాధితులు మోసపోతున్నారు. ఇలా భాగ్యనగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకూ నమోదయ్యాయి.

ఈ గూగుల్‌ ఫ్రాడ్‌ వల్ల బాధితులు రూ.8 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. ఇలాంటి తరహా మోసాలు మున్ముందు పెరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సరే.. ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం మీరు గూగుల్​లో వెతికినప్పుడు ముందుగా వచ్చిన నంబర్​ను నమ్మొద్దని, అది కరెక్ట్ నంబరా లేదా ఫేక్ నంబరా అనేది చెక్ చేసుకోవాలి. కాగా.. సాధారణంగా ప్రతి కంపెనీ తమ ప్రాడక్ట్స్, యూజర్ గైడ్ బుక్స్​, రసీదులపై తమ కస్టమర్ కేర్ నంబర్​ను ప్రింట్ చేసి ఉంచుతుందని, వీలైనంత వరకు మీరు వాటిని సంప్రదించాలని కోరారు.

అయితే.. బ్యాంకులు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఈ ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతాయి. అధికారిక వెబ్‌సైట్లు హెచ్‌టీటీపీ, తాళం గుర్తుతో మొదలవుతాయి. ఈఫ్రాడ్‌ మెసాలకు ఓ హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే.. వేరే పనులు ఉండటం వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.. దానికోసం ఆన్​లైన్​లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సర్చ్ చేసి చివరకు అది ఫేక్ కావడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కయ్యాడు దీంతో బాధితుడు నుంచి రూ.1. 89లక్షలు కాజేశారు.

నిలువు దోపిడి..

ఇక మరో హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అదికాస్తా సమయానికి డెలివరీ కాకపోవడంతో కస్టమర్ కేర్​ నంబర్​ కోసం గూగుల్​లో వెతికాడు. అందులో ఓ నంబర్‌ కనిపించడంతో దానికి కాల్ చేసాడు. అటునుంచి ఓ వ్యక్తి కాల్‌ లో మాట్లాడి ఓ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేస్తే మీకు సులువుగా పని జరుగుతుందని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన కస్టమర్‌ ఆ యాప్‌ ను డౌన్​లోడ్ చేశాడు. అంతే. నిమిషంలో కస్టమర్‌ బ్యాంకు ఖాతాలో వున్న నుంచి రూ.99 వేలు ఖాళీ అయ్యాయి. ఇలా కొత్త తరహామోసాలకు తెర లేపుతున్నారు. వీల్ల ఉచ్చులో పాపం అమాయకులు బలి అవుతున్నారు. తెలివిగా వున్నా వారి అమాయకులను ఆసరాగా తీసుకుని వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. 

ఇలాంటి వారిని నమ్మకూడదని తెలివిగా మసులు కోవాలని అధికారులు ఎన్ని సార్లు చెబుతున్నా బాధితులు .. కిలాడీల మెసాల ఉచ్చులో పడి వారి ఖాతాల్లోని డబ్బులను ఖాలీ చేస్తున్నారు. వీరి మెసాలకు అలర్ట్‌ గా ఉండాలని అధికారులు చెబుతున్నా అయినా సైబర్‌ క్రైం మోసాలకు తెరలేపుతున్న కేటు గాళ్ల చేతుల్లో మోసాపోకండని ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

TeluguCentralnews

Mar 21 2023, 16:35

మీ స్మార్ట్​ఫోన్ హ్యాక్​ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, ప్రజలు స్మార్ట్‌ఫోన్ నుండి చాలా సౌకర్యాలను పొందుతున్నారు. చాలా వ్యాపారాలు స్మార్ట్ ఫోన్ మీదనే జరిగిపోతున్నాయి. ప్రజలు తమ దైనందిన జీవితానికి సంబంధించిన సగానికి పైగా పనిని స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే నిర్వహిస్తారు. ఆన్‌లైన్ షాపింగ్ అయినా, పేమెంట్ అయినా లేదా ఏదైనా టికెట్ బుకింగ్ అయినా, ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంట్లో కూర్చొని ఈ పనులన్నీ చేసేస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ మనుషులకు వరం అని చెప్పడంలో తప్పులేదు. అయితే ఒకవైపు దీని వినియోగం పెరిగిన చోట.. మరోవైపు దీని వల్ల ప్రజల సీక్రెట్ సమాచారం కూడా దుర్వినియోగం కావడం మొదలైంది. సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేసి వారి ఫోన్ లోని కీలక సమచారంతో హ్యాకింగ్ చేసి అకౌంటు నుంచి డబ్బులు కొట్టేయడం లాంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. లేదా మరేదైనా పర్సనల్ సమాచారం వారి చేతికి చిక్కినా వారు ప్రజలను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల మీ ఫోన్ దొంగిలించకుండానే హ్యాకింగ్ చేసే వీలుంది. ఈ సమస్యను ఎలా గుర్తించాలి. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.

ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించాలి…

స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా పేమెంట్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ పేమెంట్ యాప్స్ వాడవద్దు.

ఇది కాకుండా, మీకు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా లింకులను టచ్ చేయవద్దు. అలాగే, అనుమానాస్పద లింక్‌లు, అనుమానాస్పద మెయిల్‌లు అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయవద్దు.

స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తుండాలి. ఇది మాల్‌వేర్‌ను తీసివేయడంలో లేదా దానికి నష్టం కలిగించడంలో సహాయపడుతుంది.

కొందరు ఆగంతుకులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ చెప్పమని అడుగుతుంటారు. అలాంటి పనులు చేయకండి. అలాగే విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను బ్లాక్ చేయండి.

మీకు అవసరం లేనప్పుడు మొబైల్ డాటాను ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీ ఫోన్ హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్ కాకుండా బయట లింకుల నుంచి యాప్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేయవద్దు. విదేశీ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే వాటిని ఆన్సర్ చేయకండి. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడ్డట్టే అని గుర్తుంచుకోండి.

TeluguCentralnews

Mar 21 2023, 16:11

మళ్లీ కేంద్రంలో అధికారం బీజేపీదే.. అలా అయితే తప్పా: ప్రశాంత్ కిశోర్

వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే విజయమని ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన సూరజ్ యాత్రలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని విపక్షాలన్ని ఏకమైన బీజేపీని ఏమీ చేయలేవని సుస్పష్టం చేశారు.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి లేదన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికలకు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌ను గద్దె దించేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ప్రతిపక్ష పార్టీలు ఏకమైనా వాటి మధ్య సిద్ధాంతపరమైన తేడాలు ఉంటాయని.. వాటి ఐక్యత కూడా స్థిరంగా ఉండదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. విపక్షాలు బీజేపీని ఓడించాలంటే ముందుగా హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది త్రీ లెవెల్ పిల్లర్ అని అన్నారు. వీటిలో కనీసం రెండింటిని విపక్షాలు అధిగమించపోతే… బీజేపీని కనీసం ఎన్నికల్లో ఎదురుకునే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహణగా తెలిపారు. ఈ క్రమంలోనే త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయని ఆయన గుర్తు చేశారు.

హిందుత్వ సిద్ధాంతంపై పోరాడాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి ఏకం కావల్సిన అవసరముందన్నారు. ఎవరి సిద్ధాతం వారిది అనుకుంటే మాత్రం బీజేపీని ఓడించడం కష్టమని పీకే అన్నారు. గాంధీవాది, అంబేద్కర్ రైట్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు… ఏదైనాసరే సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమని… అయితే ఈ సిద్ధాంతాల వల్లే ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత ఈజీ కాదన్నారు. తనది మహాత్మాగాంధీ భావజాలమని.. బీహార్ లో తాను చేపట్టిన జన సూరజ్ యాత్ర లక్ష్యం కూడా గాంధీ కాంగ్రెస్ ను మళ్లీ తీసుకురావడానికి చేసే ప్రయత్నమేనని ప్రశాంత్ కిశోర్ అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

TeluguCentralnews

Mar 21 2023, 15:12

తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు ( రూ. 3.40లక్షల కోట్లు ) చేరినట్లు వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మన దేశ చమురు దిగుమత్తుల్లో రష్యా 18వ స్థానంలో ఉంది. ఆ ఏడాది 9.86 బిలియన్ డాలర్ల చమురు దిగుమతులు నమోదయ్యాయి. ఇప్పుడు చమురు దిగుమత్తుల్లో నాలుగో పెద్ద దేశంగా రష్యా నిలిచింది. జనవరిలో భారతదేశ చమురు దిగుమత్తుల్లో 28శాతం రష్యా నుంచే పని చేస్తుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ చమురు దిగుమతుల్లో ఒక శాతం వాటానే కలిగిన రష్యా.. 2023 జనవరిలో 1.27 మిలియన్ బ్యారెళ్లతో ( రోజువారీ ) 28 శాతం వాటాను సొంతం చేసుకుంది. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గించుకున్నాయి. దీంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే రష్యా భారత్ కు చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో రష్యా నుంచి భారతదేశం పెద్ద ఎత్తున చమురు దిగుమతికి మొగ్గు చూపిస్తుంది.

చైనా నుంచి దిగుమతులు 6.2 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – ఫిబ్రవరి మధ్య 90.72 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఏఈ నుంచి దిగుమతులు 21.5 శాతం పెరిగి 49 డాలర్లుగా ఉన్నాయి. అమెరికా నుంచి 19.5 శాతం అధికంగా 46 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి. ఎగుమతుల పరంగా చూస్తే అమెరికా 17.5 శాతం భారత్ కు అతిపెద్ద మార్కెట్ గా ఉంది. అమెరికాకు మన దేశం నుంచి ఈ 11 నెలల్లో 71 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. యూఏఈకి సైతం ఎగుమతులు 28.63 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చైనాకి మన దేశ ఎగుమతులు గతేడాది ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 19.81 బిలియన్ డాలర్ల ఉంచి 13.64 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

TeluguCentralnews

Mar 21 2023, 14:58

పైలట్లు ఇద్దరు ఒకే రకమైన ఆహారం తీసుకోరు..ఎందుకో తెలుసా

ఇటీవల హోలీ పండగ రోజు ఓ ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఇద్దరు పైలట్లు కాక్ పిట్ లో ఆహారం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విచారణ చేపట్టిన విమానయాన సంస్థ ఆ ఫైలట్లను రోజువారి విధుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ విమాన పైలట్ల ఆహార నియమావళి గురించి చర్చనీయాంశమైంది. అయితే పైలట్లు కాక్ పీట్ లో ఆహారం తీసుకోవచ్చా.. విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే విధమైన ఆహారం ఎందుకు తీసుకోరు అనే విషయాలపై ఇప్పడు తెలుసుకుందాం. కొన్ని విమాన సంస్థల నిబంధనల ప్రకారం పైలట్లు కాక్ పీట్ లో ఆహారం తీసుకోకూడదు. 

కానీ మరికొన్ని విమానయాన సంస్థల పైలట్లు కాక్ పీట్ లో ఆహారం తీసుకోవచ్చు.అయితే ఇద్దరు పైలట్లు ఒకేసారి ఆహారం తీసుకోకూడదు అనేదు నిబంధన. కొన్ని విమానాల్లో కాక్‌పిట్‌లో పైలట్లు ఆహారం తీసుకునేందుకు ట్రే ఉంటే, మరికొన్ని విమానాల్లో ప్రయాణికులతోపాటు సీటులో కూర్చొని తినాల్సిందే. సాధారణంగా విమానం ఆటో పైలట్‌ మోడ్‌లో ఉన్నప్పుడు పైలట్లు ఆహారం తీసుకుంటారు.

వాస్తవానికి ఇద్దరు పైలట్లు ఒకే విధమైన ఆహారం తీసుకోకూడదు అనే దానికి సంబంధించి డీజీసీఏ, ఎఫ్‌ఏఏ ఎలాంటి నిబంధనలు రూపొందించలేదు. కానీ, ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదు అనే సంప్రదాయాన్ని విమానయాన రంగంలో ఎన్నో ఏళ్లుగా పైలట్లు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఇద్దరు తిన్న ఆహారంతో వారికి అసౌకర్యం కలిగితే విమానం అదుపు తప్పుతుంది. అందుకే వేర్వేరు ఆహారం తీసుకోవాలనే సంప్రదాయాన్ని ప్రతి పైలట్‌ పాటిస్తుంటారు. కొన్ని విమానయాన సంస్థల్లో పైలట్లు ఇద్దరు ఒకే రకమైన ఆహారం కావాలని కోరితే.. విమాన సిబ్బంది వారి అభ్యర్థనను తిరస్కరించవచ్చు. ఒకవేళ తప్పనిసరై తినాల్సి వస్తే.. పరిమిత మోతాదులో మాత్రమే వారికి ఆహారం అందజేస్తారు.

TeluguCentralnews

Mar 20 2023, 17:26

నకిలీ పత్రాలతో బ్యాంక్‌కి టోకరా.. రూ.1 కోటితో జంప్

చిన్న చిన్న దొంగతనాలతో సంతృప్తి చెందని ఓ దొంగ.. కొడితే కుంభస్థలం కొట్టాలన్న ఉద్దేశంతో పెద్ద స్కెచ్ వేశాడు. ఏకంగా బ్యాంక్‌కే టోకరా వేయాలని నిర్ణయించుకొని, అందుకు తగినట్టు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఫైనల్‌గా తన ప్లాన్ సక్సెస్ అవ్వడంతో.. రూ.1.28 కోట్ల రుణం తీసుకొని, బ్యాంక్‌కి శఠగోపం తొడిగాడు. కోయంబత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

కోయంబత్తూరు వేలండిపాళయంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ లోన్‌ అనే పథకం కింద జీతం ఖాతా ఉన్న వారికి భారీ రుణాలు ఇస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్‌ మేనేజర్‌గా ఉన్న మార్టిన్‌ సాకో, విజయకుమార్‌.. తాము ఆ కంపెనీలో ఇంకా పని చేస్తున్నామని బ్యాంక్ వాళ్లను నమ్మించారు. నిజానికి.. ఆ ఇద్దరు 2019-20 మధ్యకాలంలో మాత్రమే ఆ కంపెనీలో పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. కానీ.. ఇంకా ఆ కంపెనీలోనే పని చేస్తున్నామని నకిలీ పత్రాలు సృష్టించి.. బ్యాంక్ వాళ్లకు సబ్మిట్ చేశారు. మొత్తం 44 మంది ఆ పత్రాలను తనిఖీ చేసిన తర్వాత ఆ ఇద్దరికి రూ.1.28 కోట్ల రుణం ఇచ్చారు.

ఆ పత్రాలు నకిలీవి అని తేలిన తర్వాత.. మండల మేనేజర్‌ సెంథిల్‌కుమార్‌ కొబయాషి వెంటనే మునిసిపల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ ఇద్దరికి బ్యాంక్‌ మేనేజర్‌ దండపాణి, జయప్రకాష్‌ నారాయణన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రాధిక సహకరించారు. వీరితో పాటు మార్టిన్‌ సాకో, విజయకుమార్‌లపై కేసు నమోదు చేశారు. వీరిలో రాధిక, విజయకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేయగా.. మార్టిన్‌ సాకో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

TeluguCentralnews

Mar 20 2023, 17:17

కేరళలో ఫస్ట్ ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

కేరళలో మొదటి జెండర్ న్యాయవాదిగా పద్మాలక్ష్మీ చరిత్ర సృష్టించారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా తమ పేరును నమోదు చేయించుకున్నారు. దీనిపై కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందించారు. అనేక మంది ట్రాన్స్ జంటర్లకు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తారని ఆయన అన్నారు. మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ లో పద్మాలక్ష్మీని అభినందిస్తూ పోస్ట్ చేశారు. బార్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందిలో పద్మాలక్ష్మీ కూడా ఒకరని ఆయన అన్నారు. పద్మా లక్ష్మి ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టభద్రురాలయ్యారు. లాయర్ కావడానికి పద్మాలక్ష్మీ ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు.

జీవితంలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి కేరళలో మొదటి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా నమోదు చేసుకున్న పద్మాలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. ఎన్నొ అడ్డంకులు అధిగమించి పద్మా లక్ష్మి న్యాయ చరిత్రలో తన పేరును లిఖించుకుంది అని మంత్రి రాజీవ్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. అడ్వకేట్ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా మారిన జోయితా మోండల్ లాగే పద్మాలక్ష్మీ ఘనత సాధించారు. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. జోెయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్ లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018లో ట్రాన్స్ జెండర్ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో జడ్జిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఏడాది దేశంలో మూడో ట్రాన్స్ జెండర్ న్యాయమూర్తిగా స్వాతి బిధాన్ బారుహ్ నియమితులయ్యారు.

TeluguCentralnews

Mar 20 2023, 16:21

అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వెలుగు రేఖ.. కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో వింత కాంతి

అమెరికాలోని కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో వింత ఘటన జరిగింది. ఆకాశంలో అంతుచిక్కని వెలుగు రేఖ స్తానికంగా కలకలం రేపింది. నీలాకాశంలో అంతుచిక్కని వెలుగులతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వింత వెలుగు రేఖ 40 సెకండ్ల పాటు కనిపించి అదృష్యమైంది. ఆకాశంలో మండుతున్నట్టుగా కనిపించిన వెలుగు రేఖ కేవలం కొన్ని సెకండ్లపాటు కనిపించి మాయమైపోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హార్వార్డ్‌–స్మిత్‌సోనియాన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జోనాథాన్‌ మెక్‌డొవెల్‌ అంతరిక్షంలో మండించే శిథిలాల్లో ఒక చిన్న తునక కావడానికి 99.9% ఆస్కారం ఉందని బదులిచ్చారు.

పీపుల్ రికార్డ్ అమేజింగ్ వ్యూ..

జామీ హెర్నాండెజ్ 40-సెకన్ల వీడియోను క్యాప్చర్ చేశారు. అతను కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని కింగ్ కాంగ్ బ్రూయింగ్ కంపెనీలో సెయింట్ పాట్రిక్స్ డేని జరుపుకుంటున్నాడు. అద్భుతమైన దృశ్యాన్ని చూసిన త్వరగా రికార్డ్ చేయడం ప్రారంభించిన వ్యక్తుల సమూహంలో ఒకడు.

మేము షాక్‌లో ఉన్నాం..

అని జామీ హెర్నాండెజ్ APకి పంపిన ఇమెయిల్‌లో.. ‘మేము షాక్‌లో ఉన్నాం, కానీ మేము దీన్ని చూసినందుకు ఆశ్చర్యపోయాం. ఇంతకు ముందు మాలో ఎవరూ ఇలాంటివి చూడలేదు. ఆ తర్వాత, కింగ్ కాంగ్ బ్రూయింగ్ కంపెనీ యజమాని హెర్నాండెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో “క్రేజీ బాణసంచా” అని పిలిచే ఒక వీడియోను బ్రూవరీపైకి ఎగిరిన వీడియోను పోస్ట్ చేశాడు.

ఏంటా కాంతి.. ?

అయితే, ఆకాశంలో కనిపించిన ఈ కాంతి ఏంటనేది ఇప్పుడు అమెరికా ఖగోళ పరిశోధకులకు పెద్ద ప్రశ్నగా మారింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లోని ఖగోళ శాస్త్రవేత్త అందించిన సమాచారం ప్రకారం, ఇది అంతరిక్ష శిథిలాలు అని తెలిపారు. ఖగోళ శాస్త్రవేత్త అంతరిక్ష శిథిలాలను కాల్చడం వల్ల కాంతి చారలు 99.99 శాతం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పారు.

TeluguCentralnews

Mar 20 2023, 14:52

లండన్​లోని భారత హైకమిషన్​పై ఖలిస్తానీల దాడి.. కేంద్రం సీరియస్

లండన్​లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పంజాబ్​లో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం సెర్చ్ కొనసాగుతుండటం, అతని మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో లండన్​లో పలువురు ఖలిస్తాన్ మద్దతుదారులైన సిక్కులు నిరసనలు తెలిపారు. ఇండియన్ హై కమిషన్ ఆఫీస్​ వద్దకు చేరుకుని, బిల్డింగ్​పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని తొలగించారు.

ఈ ఘటనపై ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్​కు మన విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. హై కమిషన్ వద్ద సెక్యూరిటీ కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై అలెక్స్ ఎలిస్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఇండియన్ హై కమిషన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటిని తాము ఆమోదించబోమని ట్వీట్ చేశారు.

TeluguCentralnews

Mar 20 2023, 11:52

కుక్కపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు చేసిన పోలీసులు

బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు వీధి ఆడ కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ చర్య అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటన హోలీ రోజున జరిగింది. ఫుల్వారీ షరీఫ్ లోని ఫైసల్ కాలనీలో ఇది చోటు చేసుకుందని ప్రియా అనే జంతు ప్రేమికురాలు వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భూరి ఫౌండేషన్ అనే జంతు స్వచ్ఛంద సంస్థ నుంచి ఆమె ఫిర్యాదు చేసింది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కోరారు. దీంతో పాట్నా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దుశ్చర్యపై ఫిర్యాదు అందింది. ఐపీసీ, జంతు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫుల్వారీ షరీఫ్ మనీష్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి అసహజమైన, హేయమైన చర్య జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో ఢిల్లీ ఇంద్రపురి ప్రాంతంలోని జేజే కాలనీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అక్కడ ఆడ కుక్కపై అత్యాచారం చేస్తూ సతీష్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.

నాగ్ పూర్ లోని హడ్కేశ్వర్ ప్రాంతంలో కూడా 40 ఏళ్ల వ్యక్తి వీధికుక్కపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నంచాడు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో నిందితుడిపై సెక్షన్ 377(ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా శారీరక సంబంధం), 294( అశ్లీలత), భారతీయ శిక్షాస్మృతి, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఇతర నేరాల కింద అభియోగాలు మోపారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. ముంబై పోవాయ్ లోని హీరా పన్నా మాల్ లో 6 నెలల కుక్కపిల్లపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో జంతు కార్యకర్త, బాంబే యానిమల్ రైట్స్ అనే స్వచ్చంద సంస్థ అతడిపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.