కేరళలో ఫస్ట్ ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

కేరళలో మొదటి జెండర్ న్యాయవాదిగా పద్మాలక్ష్మీ చరిత్ర సృష్టించారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా తమ పేరును నమోదు చేయించుకున్నారు. దీనిపై కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందించారు. అనేక మంది ట్రాన్స్ జంటర్లకు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తారని ఆయన అన్నారు. మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ లో పద్మాలక్ష్మీని అభినందిస్తూ పోస్ట్ చేశారు. బార్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్ కోసం బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందిలో పద్మాలక్ష్మీ కూడా ఒకరని ఆయన అన్నారు. పద్మా లక్ష్మి ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టభద్రురాలయ్యారు. లాయర్ కావడానికి పద్మాలక్ష్మీ ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు.

జీవితంలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి కేరళలో మొదటి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా నమోదు చేసుకున్న పద్మాలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. ఎన్నొ అడ్డంకులు అధిగమించి పద్మా లక్ష్మి న్యాయ చరిత్రలో తన పేరును లిఖించుకుంది అని మంత్రి రాజీవ్ సోషల్ మీడియాలో ప్రశంసించారు. అడ్వకేట్ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ జడ్జిగా మారిన జోయితా మోండల్ లాగే పద్మాలక్ష్మీ ఘనత సాధించారు. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. జోెయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్ లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018లో ట్రాన్స్ జెండర్ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో జడ్జిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఏడాది దేశంలో మూడో ట్రాన్స్ జెండర్ న్యాయమూర్తిగా స్వాతి బిధాన్ బారుహ్ నియమితులయ్యారు.

అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వెలుగు రేఖ.. కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో వింత కాంతి

అమెరికాలోని కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో వింత ఘటన జరిగింది. ఆకాశంలో అంతుచిక్కని వెలుగు రేఖ స్తానికంగా కలకలం రేపింది. నీలాకాశంలో అంతుచిక్కని వెలుగులతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వింత వెలుగు రేఖ 40 సెకండ్ల పాటు కనిపించి అదృష్యమైంది. ఆకాశంలో మండుతున్నట్టుగా కనిపించిన వెలుగు రేఖ కేవలం కొన్ని సెకండ్లపాటు కనిపించి మాయమైపోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హార్వార్డ్‌–స్మిత్‌సోనియాన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జోనాథాన్‌ మెక్‌డొవెల్‌ అంతరిక్షంలో మండించే శిథిలాల్లో ఒక చిన్న తునక కావడానికి 99.9% ఆస్కారం ఉందని బదులిచ్చారు.

పీపుల్ రికార్డ్ అమేజింగ్ వ్యూ..

జామీ హెర్నాండెజ్ 40-సెకన్ల వీడియోను క్యాప్చర్ చేశారు. అతను కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని కింగ్ కాంగ్ బ్రూయింగ్ కంపెనీలో సెయింట్ పాట్రిక్స్ డేని జరుపుకుంటున్నాడు. అద్భుతమైన దృశ్యాన్ని చూసిన త్వరగా రికార్డ్ చేయడం ప్రారంభించిన వ్యక్తుల సమూహంలో ఒకడు.

మేము షాక్‌లో ఉన్నాం..

అని జామీ హెర్నాండెజ్ APకి పంపిన ఇమెయిల్‌లో.. ‘మేము షాక్‌లో ఉన్నాం, కానీ మేము దీన్ని చూసినందుకు ఆశ్చర్యపోయాం. ఇంతకు ముందు మాలో ఎవరూ ఇలాంటివి చూడలేదు. ఆ తర్వాత, కింగ్ కాంగ్ బ్రూయింగ్ కంపెనీ యజమాని హెర్నాండెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో “క్రేజీ బాణసంచా” అని పిలిచే ఒక వీడియోను బ్రూవరీపైకి ఎగిరిన వీడియోను పోస్ట్ చేశాడు.

ఏంటా కాంతి.. ?

అయితే, ఆకాశంలో కనిపించిన ఈ కాంతి ఏంటనేది ఇప్పుడు అమెరికా ఖగోళ పరిశోధకులకు పెద్ద ప్రశ్నగా మారింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లోని ఖగోళ శాస్త్రవేత్త అందించిన సమాచారం ప్రకారం, ఇది అంతరిక్ష శిథిలాలు అని తెలిపారు. ఖగోళ శాస్త్రవేత్త అంతరిక్ష శిథిలాలను కాల్చడం వల్ల కాంతి చారలు 99.99 శాతం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పారు.

లండన్​లోని భారత హైకమిషన్​పై ఖలిస్తానీల దాడి.. కేంద్రం సీరియస్

లండన్​లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీసుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పంజాబ్​లో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం సెర్చ్ కొనసాగుతుండటం, అతని మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో లండన్​లో పలువురు ఖలిస్తాన్ మద్దతుదారులైన సిక్కులు నిరసనలు తెలిపారు. ఇండియన్ హై కమిషన్ ఆఫీస్​ వద్దకు చేరుకుని, బిల్డింగ్​పై ఉన్న త్రివర్ణ పతాకాన్ని తొలగించారు.

ఈ ఘటనపై ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్​కు మన విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. హై కమిషన్ వద్ద సెక్యూరిటీ కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై అలెక్స్ ఎలిస్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఇండియన్ హై కమిషన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటిని తాము ఆమోదించబోమని ట్వీట్ చేశారు.

కుక్కపై వ్యక్తి అత్యాచారం.. కేసు నమోదు చేసిన పోలీసులు

బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. పట్టపగలు వీధి ఆడ కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ చర్య అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దారుణ ఘటన హోలీ రోజున జరిగింది. ఫుల్వారీ షరీఫ్ లోని ఫైసల్ కాలనీలో ఇది చోటు చేసుకుందని ప్రియా అనే జంతు ప్రేమికురాలు వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భూరి ఫౌండేషన్ అనే జంతు స్వచ్ఛంద సంస్థ నుంచి ఆమె ఫిర్యాదు చేసింది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కోరారు. దీంతో పాట్నా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దుశ్చర్యపై ఫిర్యాదు అందింది. ఐపీసీ, జంతు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫుల్వారీ షరీఫ్ మనీష్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి అసహజమైన, హేయమైన చర్య జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో ఢిల్లీ ఇంద్రపురి ప్రాంతంలోని జేజే కాలనీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అక్కడ ఆడ కుక్కపై అత్యాచారం చేస్తూ సతీష్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.

నాగ్ పూర్ లోని హడ్కేశ్వర్ ప్రాంతంలో కూడా 40 ఏళ్ల వ్యక్తి వీధికుక్కపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నంచాడు. ఈ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో నిందితుడిపై సెక్షన్ 377(ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా శారీరక సంబంధం), 294( అశ్లీలత), భారతీయ శిక్షాస్మృతి, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఇతర నేరాల కింద అభియోగాలు మోపారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. ముంబై పోవాయ్ లోని హీరా పన్నా మాల్ లో 6 నెలల కుక్కపిల్లపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో జంతు కార్యకర్త, బాంబే యానిమల్ రైట్స్ అనే స్వచ్చంద సంస్థ అతడిపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

టాటా, ఎయిర్‌బస్‌ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం

రక్షణ శాఖ కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న అత్యాధునిక విమానం C-295. ఇటీవల విడుదలైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ వీడియోలు, ఇమేజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అధునాతన విమానాన్ని టాటా మరియు ఎయిర్‌బస్‌ సంస్థ కలిసి రూపొందిస్తున్నాయి. వాయుసేనకు అందించనున్న 16 మధ్య తరహా విమానాల్లో ఇది మొదటిది.

మొత్తం.. 56.. C-295 విమానాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది. అనంతరం.. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఎయిర్‌బస్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎప్పటినుంచో వాడుతున్న అవ్రో విమానాలకు బదులుగా ఈ కొత్త విమానాలను తెప్పిస్తున్నారు. అవి వస్తే.. మన వాయుసేన ఆధునికీకరణ దిశగా మరో ముందడుగు వేసినట్లు అవుతుంది.

ఏడాది తర్వాత ఈ రెండు కంపెనీలు C-295 విమానాల తయారీ మరియు అసెంబ్లింగ్‌ కోసం పరస్పరం సహకరించుకోనున్నాయి. భవిష్యత్తులో టాటా సంస్థే సొంతగా ఈ విమానాలను రూపొందించనుంది. తద్వారా.. సైనిక విమానాన్ని తయారుచేసిన తొలి భారతీయ ప్రైవేట్‌ సంస్థగా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు ప్రధాని మోడీ 2022 అక్టోబర్‌లో గుజరాత్‌లోని వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యానిఫ్యాక్షరింగ్‌ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన కూడా చేశారు.

ఈ ప్రాజెక్టు విలువ 21 వేల 935 కోట్ల రూపాయలు. ఇదిలాఉండగా ఎయిర్‌బస్‌ సంస్థ నుంచి మొదటి 16.. C-295 విమానాలు ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి 2025 ఆగస్టు మధ్య కాలంలో అందనున్నాయి. మొట్టమొదటి మేడిన్‌ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ మాత్రం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది.

100 కార్లు, గంట పాటు ఛేజ్.. ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్..

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వివాదాస్పద నేత అమృత్‌పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ మొత్తం రేపు మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పంజాబ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏడు జిల్లాల పోలీసులు పక్కా ప్రణాళితో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడిని అరెస్ట్ చేశారు. సినిమాను తలపించే విధంగా 100 కార్లు గంటపాటు ఛేజ్ తర్వాత అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు అతడి మద్దతుదారులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయకు మద్దతుగా మోహాలీలో కొంతమంది ఆందోళన నిర్వహించారు.

జీ 20 సదస్సు ముగిసిన తర్వాతి రోజు పంజాబ్ పోలీసులు పకడ్భందీ వ్యూహంతో అరెస్ట్ చేశారు. జలంధర్ షాకోట్ కు వస్తున్నట్లు వార్తలు రావడంతో రహదారులను దిగ్భంధించి, పక్కా వ్యూహంతో అతడు ఉన్న గ్రామాన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా.. అమృత్ పాల్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు 100 కార్లతో గంటపాటు ఛేజ్ చేసి జలంధర్ లోని నాకోదార్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి అరెస్ట్ పై అధికారిక ప్రకటన రాలేదు.

‘వారిస్ పంజాబ్ దే’ సంస్థను ప్రారంభించిన దీప్ సిద్దూ మరణించిన అనంతరం ఈ సంస్థకు అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 24లో అతడి అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే, ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పైనే తన మద్దతుదారులతో కలిసి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, ఎస్పీకి గాయాలు అయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అమృత్ పాల్ సింగ్ నేపథ్యం:

సిక్కుల కోసం ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్తాన్ పేరిట పంజాబ్ యువతను ప్రభావితం చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. 2022 ఫిబ్రవరి వరకు అతడు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దీప్ సిద్దూ కార్ యాక్సిడెంట్ లో మరణించాడో, అప్పటి నుంచి ‘వారిస్ పంజాబ్ దే’కు నాయకత్వం వహిస్తూ తన అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నాడు. దుబాయ్ లో బంధువుల వ్యాపారం చూసుకుంటే ఉండే అమృత్ పాల్ సింగ్ ఇండియాకు వచ్చి ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని మళ్లీ తట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంజనీరింగ్ చదివిన 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ తొలినాళ్లలో తలపాగా చుట్టుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఖలిస్తానీ దేశం కోరుతూ యువతను రెచ్చగొడుతూ పాపులర్ అయ్యాడు.

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన ట్రైనీ చార్టర్ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు దుర్మరణం పాలయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భక్కుటోలా గ్రామంలోని దట్టమైన అడవిలో ట్రైనీ చార్టర్ విమానం కూలిపోయింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఇందులో ఒక పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, మరొకరి మృతదేహం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

కిర్నాపూర్‌లోని భక్కుటోలా వద్ద ట్రైనర్ విమానం కూలిపోయిందని పోలీసులకు సమాచారం అందిందని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య మిశ్రా తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసు బలగాలు బయలుదేరాయి. మృతుల పేర్లు, విమానం ఎక్కడికి వెళుతోంది, విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా సరైన సమాచారం లేదు. అయితే ప్రాథమిక దర్యాప్తులో, కూలిపోయిన విమానం మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో నిర్వహిస్తున్న ఫ్లై స్కూల్‌కు చెందినదిగా గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల బృందం సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక మార్చి 20న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కిర్నాపూర్ సమీపంలోని లాంజీ తహసీల్‌లో లాడ్లీ బహనా యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలాఘాట్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి బాలాఘాట్‌ పర్యటనకు రాకముందే విమాన ప్రమాదం సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

తోషాఖానా కేసు విచారణకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైందని పాక్ మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ పాకిస్తాన్‌లోని లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఇమ్రాన్‌ఖాన్‌ ప్రయాణిస్తున్న కారు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.

ఇమ్రాన్ ఖాన్‌పై తోషాఖానా కేసులో విచారణ తిరిగి ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ఎంత ప్రయత్నించినా మాజీ ప్రధాని అరెస్టును తప్పించుకున్నారు. విచారణకు ముందు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ, “నా అన్ని కేసులలో నాకు బెయిల్ వచ్చినప్పటికీ, పీడీఎం ప్రభుత్వం నన్ను అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు ఇప్పుడు స్పష్టమైంది. వారి దుర్మార్గపు ఉద్దేశాలు తెలిసినప్పటికీ, నేను ఇస్లామాబాద్ కోర్టుకు వెళుతున్నాను, నేను చట్టబద్ధమైన పాలనను విశ్వసిస్తున్నాను. అయితే ఈ మోసగాళ్ల దుర్మార్గపు ఉద్దేశం అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది.” అని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లోని జమాన్ పార్క్‌లోని తన నివాసం నుంచి తన పార్టీ కార్యకర్తల కాన్వాయ్‌తో కలిసి బయలుదేరినట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. గతేడాది నవంబర్‌లో జరిగిన హత్యాయత్నంలో ప్రాణాలతో బయటపడిన ఇమ్రాన్‌ఖాన్‌కు భద్రత కల్పించేందుకు కోర్టుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులను కూడా మోహరించారు. ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 విధించబడింది. గత విచారణలో ఇమ్రాన్ ఖాన్ తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను సస్పెండ్ చేయాలని కోరాడు. దానిని కోర్టు తిరస్కరించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తనకు వచ్చిన బహుమతులను తోషాఖానా అనే స్టేట్ డిపాజిటరీ నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, వాటిని లాభాల కోసం విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో విచారణకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

A vehicle in the convoy of former Pakistan PM Imran Khan met with an accident as he heads to Islamabad in connection with the hearing into the Toshakhana case: Pak media pic.twitter.com/kdLxTWwIGQ

— ANI March 18, 2023

3 అడుగుల బాడీ బిల్డర్ కు.. 4 అడుగుల అమ్మాయితో పెళ్లి

మహారాష్ట్రకు చెందిన పొట్టి బాడీబిల్డర్ విఠల్ మోహిత్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. 28 ఏళ్ల ఈ పొట్టి బాడీబిల్డర్.. తనలాగే పొట్టిగా ఉన్న 4 అడుగుల 2 అంగుళాలు ఉన్న జయ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. వీళ్లిద్దరూ నాలుగేళ్ల క్రితం కలుసుకున్నారు.. అప్పటి నుంచి వీరు స్నేహితులుగా ఉంటూరు వచ్చారు. ఈ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వచ్చింది.

2021లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీ బిల్డర్ పోటీల్లో గెలిచి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. 2012లో కసరత్తులు ప్రారంభించాడు. బరువులు ఎత్తటానికి ఎంతో కష్టపడ్డాడు. అయినా పట్టువదలకుండా ఐదేళ్లు కష్టపడి.. 2016లో మొదటిసారి పొట్టి బాడీ బిల్డర్ పోటీల్లో పాల్గొన్నాడు. స్నేహితుల సూచనతో గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ప్రయత్నించి.. విజయం సాధించాడు. 

తన ఎత్తు విషయంలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నాను అంటున్నాడు మోహిత్. అందరిలాగే నాకు కూడా పెళ్లిపై ఎన్నో ఆశలు ఉన్నాయని.. జయ పరిచయంతో ఆ కల నెరవేరిందన్నారు. ఎన్నో ఏళ్లుగా జయ తెలుసు అని.. ఆమెకు ఓ మంచి జీవితం ఇవ్వాలనేదే తన ఆశయం అంటున్నాడు మోహిత్. ఆమె నా కంటే కొంచెం ఎత్తు అని.. మొదట నేనే ఇష్టపడ్డాను అని.. ఆ తర్వాత ఆమె ఇష్టపడటం ప్రారంభించింది అన్నారు ప్రతీక్ మోహిత్. 

హిందూ సంప్రదాయం ప్రకారం.. పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మెహందీతోపాటు బరాత్ కూడా నిర్వహించారు. పెళ్లి దుస్తుల్లో ప్రతీక్ మోహిత్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జోడీ బాగుందంటూ నెటిజన్లు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. పొట్టోడు అయినా గట్టోడు.. పొట్టి బాడీ బిల్డర్ కావటం సామాన్య విషయం కాదని.. ఇప్పుడు పెళ్లి చేసుకుని మరో ఘనత సాధించాడంటూ నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు.

గూగుల్ సీఈఓ పిచాయ్‌కి ఉద్యోగుల లేఖ

గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కి లేఖ రాశారు. గూగుల్ మాతృసంస్థ అల్భాబెట్‌లో పనిచేసే 1400 మందికిపైగా ఉద్యోగులు.. పలు డిమాండ్లను సీఈఓ సుందర్ పిచాయ్ ముందు ఉంచారు. ఇటీవల ఆఫ్స్ ప్రక్రియలో భాగంగా గూగుల్ సుమారు 12 వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికే ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది.ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగులు ఏకమయ్యారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్‌ని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు.

ఉద్యోగులు కొత్త నియామకాలను స్తంభింపజేయడం, స్వచ్ఛంద తొలగింపులను కోరడం, ఉద్యోగ ఖాళీల కోసం తొలగించబడిన కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం, షెడ్యూల్ చేసిన కాలాలను పూర్తి చేయడానికి కార్మికులను అనుమతించడం వంటి అనేక డిమాండ్లను ఉద్యోగులు చేశారు.పేరెంటల్, బిరేవ్‌మెంట్ లీవ్స్‌కు సంబంధించి చెల్లింపులు పూర్తి చేయడం వంటి డిమాండ్లను ఉద్యోగులు ప్రస్తావించారు.

ప్రస్తుతం సంఘర్షణలు జరుగుతున్న, మానవతా సంక్షోభం నెలకొన్న ఉక్రెయిన్‌ వంటి ప్రాంతాల్లో ఉద్యోగులను తొలగించవద్దని కోరారు. ఆ దేశాల్లో వారికి ఉద్యోగం పోతే వీసా లింక్డ్ రెసిడెన్సీ పోతుందని చెప్పారు. “కార్మికుల స్వరాలు ఎక్కడా తగినంతగా పరిగణించబడలేదు మరియు కార్మికులుగా మేము ఒంటరిగా కంటే కలిసి బలంగా ఉన్నామని మాకు తెలుసు.” అని లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు.