TeluguCentralnews

Mar 15 2023, 14:29

అమెరికా నిఘా డ్రోన్ విమానాన్ని ఢీకొట్టిన రష్యా

రష్యా – —ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే.. నల్ల సముద్రంలో తిరుగుతున్న అమెరికా నిఘా డ్రోన్ ను కూల్చేసింది రష్యా. 

నల్ల సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో నిఘా కోసం అమెరికా ఈ డ్రోన్ విమానాన్ని ప్రయోగించింది. దీన్ని గుర్తించిన రష్యా యుద్ధ విమానాలు.. దాన్ని వెంబడించాయి. రష్యా సుఖోయ్ యుద్ధ విమానాల నుంచి రసాయనాలు చల్లాయి. అప్పటికీ అమెరికా డ్రోన్ విమానం జలాల నుంచి వెనక్కి వెళ్లలేదు. ఈ క్రమంలోనే రష్యా యుద్ధ విమానం.. అమెరికా నిఘా డ్రోన్ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ముందు భాగం దెబ్బతిన్నది.

ఈ డ్రోన్ విమానాన్ని పూర్తిగా పేల్చివేయాలని భావించింది రష్యా.. అందుకు తగ్గట్టుగానే రాకెట్ల ద్వారా పేల్చివేయాలని నిర్ణయించాయి. దీన్ని పసిగట్టిన అమెరికా మిలటరీ.. డ్రోన్ విమానాన్ని నల్ల సముద్రంలోని జలాల్లో పడిపోయే విధంగా కూల్చేయాల్సి వచ్చిందని ప్రకటించింది అమెరికా. దీన్ని రష్యా ఖండించింది. మా సుఖోయ్ యుద్ధ విమానాలు అమెరికా నిఘా డ్రోన్ విమానాన్ని పేల్చిసినట్లు చెబుతున్నాయి. ఏ దేశానికి ఆ దేశం విరుద్ధంగా ప్రకటనలు చేస్తుంది. 

ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం క్రమంలో.. అమెరికా .. రష్యా మధ్య పరోక్ష వార్ నడుస్తుంది. ఇప్పుడు ఏకంగా నల్ల సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా డ్రోన్ విమానాన్ని కూల్చేయటంతో.. రష్యాపై ఆ దేశం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

TeluguCentralnews

Mar 15 2023, 14:01

జియో నుండి సరికొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌...

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త రిఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే జియో ప్లిస్‌ స్కీమ్‌ కింద కొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. ఇక రెండు ఫ్యామిలీ ప్లాన్స్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్స్‌లో అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, నెల ఫ్రీ ట్రెయిల్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌ మార్చి 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు జియో తెలిపింది.

ఫ్యామిలీ ప్లాన్స్‌ వివరాలు ఏమిటి..?

రూ.3999 జియో పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో పాటు 75GB డేటా లభిస్తుంది. ముగ్గురు ఫ్యామిలీ మెంబర్లను ఇందులో యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ కోసం రూ.500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. జియో అందుబాటులోకి తీసుకువచ్చిన మరో ప్లాన్‌ రూ.699. ఈ ప్లాన్‌ ద్వారా యూజర్లు అపరిమిత కాల్స్‌, 100GB డేటా, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో కూడా ముగ్గురు ఫ్యామిలీ మెంబర్లను యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అదనంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఓటీటీ వంటి సర్వీసులు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్యాక్‌కు రూ.875 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ కింద తీసుకొనే ఒక్కో నంబర్‌పై అదనంగా రూ.99లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.399ప్లాన్‌ తీసుకునే వ్యక్తితో పాటు మరో ఇద్దరు రూ.99 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తంగా ఈ ప్లాన్‌ తీసుకునేందుకు రూ.399తో పాటు అదనంగా రూ.198 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక జియో వ్యక్తిగతంగా చూస్తే పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లు రూ.299 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ ప్లాన్‌లో 30జీబీ డేటా లభిస్తుంది. అందులో అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌ కింద రూ.375 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫ్రీ ట్రైయిల్‌ సదుపాయం ఉండదు. ఇక మరో ప్లాన్‌ ఏంటంటే రూ.599. దీని కింద అపరిమిత కాల్స్‌, ఆన్‌లిమిటెడ్‌ డేటా, ఆన్‌లిమిటెడ్‌ ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌ కోసం రూ.750 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

TeluguCentralnews

Mar 12 2023, 09:41

*ఈ రోజు కర్ణాటకలో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభించునున్న ప్రధాని మోడీ*


1. నేషనల్ హైవేపై అథారిటీ చే నిర్మించబడ్డ

118 కి.మీ పది-లేన్ యాక్సెస్-నియంత్రిత బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరు మరియు రాష్ట్ర సాంస్కృతిక రాజధాని మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని ప్రస్తుతం ఉన్న మూడు గంటల నుండి 75-90 నిమిషాలకు తగ్గిస్తుంది. 8,480 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రహదారిని నిర్మించిన ఈ ప్రాజెక్ట్ యొక్క పునాది రాయిని మార్చి 2018లో వేశారు. ఇది అక్టోబర్ 2022 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే, కోవిడ్-19 ఇతర కారణాల వల్ల కాస్త ఆలస్యం అయింది

ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల బెంగళూరు వాసులు ఊటీ, వాయనాడ్, కోజికోడ్, కూర్గ్ మరియు కన్నూర్ వంటి ప్రాంతాలకు వారాంతపు సెలవుల కోసం వెళ్లే వారి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం కర్నాటకలోనే కాకుండా తమిళనాడు మరియు కేరళలో కూడా పర్యాటకాన్ని పెంచుతుంది.

2. కర్నాటక ధార్వాడ్ లో ఐఐటీ కట్టాలి అని 1996-98మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకున్నారు. చివరకు మోడీ ప్రభుత్వం వచ్చాక 2016లో తాత్కాలిక భవనాల్లో ఐఐటీ ప్రారంభించారు.

ఈ రోజు మోడీ ₹852 కోట్ల ఖర్చుతో నిర్మించిన నూతన శాశ్వత భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ భవనం దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ మరియు పర్యావరణ సముదాయంగా తీర్చిదిద్దబడింది.ఇప్పటికే ఈ ఐఐటీ నుండి రెండు బాచ్ ల విద్యార్థులు బయటకు వెళ్లారు. ప్రస్తుతం 700 మంది విద్యార్థులు చదువుతున్నారు 

3. కర్ణాటకలో బాగా బిజీగా ఉండే హోస్పెట రైల్వే స్టేషన్ ని కర్ణాటక సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ₹22కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు.

కొత్తగా రిటైరింగ్ రూమ్స్, ఫుడ్ ప్లాజాలు ప్రయాణీకులకు మరెన్నో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.. దీనిని ఈ రోజు మోడీ ప్రారంభిస్తారు.

TeluguCentralnews

Mar 09 2023, 19:18

ఇటలీలోని ట్రెంట్ పట్టణం వింత ఆచారం...

ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తే హామీలు అమలు చేయకుంటే చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీగా స్థానికులు చెప్తున్నారు. 

ఈ విధంగా చేస్తే వారికి బుద్ది వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనిని కోర్టు ఆఫ్ పెనింటెన్స్ గా కూడా పిలుస్తారు.

TeluguCentralnews

Mar 09 2023, 17:18

కరెన్సీ నోటుపై పెన్నుతో రాతలు ఉంటే చెల్లవు అని సోషల్ మీడియాలో ప్రచారం... క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

కొత్త కరెన్సీ నోటుపై ఏమైనా రాస్తే అది చెల్లదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో గత కొద్ది కాలంగా వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది. 

మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న   ఇప్పటికీ చాలా లావాదేవీలు నోట్ల ద్వారానే జరుగుతున్నాయి. దీంతో అటు వ్యాపారులు కస్టమర్లు ఇద్దరు ఆందోళనకు గురవుతున్నారు. 

మరి దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం...

 PIB ఫ్యాక్ట్ చెక్ వైరల్ సందేశాన్ని పరిశోధించినప్పుడు, RBI పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ పూర్తిగా ఫేక్ అని పెన్నుతో వ్రాసిన నోట్లు చెల్లవు అనేది అబద్ధమని PIB ఫ్యాక్ట్ చెక్ తన విచారణలో తెలిపింది. 

  క్లీన్ నోట్ పాలసీ ప్రకారం, కరెన్సీ నోట్లపై ఏమీ రాయొద్దని, అలా చేయడం వల్ల నోట్లు పాడైపోయి, అవి చిరిగిపోయే ప్రమాదం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

TeluguCentralnews

Mar 09 2023, 16:52

పారాదీప్ తీరంలో గూఢచర్య పావురం

 మత్య్సకారులు ఒడిశాలోని తీరంలో  చిన్న కెమెరా, మైక్రోచిప్‌తో అమర్చబడిన ఓ పావురాన్ని తమ బోట్లో గుర్తించారు. వెంటనే జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ మెరైన్ పోలీసులకు అప్పగించారు. 

దానిని పరీక్షించిన పోలీసులు.. పావురం రెక్కపై కోడ్ నంబర్‌తో మెసేజ్ ఉన్నట్లు, పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని... దానికి అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం తీసుకుంటామని జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ రాహుల్  తెలిపారు.

దీనిని గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

TeluguCentralnews

Mar 03 2023, 10:55

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించాడని.. వ్యక్తిపై కాల్పులు

ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే దాడులకు పాల్పడడం, దారుణంగా వ్యవహరించడం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న విషయాలకే నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ గురిచేస్తోంది. వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించినందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లో కుక్కల మరణంపై మాటల యుద్ధం తర్వాత పెంపుడు జంతువుల యజమానుల వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించబడిన ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి గాయపరిచారని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన ఫిబ్రవరి 26న జరిగింది. రాజ్‌కమల్ అనే బాధితుడి చేతికి, కడుపులో గాయాలయ్యాయి.

ముగ్గురు నిందితులను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.నిందితులను జావెలిన్ త్రోయర్ హితేష్ అలియాస్ డేవిడ్ (23), నోయిడాలో టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆనంద్ కుమార్ (26), టోల్ ప్లాజా ఉద్యోగి భూపేందర్ అలియాస్ భీమ్ (30)గా గుర్తించారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు రెండు కాట్రిడ్జ్‌లు, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒక నెల క్రితం ఆనంద్ కుమార్ కుక్క డాగ్‌ఫైటింగ్ సమయంలో చనిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని వ్యంగ్య సందేశాలు షేర్ చేయబడ్డాయి. దాని వల్ల మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత రాజ్‌కమల్ ఆనంద్‌కుమార్‌ను వాట్సాప్‌ గ్రూప్ నుంచి తొలగించాడు. దీంతో ఆనంద్ రాజ్‌కమల్‌పై పగ పెంచుకున్నాడు. ఫిబ్రవరి 26న, వారు బస్పదంక గ్రామంలో కలుసుకున్నప్పుడు, నిందితులు రాజ్‌కమల్‌ను కాల్చారు. బుల్లెట్ రాజ్‌కమల్ చేతికి, కడుపులో తాకిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పటౌడీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

TeluguCentralnews

Feb 23 2023, 14:44

పోస్టింగ్ ఇవ్వడంలేదని రోడ్డుపై నగ్న ప్రదర్శన చేసిన నర్సు

ఓ నర్సు ఉద్యోగం కోసం రోడ్డుపై నగ్నంగా నిరసన చేపట్టింది. పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నగ్నంగా మారి రోడ్డుపై నిరసనకు దిగింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

ఎస్ఎంఎస్ వైద్య కాలేజీ ఎదుట మహిళ నగ్న ప్రదర్శన చేసింది. అజ్మీర్ జిల్లాకు చెందిన ఈమె జాఎల్ఎం రోడ్డుపై ఆస్పత్రికి ముందు బుధవారం ఈ ఆందోళన చేపట్టింది. ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆ రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులంతా ఆ మహిళను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత కొందరు మహిళలు ఆ మహిళ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. దుస్తులు వేసుకోవాలని మహిళా కానిస్టేబుళ్లు విజ్ఞప్తి చేసినా ఆమె వినిపించుకోలేదు. ఎంత చెప్పినా దుస్తులు వేసుకునేందుకు నిరాకరించింది. ఇక చేసేది లేక ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్టు స్టేషన్‌కు తరలించారు. పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో ఆమె ఈ తరహా నిరసనకు దిగారు.

TeluguCentralnews

Feb 23 2023, 14:15

Green Growth: పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత - మోదీ

కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రీన్ గ్రోత్ పై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ మార్కెట్ లో భారత్ ను అగ్రగామిగా నిలుపుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘భారత ప్రజలకు పర్యావరణ పరిరక్షణ అనేది బాధ్యత. అంతేకానీ బలవంతం కాదని మోడీ అన్నారు.

మెరుగైన వాతావరణం లేకుండా మానవ సాధికారత అసాధ్యమని, సమగ్రతతో ముందుకు వెళ్లాలని ప్రధాని కోరారు. గ్రీన్ గ్రోత్ వృద్ధిపై ప్రసంగించిన మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ లో పెట్టుబడులు పెట్టాలని విద్యుత్ రంగ సంస్థలను మోడీ ఆహ్వానించారు.

గ్రీన్ గ్రోత్ ప్లాన్ లో భాగంగానే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, గోబర్గాన్ స్కీమ్ లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

TeluguCentralnews

Feb 23 2023, 12:19

చైనా, తజికిస్తాన్ సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూప్రకంపనలు

మొన్నటి మొన్న టర్కీ, సిరియాలు…ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోయాయి. వరుసగా భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఇదిలావుంటే.. నిన్న భారత్‌ను వరుస భూ ప్రకంపనలు బెంబేలెత్తించాయి. ఇప్పుడు తాజాగా ఈ ఉదయం చైనా , తజికిస్తాన్ సరిహద్దులో 7.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. చైనాలో గురువారం (ఫిబ్రవరి 23) రాత్రి 8:37 గంటలకు జిన్‌జియాంగ్‌లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తూర్పు తజికిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.

చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (సిఇఎన్‌సి) ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూకంపాన్ని ధృవీకరించగా, యుఎస్ జియోలాజికల్ సర్వే తజికిస్తాన్‌లో ఈ ప్రకంపనల గురించి తెలియజేసింది. ఇంత ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా, అక్కడ పరిస్థితి గురించి మరింత సమాచారం రావల్సి ఉంది.