*డాక్టర్ ప్రీతి మృతికి వివిధ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన*
భద్రాద్రి కొత్తగూడెం
వివిధ జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన డాక్టర్ ప్రీతి కి ఘన నివాళి
దోషులను కఠినంగా శిక్షించాలి.
ర్యాగింగ్ కారణంగా డాక్టర్ ధారావత్ ప్రీతి మృతి తీరనిలోటని ప్రీతి మరణానికి కారకుడైన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటన మరల పునర్వతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్తూపం వద్ద డాక్టర్ ప్రీతికి ఘన నివాళి అర్పించారు. వారి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
టి.టి.డబ్ల్యు.జె.ఏ, టి.యూ. డబ్ల్యు.జె,(టి.జె.ఎఫ్), టి.యూ. డబ్ల్యు.జె(ఐ.జె.యూ) ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో బానోత్ వీరు, కల్లోజి శ్రీనివాస్, ఉదయ్ కుమార్,పోలిశెట్టిరమేష్, వట్టికొండ రవి,షఫీ,ఈశ్వర్, రమేష్,శంకర్,రాందాస్, అశోక్, చిరంజీవి, లక్ష్మణ్,హరి, కోటి,రాము,రామకృష్ణ, సర్వేశ్,ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు గుండెపూడిసతీష్,బాబురెడ్డి నాగేశ్వరరావు, కరుణాకర్ ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Feb 28 2023, 12:18