ఆ నేత జన ఉద్దరణకే అంకితం
పదవి లేకున్నా గ్రామాల అభివృద్ధి
నేడు వైస్ ఎంపీపీ
Street Buzz news:
1968వ ఏటా ఆర్ఎస్ఎస్ లో చేరి..ప్రజా సేవకు పూనుకున్న ఆ నాయకుడు విద్యార్థి దశ నుంచే గ్రామాల అభివృద్ధి పట్ల అంకితమై..అభివృద్ధికి బాటలు వేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన పోల్నేని రాజేశ్వర్ రావు మొట్ట మొదటిసారిగా 1999లో రంగాపురం గ్రామ వార్డు సభ్యునిగా ఎన్నికై ఉపసర్పంచ్ పదవిలో కొనసాగారు. అనంతరం ఉప సర్పంచ్ పదవిలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బిజెపి అభ్యర్థిగా రంగాపురం ఎంపీటీసీగా గెలుపొందారు. బిజెపిలో క్రియాశీలకంగా పార్టీ ప్రతిష్టకు పాల్పడ్డారు. అనూహ్యంగా 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన ఆయన నాటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ.. మండలంలో రమణారెడ్డికి ముఖ్య అనుచరునిగా ఎదిగారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగగా.. భూపాలపల్లి నియోజకవర్గంగా అవతరించింది. ఆ సమయంలో రమణారెడ్డి విజయానికి ఆయన విశేష కృషి చేశారు. అనంతరం 2016లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని అలంకరించారు. తెలంగాణ సెంటిమెంట్ విపరీతంగా ఉన్నప్పటికీ 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి విజయానికి మండలంలో కీలకపాత్ర పోషించారు. 2019 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో రంగాపురం ఎంపీటీసీగా గెలుపొందిన రాజేశ్వర్ రావు ప్రస్తుతం మొగుళ్ళపల్లి వైస్ ఎంపీపీగా పదవిలో కొనసాగుతున్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన నినాదంతో గండ్ర వెంకటరమణారెడ్డి వెంట నేను సైతం అంటూ..తన అనుచర వర్గంతో టిఆర్ఎస్ లో చేరారు. మండలంలోని అంకుషాపురం, మొగుళ్లపల్లి, మేదరమెట్ల, రంగాపురం గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేయడం రాజేశ్వర్ రావు ఘనతగా ప్రజలు కీర్తిస్తున్నారు. అంకుశాపురం నుంచి మొగుళ్ళపల్లి వరకు రూ. ఐదు లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టి పూర్తిచేసిన అనంతరం ఐదు సంవత్సరాల వరకు బిల్లులు రాకపోవడంతో నష్టం వాటిల్లిన రాజేశ్వర్ రావు తన స్వంత భూమి 5 ఎకరాల 30 గుంటల భూమిని అమ్ముకున్నారు. అదేవిధంగా మెదరమెట్ల గ్రామంలో నల్లాల బావి త్రవ్వించి..గ్రామంలోని ప్రతి వార్డుకు పైప్ లైన్ నిర్మించి మంచినీటి వసతిని కల్పించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం భూమిని కొనుగోలు చేసి రెండు స్కూల్ బిల్డింగ్స్ కట్టించారు. అలాగే రంగాపురం గ్రామంలో నల్లాల బావి తవ్వించి.. గ్రామంలోని ప్రతి వార్డుకు పైప్ లైన్ వేయించి తాగునీటి వసతిని కల్పించారు. రెండు అంగన్వాడి భవన నిర్మాణాలకు భూమి సరిపోకపోతే భూమిని కొనుగోలు చేసి రెండు అంగన్వాడీ భవనాలను, రెండు పాఠశాలల భవనాలను నిర్మించి వసతులను కల్పించారు. స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న కాలంలో గండ్ర వెంకటరమణారెడ్డి రైతు సమస్యలపై పాదయాత్ర నిర్వహించగా ఆయనతో పాటు 27 రోజులు నిమ్మరసం తాగుతూ పాదయాత్రలో పాల్గొనడం గమనార్హం.
Feb 22 2023, 07:44