మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయండి
ఈనెల 23న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయండి - సిపిఐ శ్రేణులకు మర్రి వెంకటస్వామి పిలుపు
Street Buzz news కరీంనగర్ జిల్లా:
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ నెల 23వ తేదీన కరీంనగర్ నగరానికి మొట్టమొదటి సారి విచేస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు, పర్యటనను విజయవంతం చేసేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో కరీంనగర్ నగరంలోని భారత కమ్యూనిస్టు పార్టీ శాఖా కార్యదర్శుల సమావేశం కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిందని నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ సీపీఐ కరీంనగర్,పెద్దపల్లి, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల జిల్లాల జనరల్ బాడీ సమావేశము ఈ నెల 23న కరీంనగర్ నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో జరుగనున్నదని ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ హాజరవుచున్నారని, ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని పార్టీ నిర్మాణం పెంచుకోవడం కోసం ప్రజాసంఘాలను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర కార్యదర్శి దశ దిశ నిర్దేశం చేయనున్నారని వెంకటస్వామి తెలిపారు. నగరంలోని పార్టీ నాయకులను,కార్యకర్తలను సమావేశంనకు అధిక సంఖ్యలోతరలించాలని,నగరాన్ని ఎరుపుమయం చేయడానికి, తోరణాలు, జెండాలతో అలంకరించాలని వెంకటస్వామి సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపెల్లి రాజు,బీర్ల పద్మ,శాఖా కార్యదర్శులు కిన్నెర మల్లమ్మ,పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం,కొట్టే అంజలి,న్యాలపట్ల రాజు,సత్యనారాయణ చారి,స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Feb 21 2023, 08:34