అక్కన్నపేట తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా తలపాక కొమురయ్య నియామకం


Street Buzz news సిద్దిపేట జిల్లా:  

అక్కన్నపేట మండలం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం నూతన కమిటీని సిద్దిపేట జిల్లా కార్యదర్శి భక్తుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా తలపాక కొమురయ్య, ఉపాధ్యక్షులుగా పైసలు రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా లింగాల నరసింహులు,అకోజు శ్రీనివాస ,భక్తుల శ్రీనివాస్, కోశాధికారిగా రాయికుంట కుమారస్వామి, వరుస వీరయ్య సహయ కార్యదర్శి గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తెలపక కొమురయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు చంద్రం, జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, వివిధ గ్రామాల అధ్యక్షులకు కార్యదర్శులకు కార్మికులకు కృతజ్ఞతలు తెలియపరచారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని కొమురయ్య తెలిపారు.

యువజన కాంగ్రెస్ నాయకుల పై దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవు

కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీద్ ఖాన్

Street Buzz news వరంగల్ జిల్లా:

(వరంగల్):- యువజన కాంగ్రెస్ నాయకుల పై దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజిద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం నాడు వరంగల్ లో జరిగిన హాథ్ సే హాథ్ జోడోలో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ.రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన నియోజకవర్గంలో చేస్తున్నటువంటి భూకబ్జాలు అక్రమాలపై ఛార్జ్ షీట్ ను తన ప్లెక్సీలో ప్రదర్శిస్తే ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ గుండాలు కర్రలతో, రాడ్లతో మానవత్వం మరిచి విచక్షణ రహితంగా గాయపరిచారని ఇలా భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తూ 

రాజకీయాల్లో ప్రశ్నించడం సహజం అని కానీ ఓర్వలేక ఇలాంటి భౌతిక దాడులకు దిగితే ప్రతి దాడులు కూడా ఉంటాయని తెలుసుకోవాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీద్ ఖాన్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోట పవన్ పై దాడులు చేసిన బీఆర్ఎస్ గుండాలపై చేయించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయాలని అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీద్ ఖాన్ హెచ్చరించారు.

సామ కృష్ణారెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

Street Buzz news రంగారెడ్డి జిల్లా:

(చేవెళ్ల):- దేవుని ఎర్రవల్లి గ్రామానికి సంబంధించినా సామా కృష్ణా రెడ్డి అనే ఇతను ఈ దేశ మహారాజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి, రిజర్వేషన్, రాష్ట్రపతి గురించి, కించెపరిచే విదంగా చేవెళ్ల న్యూస్ అనే వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్ట్ పెట్టారని కాబట్టి ఇతని పైన ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని సోమవారం వివిధ ప్రజా సంఘాల నాయకులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ ముట్టడించారు. దాదాపు 2 గంటలకు పైగా సమయం అవుతున్నా అర్థ రాత్రి అయినా సామా కృష్ణారెడ్డి ని అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడినుండి వెళ్ళబొమని బిస్మించి కూర్చున్నారు.వారు మాట్లాడుతూ దేవునిఎర్రవల్లి గ్రామ సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి తమ్ముడు సామ కృష్ణారెడ్డి ఇతనికి ఏం తెలుసు భారత రాజ్యాంగం విలువ దానిలోని ఒక్కపెజిని కూడా సరిగ్గా చదవనికే రాని దద్దమ్మ ఎవడో వెనక ఉండి చెబితే ఇలాంటి చెత్త పోస్ట్ లు పెడతాడా? పైగా లైక్,, సపోర్ట్ చేయాలని పోస్ట్ చేశాడని ,భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి గురించి భారత రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము గార్ల గురించి, రిజర్వేషన్ల గురించి అవమానిస్తూ చేసిన పోస్టు చేసిన కారణంగా అతని పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని అన్ని ప్రజా సంఘాలు చేవెళ్ళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. FIR చేసే వరకు వినేది లేదని పట్టు పట్టిన సంఘాల నాయకులు.

మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయండి


ఈనెల 23న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయండి - సిపిఐ శ్రేణులకు మర్రి వెంకటస్వామి పిలుపు

Street Buzz news కరీంనగర్ జిల్లా: 

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ నెల 23వ తేదీన కరీంనగర్ నగరానికి మొట్టమొదటి సారి విచేస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు, పర్యటనను విజయవంతం చేసేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో కరీంనగర్ నగరంలోని భారత కమ్యూనిస్టు పార్టీ శాఖా కార్యదర్శుల సమావేశం కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిందని నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ సీపీఐ కరీంనగర్,పెద్దపల్లి, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల జిల్లాల జనరల్ బాడీ సమావేశము ఈ నెల 23న కరీంనగర్ నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో జరుగనున్నదని ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ హాజరవుచున్నారని, ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని పార్టీ నిర్మాణం పెంచుకోవడం కోసం ప్రజాసంఘాలను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర కార్యదర్శి దశ దిశ నిర్దేశం చేయనున్నారని వెంకటస్వామి తెలిపారు. నగరంలోని పార్టీ నాయకులను,కార్యకర్తలను సమావేశంనకు అధిక సంఖ్యలోతరలించాలని,నగరాన్ని ఎరుపుమయం చేయడానికి, తోరణాలు, జెండాలతో అలంకరించాలని వెంకటస్వామి సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపెల్లి రాజు,బీర్ల పద్మ,శాఖా కార్యదర్శులు కిన్నెర మల్లమ్మ,పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం,కొట్టే అంజలి,న్యాలపట్ల రాజు,సత్యనారాయణ చారి,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

పాత పద్ధతిలోనే పన్నుల విధానాన్ని కొనసాగించాలి


సమావేశంలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(చేర్యాల) : - చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు వసూలు చేయాలని జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన జేఏసీ, అఖిలపక్షం సమావేశంలో వారు మాట్లాడుతూ.. చేర్యాల పట్టణ ప్రజల భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పన్నులు పెంచాలి తప్ప ఇస్టా రాజ్యాంగ మున్సిపల్ లో తీర్మానాలు చేసి పెంచే నిర్ణయం చేయడం సబాబు కాదన్నారు. ఇప్పటికే పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు ఇంటి పన్నులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని పాత పద్ధతిలోనే పన్నులు వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై మార్చి 6న మున్సిపల్ కార్యాలయం ముందు జేఏసీ, అఖిలపక్షం ఇంటి పన్ను బాధితుల సంఘం, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి, అవుశర్ల యాదయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య, ఎంఎస్పీ డివిజన్ ఇంచార్జి సనవాల ప్రసాద్, ఇంటి పన్ను బాధితుల సంఘం అధ్యక్షుడు బద్దీపడగ నర్సింహా రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, వైశ్య సంఘం అధ్యక్షుడు నీల శివకుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఉప్పల నాగరాజు, వైశ్య యువజన సంఘం అధ్యక్షులు అయిత సంపత్, జేఏసీ నాయకులు బండి సుదర్శన్, పిల్లి జాస్వ, రాళ్లబండి భాస్కర్, ఆముదాల రంజిత్ రెడ్డి, పుల్లని వేణు, నంగి తిరుపతి, మెర్గోజు సత్యనారాయణ, దొడ్డెని రాజీరెడ్డి, భవణయ్య తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం రాష్ట్రాలకు చెందిన విషయం - నిర్మలా సీతారామన్

పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ కేంద్రం పరిధిలో లేదన్న నిర్మల

ప్రతిపాదనలను జీఎస్టీ మండలి అజెండాలో చేర్చుతామని వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని వివరణ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జైపూర్ లో బడ్జెట్ అనంతర చర్చ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ అంశాలపై స్పందించారు. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశం కేంద్రం నిర్ణయంపై ఆధారపడి లేదని, ఆ నిర్ణయంలో రాష్ట్రాలదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. 

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో పెడుతున్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా జీఎస్టీ మండలి సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించాలని సూచించారు. ఇక చత్తీస్ గఢ్ లో మైనింగ్ స్కాం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు చేపట్టడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు నిర్మల బదులిచ్చారు. ఈడీ కానీ, సీబీఐ కానీ, ఐటీ శాఖ కానీ ముందుగా పూర్తి కసరత్తు చేసి, ప్రాథమిక ఆధారాలు ఉంటేనే దాడులు, తనిఖీలు చేపడతాయని స్పష్టం చేశారు. ప్రతీకార ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఆమె ఖండించారు. వాస్తవాలు తెలియకుండా కాంగ్రెస్ ఈ అంశాలపై రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారు. అవినీతి, అధికార దుర్వినియోగం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు.

వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు ఇంటి స్థలాలు ఇవ్వాలి -టి, ఎస్, జే,ఏ, రాష్ట్ర అధ్యక్షుడు


రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

Street Buzz news సూర్యాపేట జిల్లా:

(సూర్యాపేట):- ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారదులుగా కొనసాగుతున్న వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని లేదా ప్రత్యేక ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్ చేశారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎటువంటి వేతనాలు లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్ధంగా జర్నలిస్టు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించి హైదరాబాద్,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ లో, ఖమ్మం పట్టణ జర్నలిస్టులకు ఇస్తున్న విధంగానే రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.అదేవిధంగా ప్రతి జిల్లా నియోజకవర్గ మండలాల కేంద్రాల్లో జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్బులు ఏర్పాటు చేయాలని జర్నలిస్టుల గౌరవానికి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం హెల్త్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ప్రత్యేకంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది పత్రిక యజమానులు ఇష్టానుసారంగా ధరలు పెట్టి అక్రిడేషన్లను అమ్ముకున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని అర్హత లేని వారు జర్నలిజం లో లేనివారు సైతం అక్రిడేషన్లు కొనుగోలు చేసి ప్రభుత్వ రాయితీల కోసం ఎదురుచూస్తున్నారని అలాంటి వారిని ఏరిపారేసి ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతూ అక్రిడేషన్లు కొనుగోలు చేయలేని పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు.ప్రభుత్వం కొంతమంది స్వార్థపరులైన జర్నలిస్టులు పత్రికల యజమానులు చానల్ల యజమానుల కొన్ని చానల్లో పనిచేస్తున్న స్వార్థ జర్నలిస్టుల మాట మాటలు విని పూర్తిస్థాయి సర్వే చేయకుండా రాష్ట్రంలో అక్కడక్కడ కొంతమందికే ఇంటి స్థలాలు కేటాయించాలని ఒంటెద్దు పోకడ ఆలోచనలు చేస్తే మిగతా జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఎక్కడైతే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుందో అక్రిడేషన్ లకు అతీతంగా ఎన్నో ఏండ్లుగా వర్కింగ్ లో ఉండి డబ్బులు పెట్టి అక్రిడేషన్లు కొనుగోలు చేయలేని నిరుపేద స్థితిలో ఉండి గత ప్రభుత్వాల నుండి ఎలాంటి లబ్ధి పొందని జర్నలిస్టులకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై త్వరలోనే హైదరాబాద్ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమానికి తమతో పాటు కలిసి వచ్చే అన్ని జర్నలిస్టు సంఘాలను కలుపుకొని పోతామని జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కారం కోసం యూనియన్లకు అతీతంగా కలిసికట్టుగా ఉద్యమించేందుకు కలిసి రావాలని ఉద్యమానికి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరాజు జర్నలిస్టులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అధికారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది

Street Buzz news ఎన్టీఆర్ జిల్లా:

నందిగామ(స్క్రోలింగ్) : 

(నందిగామ):- : నందిగామ టౌన్ చాపల మార్కెట్ మరియు రామన్నపేట రోడ్డు నందు మహా భారీ వృక్షాలను తొలగించడాన్ని ఖండిస్తూ తెదేపా నేతలతో నిరసన తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

కామెంట్స్

కమీషనర్ గారు ఇంతటి భారీ అవినీతికి శ్రీకారం మీతోనే మొదలయ్యింది

కమీషనర్ గారే స్వయానా పత్రిక ముఖంగా ఒక ప్రకటన చేశారు.

పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో చెట్లను నరికివేశారు.

స్వయాన కమిషనర్ గారు చెబుతున్నారు 311 చెట్లని సిగ్గుందా చెప్పడానికి? వాళ్లే ప్రకటనలో తెలియజేశారు.

311 చెట్లు కేవలం 1,16,000 ఖరీదా? ఒక గృహిణి,సాధారణ మహిళ నర్సరీకి వెళ్లి ఒక మొక్క కొనాలంటే 150 నుంచి 200 రూపాయల పైబడి అవుతుంది.

30 సంవత్సరాల చెట్టు టన్నులకొద్దీ బరువు కలిగిన ఈ చెట్టు 300 రూపాయలకు ఎలా ఇచ్చారు సిగ్గుందా?

భారీ అవినీతి కళ్ళముందే కనబడుతుంది.దానికి ప్రత్యక్ష సాక్ష్యం మున్సిపల్ కమిషనర్ గారు విడుదల చేసిన ప్రకటన.

ఒక సైకిల్ పై పుల్లలు తీసుకుని వెళ్తే 500 రూపాయలు అవుతుంది అదే ఆటోలో వేసుకుని వెళ్తే 2000 పై మాటే.

ఇటువంటి చెట్టు దాదాపు 50 వేల రూపాయలు ఖరీదు అవుతుంది. ఇలాంటివి వందకు పైగా చెట్లను కొట్టేశారు.

వసూల్ బ్రదర్స్ అవినీతి దాహానికి అధికారులు బలవుతున్నారు.

కొండలు అయిపోయాయి,గుట్టలు అయిపోయాయి ఇప్పుడు చెట్లు

అవినీతిని ఏ విధంగా చేయాలో అధికార పార్టీ నాయకులను చూసి తెలుసుకోవచ్చు.

వైసీపీ పార్టీ నాయకుల స్కాములకు అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారు.

చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారు.

ఇప్పటికైనా అధికారులు తమ శైలిని మార్చుకొని రాజ్యాంగం ప్రకారం వారి వారి విధులను నిర్వర్తించాలి.

జరిగిన అవినీతి పై న్యాయపరంగా కూడా మీ ముందుకు వెళ్తామని హెచ్చరిస్తున్నాము*

కుమారిడి పుట్టిన రోజు సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ

Street Buzz news సూర్యాపేట జిల్లా:

(హుజూర్ నగర్):- ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోల్లపూడి యోహన్ మాట్లాడుతూ ఈరోజు నా పెద్ద కుమారుడు కోల్లపూడి మనోజ్ కుమార్ జన్మదినం శుభ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ప్రజల దీవెనలు ఉండాలని. ప్రేయర్ చేయించి. హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ లో అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి బాధపడుతున్న రోగులకు మా వంతుగా వారికి సహాయం చేయాలని నా కుమారుడికి మంచి జరగాలన్న ఉద్దేశంతో నాలుగు రకాల పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్. శ్రీనివాస్ రెడ్డి,సిఎస్ఐ పాస్టర్ ట్రెజరర్, కోల్లపూడి జ్యోతి కుమార్, కోల్లపూడి యశ్వంత్, బిట్టు, సైదా నాగరాజు, గణేష్ పాల్గొన్నారు.

మాతృభాషే మన భాష కావాలి

శీర్షిక.. "మాతృభాషే ..మన భాష కావాలి."

కవయిత్రి: శ్రీమతి మంజుల పత్తిపాటి

Street Buzz news యాదాద్రి భువనగిరి జిల్లా:

మాతృమూర్తికి ప్రణమిల్లుతూ

మాతృదేవోభవ అని కీర్తిస్తూ...

అమ్మ ఒడిలో నేర్చిన మన తెలుగు భాష 

పలికే ప్రతిపలుకు అమృత గుళికలే.

సంస్కృతీ,సాంప్రదాయాలను 

తిలోదకాలిస్తూ పరభాషా వ్యామోహంలో 

మాతృభాషను దూరం చేస్తూ..

మన విలువలు మనమే కోల్పుతున్నాం కదా,

ఆంగ్లభాష వ్యామోహంలో

మాండలీక పదజాల ఉచ్చారణా మాధుర్యాన్ని 

ఆస్వాదించలేక, మాతృభాషను కించపరిచే

దౌర్భాగ్య స్థితిలోకి దిగజారుతున్నాం...!

ఎండమావిలా ఆకర్షించే పరభాష వ్యామోహంలో

తెలుగు పదాల నుడికారాలు, అలంకార ఛందస్సుతో

హృదయ వీణలు మీటే పద్యాల అర్థాలకు తిలోదకాలిస్తున్నాం.

అంకుల్, ఆంటీ అనే పిలుపులతో

మాతృదేవోభవ, పితృదేవోభవ ,అని చెప్పే  

మాతృభాషను కనుమరుగు చేస్తున్నాం..!

ధన వ్యామోహంతో విదేశాల్లో ఉద్యోగాల వేటలో

మాతృభాషను "ఆప్షన్"లా వాడేస్తున్నాం.

ఎంత ఎదిగినా ,

ఏ దేశంలో నివశిస్తున్నా!సంపాదన ఎంతైనా

"దేశం భాషలందు తెలుగు లెస్స "అని కీర్తించిన

రాయలవారి మాట.

మన మాటగా విశ్వమంతా ప్రతిధ్వనించాలి..

మాతృభాషను కాపాడుకోవడం మన కర్తవ్యం.

మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకో తప్పులేదు. మాతృభాషపై మమకారం చంపుకోవడం తప్పు.

అమ్మా!అనే పిలుపులోని భాగ్యదక్కించుకో

మమ్మీ అని పిలుస్తూ అమ్మను దూరం చేసుకోకు.

మానవ సంబంధాలను గౌరవిద్దాం.

మన భాషను మనమే కాపాడుకుందాం.

మన ఉనికి మన భాషే అని చాటుకుందాం.

అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ(Feb21) శుభాకాంక్షలు మనసారా తెలుపుకుందాం.

మీ

శ్రీమతి మంజుల పత్తిపాటి కవయిత్రి

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

బ్రాహ్మణ సేవా వాహిని

యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు.

సెల్.9347042218